Latest Updates
-
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు!
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే..
చల్లని సాయంత్రం వేళ.. వేడివేడి మసాలా టీ తాగుతూ కరకరలాడే స్నాక్ ఏదైనా తినాలనిపిస్తుందా? అయితే ఓ సారి ఎగ్ పకోడి ట్రై చేయండి. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉంటూ.. పుల్లపుల్లగా, కారంగా తగిలే దీని రుచి ఒక్కసారి చూశారంటే మళ్లీ మళ్లీ కావాలంటారు.
ప్రొటీన్ నిండిన గుడ్లతో చేసే ఈ స్నాక్ ను పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో దీన్ని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

ఎగ్ పకోడి తయారీకి కావలసిన పదార్థాలు
ఉడికించిన గుడ్లు - 4
శనగపిండి - 1 కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
పసుపు - పావు టీస్పూన్
కారం - అర టీస్పూన్
వాము - పావు టీస్పూన్
ధనియాల పొడి - పావు టీస్పూన్
నీళ్లు - పిండి కలుపుకోవడానికి తగినన్ని
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
గార్నిషింగ్ కోసం
ఉప్పు, కారం - కొద్దిగా
చాట్ మసాలా - అర టీస్పూన్
ఉల్లిపాయ ముక్కలు - కొద్దిగా
టమాటా ముక్కలు - కొద్దిగా
వేయించిన పల్లీలు - 2 టేబుల్ స్పూన్లు
మిక్చర్ లేదా సేవ్ - కొద్దిగా
వేయించిన కరివేపాకు - కొద్దిగా
నిమ్మరసం - సగం చెక్క
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా!
ఎగ్ పకోడి తయారీ విధానం
-ముందుగా ఉడికించిన గుడ్లపై ఉన్న పొట్టు తీసేసి, వాటిని సగానికి లేదా మీకు నచ్చిన విధంగా నాలుగు భాగాలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి.
-ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో శనగపిండి వేయండి. ఇప్పుడు అందులో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, చేతితో కొద్దిగా నలిపిన వాము వేసి పొడి పిండిని బాగా కలపండి. ఆ తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని బజ్జీల పిండిలా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా లేదా మరీ పలచగా ఉండకూడదు.
-స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి, డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోయండి. నూనె బాగా వేడెక్కాక, కట్ చేసి పెట్టుకున్న గుడ్డు ముక్కలను ఒక్కొక్కటిగా శనగపిండి మిశ్రమంలో ముంచి, నెమ్మదిగా నూనెలో వేయండి.
-మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి, పకోడిలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా అన్ని వైపులా తిప్పుతూ కరకరలాడే వరకు వేయించుకోండి. బాగా వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకోండి.
-ఇప్పుడు వేయించిన ఎగ్ పకోడాలను సర్వింగ్ ప్లేట్లో పెట్టి, వాటిని చాకుతో మధ్యలోకి కొద్దిగా గాటు పెట్టండి. ఇప్పుడు వాటిపై చిటికెడు ఉప్పు, కారం, చాట్ మసాలా చల్లండి. ఆ పైన సన్నగా తరిగిన ఉల్లిపాయలు, టమాటా ముక్కలు వేయండి. మధ్యమధ్యలో పంటికి తగిలేలా వేయించిన పల్లీలు, మిక్చర్ వేసి.. చివరగా వేయించిన కరివేపాకు చల్లి, కొద్దిగా నిమ్మరసం పిండితే చాలు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications