Latest Updates
-
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి! -
సైలెంట్ కిల్లర్స్: పైకి ముక్కుసూటి.. వెనుక మహా కిలాడీలు!..ఈ 3 రాశులు ఎవరో తెలుసా? -
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే.. -
ఫోన్ పక్కనపెట్టి ఇది ట్రై చేయండి.. హృతిక్ చెబుతున్న హెల్త్ టిప్స్! -
నార్త్ స్టైల్ చోలే మసాలా.. పూరీ, చపాతీలోకి వేళ్లు చప్పరిస్తూ లాగించేస్తారు.! -
చికెన్, మటన్ కంటే 50 రెట్లు బలం..ఏడాది పాటు నిల్వ ఉండే బోడకాకరకాయ పచ్చడి ఇలా చేయండి -
వయసు పైబడితేనే అల్జీమర్స్ వస్తుందా.. మతిమరుపునకు దారితీసే ప్రమాదకర కారకాలివే.!
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా!
శ్రీకృష్ణుడు పుట్టినరోజుని శ్రీకృష్ణాష్టమిగా హిందువులు ఎంతో భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా జరుపుకుంటారు. శుక్రవారం(సెప్టెంబర్ 4,2026) శ్రీకృష్ణజన్మాష్టమి జరుపుకుంటున్న నేపథ్యంలో కన్నయ్యకు ఎంతో ఇష్టమైన నైవేద్యాలను కృష్ణ భక్తులు సమర్పిస్తుంటారు
అయితే, మారుతున్న కాలంతో పాటు వేడుకల్లో కూడా కొత్తదనం వచ్చింది. భక్తులు తమ ప్రియమైన కృష్ణుడి పుట్టినరోజున కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేయడం ఒక ట్రెండ్ గా మారింది. సోషల్ మీడియాలో పంచామృత కేక్ బాగా ట్రెండ్ అవుతోంది. కేక్ దూదిలా మెత్తగా, ఎంతో రుచిగా ఉండటమే కాకుండా, నూటికి నూరు శాతం పవిత్రమైనది. కన్నయ్యకు సమర్పించడానికి సరైన నైవేద్యం.

పంచామృత కేక్ తయారీకి కావలసిన పదార్థాలు
జల్లించిన గోధుమ పిండి లేదా బొంబాయి రవ్వ - 1.5 కప్పులు
తాజా పెరుగు - అర కప్పు
కాచి చల్లార్చిన పాలు లేదా పచ్చి పాలు - 3/4 కప్పు
నెయ్యి - పావు కప్పు
తేనె - 2 టేబుల్ స్పూన్లు
పొడి చేసిన పటిక బెల్లం లేదా చక్కెర - 3/4 కప్పు
యాలకుల పొడి - అర టీస్పూన్
బేకింగ్ పౌడర్ - 1 టీస్పూన్
బేకింగ్ సోడా - అర టీస్పూన్
అలంకరణకు: తులసి ఆకులు, వేయించిన మఖానా, కిస్మిస్, బాదం, పిస్తా,
కుంకుమపువ్వు, గులాబీ రేకులు
కృష్ణాష్టమి ఉపవాసం ఉంటున్నారా? అయితే నీరసం రానివ్వని ఈ సగ్గుబియ్యం వడలు ట్రై చేయండి!
పంచామృత కేక్ తయారీ విధానం
-ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకోండి. అందులో అర కప్పు పెరుగు, పావు కప్పు నెయ్యి, రెండు టేబుల్ స్పూన్ల తేనె, ముప్పావు కప్పు పొడి చేసిన చక్కెర లేదా పటిక బెల్లం పొడి వేసి బాగా కలపండి. ఇందులో కొద్దిగా కుంకుమపువ్వు, యాలకుల పొడి వేయండి. చక్కెర పూర్తిగా కరిగి, మిశ్రమం క్రీమ్ లా మృదువుగా అయ్యేంత వరకు విస్కర్ లేదా చెంచాతో 2-3 నిమిషాల పాటు బాగా గిలకొట్టండి.
-ఇప్పుడు ఆ మిశ్రమంలో జల్లించి పెట్టుకున్న గోధుమ పిండి (లేదా రవ్వ) వేస్తూ, ఉండలు కట్టకుండా పాలు పోస్తూ మృదువుగా కలపండి. ఈ మిశ్రమాన్ని 10 నుండి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత అందులో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి సున్నితంగా కలపాలి.
-కేక్ బేక్ చేయడానికి ఒక స్టీల్ పాత్రకు లేదా కేక్ టిన్ కు లోపల కొద్దిగా నెయ్యి రాయండి. సిద్ధం చేసుకున్న కేక్ పిండిని ఆ పాత్రలో పోసి, పైన తరిగిన బాదం పప్పులను చల్లి, 40-45 నిమిషాల పాటు బేక్ చేయండి.
-కేక్ ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక టూత్ పిక్ గుచ్చి చూడండి. దానికి పిండి అంటకుండా శుభ్రంగా వస్తే కేక్ పర్ఫెక్ట్ గా బేక్ అయినట్లే. కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి.
-ఈ అద్భుతమైన కేక్ పై తాజా గులాబీ రేకులు, కృష్ణుడికి ఎంతో ప్రీతిపాత్రమైన తులసి దళాలు, నట్స్ ఉంచి అలంకరించండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications