Latest Updates
-
దేవీ నవరాత్రులు..ఇంట్లోనే సులభంగా కలశ ప్రతిష్ఠాపన, పూజ ఎలా చేయాలి? -
పాలు తక్కువగా ఉన్నప్పుడు.. టీ చిక్కగా, రుచిగా రావాలంటే ఇలా చేయండి! -
ఛీ ఛీ ఏంటీ పని: 11 ఏళ్ల బాలుడితో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సెర్ నిషా.. -
పిల్లల్లో జలుబు, దగ్గు తగ్గించే కషాయం..టీకి బదులుగా ఇది తాగితే ఫుల్ ఎనర్జీ.. ఇలా చేసుకోండి -
మలబద్ధకం, మొటిమల సమస్యతో బాధపడుతున్నారా? ఈ 3 ఫుడ్స్ తింటే కడుపు శుభ్రం! -
శృంగారంలో అసలైన మజా కోసం..ఈ పూర్వక్రీడ నియమాలు తెలుసుకోండి -
టిఫిన్స్ లోకి అదిరిపోయే టమాటా పల్లి కుర్మా..గిన్నెలు గిన్నెలు కుర్మానే తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రియుడితో పారిపోయిందని.. భార్యను చెట్టుకు కట్టేసి గ్యాంగ్ రేప్ చేయించిన భర్త, బంధువులు.. -
Vellulli Maramaralu Recipe: కరకరలాడే స్పైసీ వెల్లుల్లి మరమరాలు..ఇలా చేసుకుంటే దీన్ని మించిన స్నాక్ ఉండదు! -
ఘుమఘుమలాడే కేరళ స్టైల్ పొటాటో ఫ్రై..సాంబార్, రసంతో నంజుకుని తింటుంటే మస్త్ మజా
నీళ్లకు బదులు పాలతో ఇలా క్రీమీ రవ్వ కేసరి చేయండి..చాలా చాలా టేస్టీగా ఉంటది!
మన ఇళ్లలో పండుగ వాతావరణం నెలకొన్నా, దేవుడికి నైవేద్యం సమర్పించాలన్నా, లేదా సాయంత్రం వేళ హఠాత్తుగా ఏదైనా తీపి పదార్థం తినాలనిపించినా.. క్షణాల్లో గుర్తొచ్చేది రవ్వ కేసరి (సూజీ హల్వా). తక్కువ పదార్థాలతో ఎంతో సులువుగా చేసుకోగలిగే ఈ స్వీట్ ను సాధారణంగా నీళ్లు పోసి తయారు చేస్తుంటారు.
కానీ ఒక్కసారి నీళ్లకు బదులుగా పాలు పోసి క్రీమీ సూజీ హల్వా చేసి చూడండి.. నెయ్యి, పాల కలయికతో వచ్చే ఆ అద్భుతమైన రుచి, నోట్లో వేసుకోగానే కరిగిపోయే మృదువైన ఆకృతి మీ మనసు దోచుకోవడం ఖాయం. క్రీమీ సూజీ హల్వా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
బొంబాయి రవ్వ (సూజీ): 1 కప్పు
కాచి చల్లార్చిన పాలు: 2 కప్పులు
చక్కెర: అర కప్పు నుంచి ముప్పావు కప్పు
నెయ్యి: 4 టేబుల్ స్పూన్లు
జీడిపప్పులు, బాదం పప్పులు: 5-6 చొప్పున
కిస్మిస్: 1 టేబుల్ స్పూన్
యాలకుల పొడి: అర టీస్పూన్
కుంకుమపువ్వు: చిటికెడు
పాలు తక్కువగా ఉన్నప్పుడు.. టీ చిక్కగా, రుచిగా రావాలంటే ఇలా చేయండి!
తయారీ విధానం
-ముందుగా అడుగు మందంగా ఉన్న ఒక పాన్ పొయ్యి మీద పెట్టి, అందులో నెయ్యి వేడి చేయండి. నెయ్యి కరిగాక బొంబాయి రవ్వ వేసి సన్నని మంటపై కలుపుతూ వేయించండి. మంట ఎక్కువగా పెడితే రవ్వ అడుగున మాడిపోయి రుచి పాడవుతుంది. కాబట్టి ఓపికగా వేయించండి.
-రవ్వ లేత బంగారు రంగులోకి మారగానే, అందులో నెమ్మదిగా పాలు పోయండి. పాలు పోస్తున్నంత సేపు గరిటెతో ఆపకుండా కలపాలి, లేదంటే ఉండలు కట్టే ప్రమాదం ఉంది.
-రవ్వ పాలను పీల్చుకుని ఉడకడం ప్రారంభమవుతుంది. మిశ్రమం బాగా
దగ్గరపడితే, అవసరాన్ని బట్టి కొద్దిగా గోరువెచ్చని పాలు
కలుపుకోవచ్చు.
రవ్వ పూర్తిగా ఉడికిన తర్వాత చక్కెర వేసి బాగా కలపండి. చక్కెర
కరిగేటప్పుడు హల్వా కాస్త పల్చబడుతుంది కాబట్టి, సన్నని మంట మీద
కలుపుతూ మరో రెండు నిమిషాలు ఉడికించండి.
-నెయ్యిలో వేయించిన జీడిపప్పు, బాదం, కిస్మిస్, గుమగుమలాడే యాలకుల పొడి, కుంకుమపువ్వు వేసి కలపండి.
-హల్వా గిన్నె అంచులను వదులుతూ, ముద్దగా మారుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. హల్వా చల్లారాక మరింత గట్టిపడుతుంది కాబట్టి, కాస్త జారుగా ఉన్నప్పుడే దించేయడం మంచిది.
-స్టవ్ ఆపేసిన తర్వాత మూతపెట్టి ఓ రెండు నిమిషాలు ఆగి, సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే వేడివేడి క్రీమీ సూజీ హల్వా రెడీ.
-మీరు ఆరోగ్యపరంగా పంచదారను ఇష్టపడకపోతే, దానికి బదులుగా బెల్లం కూడా వాడుకోవచ్చు. అయితే వేడి పాలల్లో బెల్లం వేస్తే పాలు విరిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి స్టవ్ మంటను పూర్తిగా తగ్గించిన తర్వాతే బెల్లం తురుమును కలపాలి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
