కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్‌ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే..

Posted By:

చల్లని సాయంత్రం వేళ.. వేడివేడి మసాలా టీ తాగుతూ కరకరలాడే స్నాక్ ఏదైనా తినాలనిపిస్తుందా? అయితే ఓ సారి ఎగ్ పకోడి ట్రై చేయండి. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్‌ గా ఉంటూ.. పుల్లపుల్లగా, కారంగా తగిలే దీని రుచి ఒక్కసారి చూశారంటే మళ్లీ మళ్లీ కావాలంటారు.

ప్రొటీన్ నిండిన గుడ్లతో చేసే ఈ స్నాక్‌ ను పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో దీన్ని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

Crispy Egg Pakoda Recipe The Ultimate 15 Minute Tea Time Snack Make at Home in Telugu

ఎగ్ పకోడి తయారీకి కావలసిన పదార్థాలు

ఉడికించిన గుడ్లు - 4
శనగపిండి - 1 కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
పసుపు - పావు టీస్పూన్
కారం - అర టీస్పూన్
వాము - పావు టీస్పూన్
ధనియాల పొడి - పావు టీస్పూన్
నీళ్లు - పిండి కలుపుకోవడానికి తగినన్ని
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
గార్నిషింగ్ కోసం
ఉప్పు, కారం - కొద్దిగా
చాట్ మసాలా - అర టీస్పూన్
ఉల్లిపాయ ముక్కలు - కొద్దిగా
టమాటా ముక్కలు - కొద్దిగా
వేయించిన పల్లీలు - 2 టేబుల్ స్పూన్లు
మిక్చర్ లేదా సేవ్ - కొద్దిగా
వేయించిన కరివేపాకు - కొద్దిగా
నిమ్మరసం - సగం చెక్క

ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా!

ఎగ్ పకోడి తయారీ విధానం

-ముందుగా ఉడికించిన గుడ్లపై ఉన్న పొట్టు తీసేసి, వాటిని సగానికి లేదా మీకు నచ్చిన విధంగా నాలుగు భాగాలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి.

-ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో శనగపిండి వేయండి. ఇప్పుడు అందులో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, చేతితో కొద్దిగా నలిపిన వాము వేసి పొడి పిండిని బాగా కలపండి. ఆ తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని బజ్జీల పిండిలా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా లేదా మరీ పలచగా ఉండకూడదు.

-స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి, డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోయండి. నూనె బాగా వేడెక్కాక, కట్ చేసి పెట్టుకున్న గుడ్డు ముక్కలను ఒక్కొక్కటిగా శనగపిండి మిశ్రమంలో ముంచి, నెమ్మదిగా నూనెలో వేయండి.

-మంటను మీడియం ఫ్లేమ్‌ లో ఉంచి, పకోడిలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా అన్ని వైపులా తిప్పుతూ కరకరలాడే వరకు వేయించుకోండి. బాగా వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్‌ లోకి తీసుకోండి.

-ఇప్పుడు వేయించిన ఎగ్ పకోడాలను సర్వింగ్ ప్లేట్‌లో పెట్టి, వాటిని చాకుతో మధ్యలోకి కొద్దిగా గాటు పెట్టండి. ఇప్పుడు వాటిపై చిటికెడు ఉప్పు, కారం, చాట్ మసాలా చల్లండి. ఆ పైన సన్నగా తరిగిన ఉల్లిపాయలు, టమాటా ముక్కలు వేయండి. మధ్యమధ్యలో పంటికి తగిలేలా వేయించిన పల్లీలు, మిక్చర్ వేసి.. చివరగా వేయించిన కరివేపాకు చల్లి, కొద్దిగా నిమ్మరసం పిండితే చాలు.

[ of 5 - Users]
Story first published: Friday, September 4, 2026, 12:53 [IST]
Desktop Bottom Promotion