Latest Updates
-
చికెన్, మటన్ బిర్యానీలను మరిపించే స్పైసీ టమాటా బిర్యానీ..కుక్కర్ లో ఈజీగా చేసేయండిలా.. -
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే? -
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..! -
నవరాత్రి స్పెషల్: రుచితో పాటు ఆరోగ్యం.. జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన తమలపాకు కేసరి ప్రసాదం -
నోరూరించే ఆమ్లెట్ పులుసు.. పుల్లపుల్లగా, కారంకారంగా రుచి అదరహో! -
దీపావళికి ముందే ధ్వజ యోగం.. ఈ 4 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయమా? -
నల్ల పాలు తాగుతున్న తెలుగు హీరోయిన్..ప్రయోజనాలేంటో,ఎలా చేసుకోవాలో తెలుసా? -
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ!
రొటీన్ బజ్జీలు, పకోడీలు బోర్ కొట్టాయా? అయితే ఈసారి పొటాటో లాలిపాప్ ట్రై చేయండి
సాయంత్రం వేళ చల్లని గాలి వీస్తున్నప్పుడు, వేడివేడిగా, కరకరలాడుతూ ఉండే స్నాక్స్ తినాలనిపించడం సహజం. రోజూ తినే బజ్జీలు, పకోడీలకు బదులుగా కాస్త కొత్తగా, నోరూరించేలా ఏదైనా చేయాలనుకుంటే పొటాటో లాలిపాప్ మీకు పర్ఫెక్ట్ గా ఉంటది. కేవలం ఇంట్లో ఉండే సాధారణ పదార్థాలతో, కేవలం 15 నిమిషాల్లోనే ఈ స్నాక్ తయారుచేసుకోవచ్చు. దీన్ని ఒక కప్పు వేడివేడి మసాలా టీతో కలిపి తీసుకుంటే ఆ మజాయే వేరు.

పొటాటో లాలిపాప్ తయారీకి కావలసిన పదార్థాలు
బంగాళాదుంపలు: 3 పెద్దవి
బ్రెడ్ క్రంబ్స్ (బ్రెడ్ పొడి): అర కప్పు
కార్న్ ఫ్లోర్ (మొక్కజొన్న పిండి): 2 టేబుల్ స్పూన్లు
బియ్యపు పిండి: 1 టేబుల్ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్: అర టేబుల్ స్పూన్
పచ్చిమిరపకాయలు: 2
కొత్తిమీర: కొద్దిగా
జీలకర్ర పొడి: అర టీస్పూన్
గరం మసాలా: పావు టీస్పూన్
ఉప్పు: తగినంత
నూనె: డీప్ ఫ్రై చేయడానికి
టూత్పిక్స్ లేదా ఐస్ క్రీమ్ స్టిక్స్: 12
దాబా స్టైల్ భూనా చికెన్ మసాలా..స్పైసీగా, జ్యూసీగా కేక టేస్ట్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!
పొటాటో లాలిపాప్ తయారీ విధానం
-ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకుని, అందులో మెత్తగా మ్యాష్ చేసిన బంగాళాదుంపల ముద్దను వేయండి. ఇందులో బ్రెడ్ క్రంబ్స్, కార్న్ ఫ్లోర్, బియ్యపు పిండి వేసి కలపండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, తాజా కొత్తిమీర, జీలకర్ర పొడి, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసి అన్నీ బంగాళాదుంపకు పట్టేలా చేత్తో బాగా కలుపుకోవాలి. నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మిశ్రమం మరీ పల్చగా, చేతికి అంటుకునేలా అనిపిస్తే, మరో చెంచా కార్న్ ఫ్లోర్ కలుపుకోవచ్చు.
-కలుపుకున్న మిశ్రమం నుండి కొద్దికొద్దిగా తీసుకుంటూ చిన్న సైజు నిమ్మకాయంత ఉండలుగా చుట్టుకోవాలి. ఇప్పుడు ప్రతి ఉండ మధ్యలో ఒక టూత్ పిక్ లేదా ఐస్ క్రీమ్ స్టిక్ ను గుచ్చండి. చూడ్డానికి అచ్చం లాలిపాప్ లా కనిపిస్తాయి. వీటిని వెంటనే వేయించకుండా, ఒక ప్లేట్ లో పెట్టి సుమారు 10 నుండి 15 నిమిషాల పాటు ఫ్రిజ్ లో ఉంచండి. ఇలా చేయడం వల్ల నూనెలో వేయించేటప్పుడు అవి విడిపోకుండా, ఆకారం చెదరకుండా గట్టిగా ఉంటాయి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి, వెడల్పాటి బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయండి. నూనె బాగా కాగిన తర్వాత, మంటను మీడియంకి అడ్జస్ట్ చేసి ఫ్రిజ్ నుండి తీసిన లాలిపాప్స్ ను నెమ్మదిగా నూనెలో వదలండి. అన్ని వైపులా సమానంగా వేగేలా తిప్పుతూ, బంగారు గోధుమ రంగులోకి మారి, కరకరలాడేంత వరకు వేయించండి. మీడియం మంటపై వేయించడం వల్ల లోపల పిండి పచ్చిగా లేకుండా బాగా ఉడుకుతుంది. వేగిన తర్వాత వీటిని ప్లేట్ లోకి తీసుకోండి.
-అంతే పొటాటో లాలిపాప్స్ రెడీ. వేడివేడిగా ఉన్న పొటాటో లాలిపాప్స్ పైన కొద్దిగా చాట్ మసాలా చల్లి, టొమాటో కెచప్ లేదా కారంగా ఉండే పుదీనా చట్నీతో తింటే సూపర్ అనాల్సిందే.
బేకరీ స్టైల్ చిట్కా
మీకు బేకరీ స్టైల్ లో మరింత కరకరలాడే టెక్స్చర్ కావాలంటే.. ఒక చిన్న గిన్నెలో కొద్దిగా కార్న్ ఫ్లోర్, నీళ్లు కలిపి పల్చటి ద్రావణంలా చేసుకోండి. లాలిపాప్ ఉండలను ముందుగా ఈ ద్రావణంలో ముంచి, ఆ తర్వాత బ్రెడ్ క్రంబ్స్ లో దొర్లించి అప్పుడు నూనెలో వేయించండి. రుచి అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
