Latest Updates
-
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.!
పిజ్జా తినాలని ఉందా? ఇంట్లో పెనంపైనే 15 నిమిషాల్లో పరాటా పిజ్జా
పిజ్జా పేరు వినగానే మనలో చాలా మందికి నోరూరుతుంది. చీజ్ తో నిండిన, రంగురంగుల కూరగాయలతో అలంకరించబడి ఉండే ఈ ఇటాలియన్ వంటకం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అలాగే మన భారతీయ వంటకాల్లో పరాటాకు ఉన్న స్థానం ప్రత్యేకం. ఈ రెండు అద్భుతమైన వంటకాలను కలిపితే ఎలా ఉంటుంది? ఆ ఆలోచన నుండి పుట్టిందే పరాటా పిజ్జా.
పరాటా పిజ్జా తయారు చేయడం సులభం. ఇంట్లో మిగిలిపోయిన పరాటాలు, చపాతీలు లేదా రెడీమేడ్ పరాటాలతో కేవలం 15-20 నిమిషాల్లో తక్కువ ఖర్చుతో దీనిని చేయవచ్చు. బ్యాచిలర్స్ కూడా దీనిని చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. పరాటా పిజ్జాను ఇంట్లో పెనం మీదనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో ఇక్కడ చూడండి.

పరాటా పిజ్జా తయారీకి కావాల్సిన పదార్థాలు
పరాటాలు - 2
పిజ్జా సాస్ - 4 టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయ - 1
క్యాప్సికమ్ - 1
టొమాటో - 1
స్వీట్ కార్న్ - 2 టేబుల్ స్పూన్లు)
ఆలివ్స్, మష్రూమ్స్, పనీర్ ముక్కలు-కొన్ని
మొజారెల్లా చీజ్ - అర కప్పు
ఒరిగానో - 1 టీస్పూన్
చిల్లీ ఫ్లేక్స్ - అర టీస్పూన్
మిరియాల పొడి - చిటికెడు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె లేదా వెన్న - 1 టేబుల్ స్పూన్
పరాటా పిజ్జా తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ పెనం పెట్టి తక్కువ మంట మీద వేడి చేయండి. దానిపై కొద్దిగా నూనె లేదా వెన్న వేసి పరాటాను వేసి ఒకవైపు మాత్రమే సుమారు ఒక నిమిషం పాటు లేత బంగారు రంగు వచ్చేవరకు కాల్చండి.
-ఇప్పుడు పరాటాను తిప్పి, కాలిన వైపు పైన ఉండేలా చూసుకోండి. మంటను పూర్తిగా తగ్గించి కాలిన వైపు పిజ్జా సాస్ ను సమానంగా రాయండి. అంచుల వరకు రాయకుండా కొద్దిగా ఖాళీ వదలండి.
-సాస్ రాసిన తర్వాత దానిపై సన్నగా తరిగిన ఉల్లిపాయ, క్యాప్సికమ్, టొమాటో, స్వీట్ కార్న్, మీకు నచ్చిన ఇతర కూరగాయలను అందంగా పరచండి.
-కూరగాయలపైన తురిమిన మొజారెల్లా చీజ్ ను చల్లండి. ఆ తర్వాత రుచికి తగినంత ఉప్పు, మిరియాల పొడి, ఒరిగానో, చిల్లీ ఫ్లేక్స్ చల్లండి.
-ఇప్పుడు పెనంపై మూత పెట్టి,మంటను సిమ్ లో ఉంచి చీజ్ పూర్తిగా కరిగేవరకు సుమారు 5-7 నిమిషాలు ఉడికించండి. పరాటా అడుగు భాగం మాడిపోకుండా చూసుకోవాలి. చీజ్ కరిగి, బబుల్స్ రావడం మొదలవ్వగానే స్టవ్ ఆఫ్ చేయండి. అంతే పరాటా పిజ్జా రెడీ.
-పరాటా పిజ్జాను జాగ్రత్తగా ఒక ప్లేట్ లోకి తీసుకుని పిజ్జా కట్టర్ తో ముక్కలుగా కట్ చేసి వేడివేడిగా సర్వ్ చేయండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications