Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
రుచిలో తగ్గేదే లే..నిమిషాల్లో తయారయ్యే క్రిస్పీ సొరకాయ పకోడీ..బజ్జీలు,బోండాలు పక్కన పెట్టేస్తారు!
సాయంత్రం అయ్యిందంటే చాలు మనసు ఏదో ఒక వేడి వేడి స్నాక్ వైపు లాగుతుంది. చేతిలో టీ కప్పు, ప్లేటులో వేడి వేడి పకోడీలు ఉంటే ఆ మజానే వేరు. సాధారణంగా మనం రోడ్డు పక్కన బండ్ల మీద దొరికే మిర్చి బజ్జీ, ఆలు బోండా, ఉల్లిపాయ పకోడీలనే ఎక్కువగా ఇష్టపడుతుంటాం. కానీ ఎప్పుడూ తినేవే కాకుండా, ఈసారి కాస్త కొత్తగా, ఆరోగ్యకరంగా ఇంట్లోనే ఏదైనా ప్రయత్నించాలి అనుకుంటున్నారా?
అయితే సొరకాయ పకోడీ ట్రై చేయాల్సిందే. సొరకాయతో కేవలం కూరలు, సాంబార్ మాత్రమే కాదు కరకరలాడే పకోడీలు కూడా వేసుకోవచ్చు. సొరకాయలో ఉండే పోషకాలు ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు, దీని రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఈ వెరైటీ పకోడీ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
సొరకాయ తురుము: 1 కప్పు
శనగపిండి: 1 కప్పు
బియ్యం పిండి: 2 టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయలు: 2
పచ్చిమిర్చి: 2
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టీస్పూన్
జీలకర్ర: అర టీస్పూన్
ఇంగువ: చిటికెడు
కారం: 1 టీస్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
కరివేపాకు,కొత్తిమీర: గుప్పెడు
నూనె: డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ విధానం
-ముందుగా సొరకాయను శుభ్రం చేసి, చెక్కు తీసి సన్నగా తురుముకోవాలి.
-ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో సొరకాయ తురుము, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, ఇంగువ, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి.
-గుమ్మడికాయ, ఉల్లిపాయలో సహజంగానే నీటి శాతం ఉంటుంది కాబట్టి ముందుగా నీళ్లు పోయకుండా, శనగపిండి, బియ్యం పిండి సొరకాయ తురుము ఉన్న బౌల్ లో వేసి చేత్తో గట్టిగా కలపాలి. అవసరమైతేనే, చాలా తక్కువ పరిమాణంలో నీళ్లు చిలకరిస్తూ పిండిని కలుపుకోవాలి. పిండి మరీ జారుగా ఉండకూడదు, అలాగని మరీ గట్టిగా ఉండకూడదు. పకోడీలు వేయడానికి వీలుగా గట్టి పకోడీ పిండిలా కలుపుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. నూనె బాగా వేడెక్కాక మంటను మీడియంతలో పెట్టుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ నూనెలో పకోడీల్లా వదులుకోవాలి.
-పకోడీలను అటు ఇటు తిప్పుతూ, బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. మంచి రంగు వచ్చాక వాటిని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్ లోకి తీసుకోవాలి. అంతే వేడి వేడి, కరకరలాడే సొరకాయ పకోడీ రెడీ.
-వీటిని టమాటా సాస్ లేదా పుదీనా చట్నీతో సర్వ్ చేస్తే రుచి అమోఘంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications