Latest Updates
-
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు!
క్రీమీ టమోటో మరియు పాలకూర పాస్తా రెసిపి
క్రీముతో కూడిన టమాటో మరియు పాలకూర పాస్తా చాలా సులభమైన రెసిపి. ఇందులో చాలా ఐరన్ మరియు విటమిన్లు ఉండి మంచి రుచిని అందిస్తుంది. దీన్ని చేయటం అస్సలు కష్టమేమీ కాదు.దీనికి మరింత క్రీమ్ లేదా చీజ్ జతచేసి మరిం
క్రీముతో కూడిన టమాటో మరియు పాలకూర పాస్తా చాలా సులభమైన రెసిపి. ఇందులో చాలా ఐరన్ మరియు విటమిన్లు ఉండి మంచి రుచిని అందిస్తుంది. దీన్ని చేయటం అస్సలు కష్టమేమీ కాదు.దీనికి మరింత క్రీమ్ లేదా చీజ్ జతచేసి మరింత క్రీమీగా, రుచిగా మార్చుకోండి. వారంలో రాత్రి భోజనానికి సరిపోయే ఈ సింపుల్, రుచికర పాస్తా వంటకాన్ని ఎలా తయారుచేయాలో నేర్చుకోండి.

Recipe By: చెఫ్ గౌరవ్ ఛడ్డా
Recipe Type: స్నాక్స్
Serves: 3కి
-
నీరు -1 లీటరు
ఉప్పు రుచికి తగినంత
మాకరోని -2 కప్పులు
ఆలివ్ నూనె -2 చెంచాలు
వెల్లుల్లి రెబ్బలు- తరిగినవి -4
చిన్న ఉల్లిపాయ - తరిగినది -1
మధ్య సైజు టమాటా, తరిగినది -2
మధ్య సైజు మష్రూమ్స్, తరిగినది -3
పాలకూర, తురిమినది -1 కట్ట
డైట్ మయోన్నైస్ -5 చెంచాలు
నల్ల మిరియాల పొడి -1 చెంచా
ఎర్ర బియ్యం కంద పోహా
-
ఒక కుండలాంటి పాత్రను తీసుకుని నీటితో నింపి మరిగించండి.
మాకరోని మరియు ఉప్పును వేయండి.
ప్యాక్ పై ఉన్న సూచనల ప్రకారం 5 నిమిషాల పాటు వండండి.
మాకరోని అడుగున అంటకుండా అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి.
ఒక గరిటెను వాడుతూ 120 మిలీల పాస్తా స్టాకును బీకర్లో పోయండీ.
ఉడికిన పాస్తాను జల్లెడపట్టి కొలాండర్లోకి మార్చండి.
నాన్ స్టిక్ పెనంలో నూనెను వేడిచేయండి (సన్న మంటపై)
వెల్లుల్లి, ఉల్లిముక్కలను వేసి ఉల్లిపాయ రంగు మారేదాకా సుమారు 30 సెకన్లపాటు వేయించండి.
టమాటాను వేసి మెత్తబడే వరకు 1-2 నిమిషాల పాటు ఉడికించండి.
మష్రూమ్, పాలకూర ముక్కలను వేసి పాలకూర నుంచి నీరంతా పోయేదాకా 2-3 నిమిషాలు వేయించండి.
చిటికెడు ఉప్పు, మిరియాల పొడి వేసి రుచిని పెంచండి.
పైన కాయగూరలతో పాటు పాస్తా స్టాకును కూడా వేసి కలపండి.
మంటపై నుంచి పాన్ ను తీసేయండి.
ఇప్పుడు మయోన్నైస్ వేసి బాగా కలపండి.
మళ్ళీ స్టవ్ పై పెటి, 1 నిమిషం పాటు సన్నమంటపై ఉంచండి లేదా సాస్ గట్టిపడేవరకూ ఉంచండి.
పై సాస్ కి మాకరోని జత చేసి మొత్తం పట్టేట్లా తిరగేస్తూ కలపండి.
ఈ వంటకాన్ని అందంగా అలంకరించి వేడిగా వడ్డించండి.
- మీరు మీకు నచ్చిన ఏ రకమైన పాస్తానైనా వాడవచ్చు.
- సరిపోయే పరిమాణం - 1 కప్పు
- క్యాలరీలు - 287 క్యాలరీలు
- కొవ్వు - 10 గ్రాములు
- ప్రొటీన్ - 10 గ్రాములు
- కార్బొహైడ్రేట్లు - 41 గ్రాములు
- చక్కెర - 5 గ్రాములు
- ఫైబర్ - 3 గ్రాములు
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications