Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఈ మిల్మేకర్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ చూస్తే అస్సలు వదలరు..స్ట్రీట్ ఫుడ్ స్టైల్ లో ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..
నాన్ వెజ్ తినని వాళ్లకు మిల్మేకర్ బెస్ట్ ప్రత్యామ్నాయ ఎంపిక. ఇది అత్యధిక ప్రొటీన్ కలిగి ఉంటుంది, అందుకే దీనిని శాఖహార మాంసం అని పిలుస్తుంటారు. మనపం సాధారంగా వెజ్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ ను ఎక్కువగా టేస్ట్ చేస్తుంటాం. మనం రోడ్డు సైడ్ ఫుడ్ తినడానికి వెళ్లినప్పుడు కూడా మనకు ఎక్కువగా ఇవే దొరుకుతాయి. అయితే సోయా చంక్స్ తో చేసే ఫ్రైడ్ రైస్ టేస్ట్ ఒక్కసారి చూశారంటే జన్మలో వదలరు. మిల్మేకర్ ఫ్రైడ్ రైస్ తినాలంటే నోటికి ఏదో అదృష్టం పట్టాల్సిందే. మిల్మేకర్ ఫ్రైడ్ రైస్ ను మీ ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
మిల్మేకర్ ఫ్రైడ్ రైస్ తయారీకి కావాల్సిన
పదార్థాలు
-సోయా చంక్స్
-సోనా మసూరి బియ్యం
-కారం
-ఉప్పు
-కొత్తిమీర
-ఆయిల్
-మైదాపిండి
-మొక్కజొన్న పిండి
-ధనియాల పొడి
-రెడ్ ఫుడ్ కలర్
-సోయా సాస్
-వెనిగర్
-రెడ్ చిల్లీ సాస్
-ఉల్లిపాయ ముక్కలు
-పచ్చిమిర్చి
-క్యాప్సికం

మిల్మేకర్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం
-ముందుగా 1 గ్లాసు(150 గ్రాములు)బాస్మతి బియ్యంని శుభ్రంగా కడిగి అందులో 4 గ్లాసుల నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు, 1-2 టీస్పూన్ల ఆయిల్ వేసి అరగంట సేపు ఈ బియ్యాన్ని నానబెట్టాలి.
-తర్వాత ఈ నానబెట్టిన బియ్యాన్ని ఉడికించాలి. బియ్యం ఉడికేటప్పుడు ఎక్కువగా కలిపితే బియ్యం విరిగిపోతుంది కాబట్టి రైస్ ఉడికిందో లేదో నిదానంగా మధ్యమధ్యలోమ చూస్తూ ఉడికించాలి.
-రైస్ ఉడికిన తర్వాత అందులోని నీరు అంతా వంపేసి పొడిపొడిగా ఉన్న ఉడికిన రైస్ మీద మూతపెట్టేసి ఉంచండి.
-తర్వాత స్టవ్ మీద ఓ పెద్ద గిన్నె పెట్టి అందులో 2 గ్లాసుల నీళ్లు పోసి వేడిచేశాక పక్కకు తీసుకొని అందులో అరకప్పు సోయా చంక్స్(మిల్మేకర్) వేసి 10 నిమిషాలు నానబెట్టాలి.
-తర్వాత సోయా చంక్స్ లోని నీళ్లంతా వంపేసి అందులో మామూలు నీళ్లను పోసి 10 నిమిషాలు నాననివ్వాలి.
-తర్వాత సోయా చంక్స్ ను చేతుల్లోకి తీసుకొన్ని నీరు అంతా పిండేసి వాటిని మరో గిన్నెలోకి తీసుకోండి.
-నీరు పిండేసి తీసుకున్న సోయా చంక్స్ లో రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల మైదాపిండి, 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్(మొక్కజొన్న పిండి), అర టీస్పూన్ కారం, అర టీస్పూన్ ధనియాల పొడి, అర టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్,చిటికెడు రెడ్ ఫుడ్ కలర్, కొద్దిగా స్పూన్ అంత నీళ్లు వేసి మొత్తం అంతా కలిసేలా స్పూన్ తో కలుపుకోండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ లో డీప్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ పోసి వేడి చేశాక అందులో కలిపిన సోయా చంక్స్ ను ఒక్కొక్కటిగా విడి విడిగా అందులో వేసి మీడియం మంట మీద అవి క్రిస్పీగా అయ్యేదాకా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి వేడి చేసి అందులో 1 ఉల్లిపాయ సన్నని తరుగు, 2 పచ్చిమిరపకాయ ముక్కలు, అర టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల క్యాప్సికం ముక్కలు వేసి 50 శాతం వరకు ఫ్రై అయ్యాక అందులో 1టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టీస్పూన్ సోయా సాస్, 1 టీస్పూన్ వెనిగర్ వేసి వేయించుకోవాలి. సాస్ లు మాడిపోకుండా 2 స్పూన్ల నూనె వేసి కలుపుకోండి.
-ఇప్పుడు అందులో ముందుగా ఫ్రై చేసుకున్న సోయా చంక్స్ వేసి కలుపుకోవాలి.ఇందులో అర టీస్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి.
-తర్వాత అందులో ఉడికించి పక్కన పెట్టిన అన్నాన్ని వేసి కలుపుకోవాలి. స్టవ్ ఆపే ముందు కొంచెం కొత్తిమీర తరుగు చల్లుకోండి. అంతే టేస్టీ మిల్మేకర్ ఫ్రైడ్ రైస్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications