Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
ఆమ్లెట్ బజ్జీ ఎప్పుడైనా రుచి చూశారా? అదిరిపోద్ది అంతే..ఎలా చేసుకోవాలంటే
పిల్లలు పాఠశాల నుండి ఆకలితో ఇంటికి వస్తారు. వాళ్ళకు రోజూ పెట్టే స్నాక్స్ కాకుండా, ఈరోజు కొత్తగా, రుచికరంగe, కాస్త ఆరోగ్యకరంగా ఏదైనా చేసి పెట్టాలనుకుంటున్నారా? మీ వంటింట్లో ఉండే సాధారణ గోధుమ పిండి, రెండు గుడ్లతో ఒక అద్భుతమైన స్నాక్ తయారు చేయవచ్చు. అదే ఆమ్లెట్ బజ్జీలు.
మైదా పిండి వాడకం లేకుండా, గోధుమ పిండి, గుడ్లతో చేసే ఈ వంటకం పిల్లల ఆరోగ్యానికి మంచిది, అలాగే రుచిలోనూ అద్భుతంగా ఉంటుంది. లొట్టలేసుకుంటూ తినేస్తారు. ఆమ్లెట్ బజ్జీలను ఎలా తయారు చేయాలో, కావాల్సిన పదార్థాలేంటో ఇక్కడ చూడండి.

కావాల్సిన పదార్థాలు
గుడ్లు - 2
ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - 1
కొత్తిమీర,కరివేపాకు - కొద్దిగా
శనగపిండి - 1 టేబుల్ స్పూన్
పసుపు - పావు టీస్పూన్
మిరియాల పొడి -పావు టీస్పూన్
కారం -అర టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - 1 టేబుల్ స్పూన్
గోధుమ పిండి -అర కప్పు
బియ్యం పిండి - 2 టేబుల్ స్పూన్లు
చికెన్ 65 మసాలా -అర టీస్పూన్
గరం మసాలా - అర టీస్పూన్
మెంతి పొడి - పావు టీస్పూన్
పసుపు - చిటికెడు
కొత్తిమీర - కొద్దిగా
ఉప్పు - తగినంత
నీరు - పిండి కలపడానికి
నూనె - వేయించడానికి సరిపడా
తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో రెండు గుడ్లను పగలగొట్టి పోయాలి. అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర,పసుపు, మిరియాల పొడి, కారం, ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ శనగపిండి వేసి నురగ వచ్చేలా బాగా గిలక్కొట్టాలి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టి వేడయ్యాక ఒక స్పూన్ నూనె రాయాలి. సిద్ధం చేసుకున్న గుడ్డు మిశ్రమాన్ని పెనంపై పోసి మరీ పల్చగా కాకుండా కాస్త మందంగా ఉండేలా ఆమ్లెట్ వేసుకోవాలి. రెండు వైపులా బాగా కాల్చుకుని పక్కన పెట్టుకోవాలి.
-ఆమ్లెట్ కాస్త చల్లారిన తర్వాత దానిని మీకు నచ్చిన ఆకారంలో ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవి బజ్జీల లోపల స్టఫింగ్ లా ఉంటాయి.
-ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెలో గోధుమ పిండి, బియ్యం పిండి, చికెన్ 65 మసాలా, గరం మసాలా, మెంతి పొడి, పసుపు, ఉప్పు, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలపాలి. కొద్ది కొద్దిగా నీరు పోస్తూ బజ్జీల పిండిలా (మరీ జారుగా కాకుండా, ముక్కకు అంటుకునేలా) కలుపుకోవాలి.
-స్టవ్ మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత, మనం కట్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ ముక్కలను ఒక్కొక్కటిగా తీసుకుని, గోధుమ పిండి మిశ్రమంలో ముంచి నూనెలో వేయాలి.
-మంటను మీడియంలో ఉంచి రెండు వైపులా బంగారు గోధుమ రంగు వచ్చే వరకు వేయించుకుని తీయాలి. అంతే వేడివేడి ఆమ్లెట్ బజ్జీ రెడీ. సాస్ లేదా పుదీనా చట్నీతో ఈ ఆమ్లెట్ బజ్జీ రుచి చూస్తే ఫిదా అవ్వాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications