Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
పకోడీ కంటే రుచిగా ఉండే ఉల్లిపాయ రింగులు..కొబ్బరి చట్నీతో తింటే కేక..ఎలా చేసుకోవాలంటే..
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. బయట చిటపట చినుకులు పడుతున్న సమయంలో ఇంట్లో వేడివేడిగా కరకరలాడుతూ ఏదైనా తినాలనిపిస్తుదా? అయితే ఓసారి ఉల్లిపాయ రింగులను ట్రై చేయండి. ఘుమఘుమలాడే పిండిలో ముంచి ఉల్లిపాయ రింగులను సలసల కాగే నూనెలో గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయిస్తుంటే ఆ వాసనకే సగం ఆకలి తీరిపోతుంది. ఇక వాటిని కమ్మని కొబ్బరి చట్నీతో కలిపి తింటుంటే ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. ఇది కేవలం ఒక స్నాక్ మాత్రమే కాదు..వర్షపు సాయంత్రాన్ని మరింత అందంగా మార్చే ఒక మ్యాజిక్. నోరూరించే ఉల్లిపాయ రింగులను,కొబ్బరి చట్నీని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
పెద్ద ఉల్లిపాయలు - 2
వాము - 1 టీస్పూన్
కారం- 1 టీస్పూన్
ఉప్పు - సరిపడా
శెనగపిండి - 200 గ్రాములు
బియ్యప్పిండి - 100 గ్రాములు
నీరు - పిండి కలపడానికి తగినంత
నూనె- సరిపడా
పచ్చి కొబ్బరి తురుము - ఒక కప్పు
పచ్చి మిరపకాయలు - 2
ఉప్పు -తగినంత

తయారీ విధానం
-ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో శెనగపిండి, బియ్యప్పిండి, ఉప్పు, కారం , వాము వేసి బాగా కలపండి. ఇప్పుడు కొద్దికొద్దిగా నీళ్ళు పోస్తూ ఉండలు లేకుండా బజ్జీల పిండిలా జారుడుగా కలుపుకోవాలి. పిండి మరీ పల్చగా లేదా మరీ చిక్కగా ఉండకూడదు.
-ఉల్లిపాయలను శుభ్రంగా కడిగి, పొట్టు తీసి, గుండ్రంగా, కొద్దిగా మందపాటి రింగులుగా కోసుకోవాలి. రింగులను విడివిడిగా చేసి పక్కన పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టి అందులో నూనె పోసి మీడియం మంటపై బాగా వేడిచేయాలి. ఇప్పుడు ఉల్లిపాయ రింగులను ఒక్కొక్కటిగా పిండిలో పూర్తిగా ముంచి నూనెలో జాగ్రత్తగా వేయాలి. బాండీకి సరిపడినన్ని మాత్రమే వేయండి.
-ఉల్లి రింగులను రెండు వైపులా అందమైన బంగారు గోధుమ రంగులోకి వచ్చి కరకరలాడే వరకు వేయించుకోవాలి. వాటిని ఒక ప్లేట్ లోని టిష్యూ పేపర్ పైకి తీస్తే, అదనపు నూనె పోతుంది. అంతే నోరూరించే, వేడివేడి ఉల్లిపాయ రింగులు సిద్ధం.
-తర్వాత కొబ్బరి చట్నీ తయారుకోసం.. మిక్సీ జార్ లో తురిమిన కొబ్బరి, పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు వేసి మొదట నీళ్ళు లేకుండా రుబ్బుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా నీళ్ళు పోసి, మెత్తగా, మధ్యస్థ చిక్కదనంతో చట్నీని సిద్ధం చేసుకోవాలి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications