Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
మీ ఆకలిని తీర్చే, రుచిని పెంచే దబ్బకాయ పులిహోర..ఎలా చేసుకోవాలంటే
నిమ్మపండుతో చేసే పులిహోర, చింతపండుతో చేసిన పులిహోర తిని తిని బోర్ కొట్టేసిందా? కొత్త రకంగా పులిహోరను చేసి తినాలనుందా? అయితే వెంటనే దబ్బకాయ పులిహోర ట్రై చేయండి. ఇది మీ నోటికి కొత్త రుచిని అందిస్తుంది. పిల్లలు కూడా దీనిని చాలా ఇస్టంగా తింటారు. లంచ్ బాక్సులలో పెట్టుకోడానికి కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఆరోగ్యం,రుచి కలగలిసిన నోరూరించే దబ్బకాయ పులిహోరను ఇంట్లోనే ఈజీగా తయారుచేసుకోడానికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.
దబ్బకాయ పులిహోర తయారీకి కావలసిన పదార్థాలు
-వేడి అన్నం
-కరివేపాకు
-ఆయిల్
-దబ్బకాయ
-అల్లం
-జీడిపప్పు
-పచ్చిమిర్చి
-ఎండుమిర్చి
-ఆవాలు
-మినపప్పు
-పల్లీలు
-పసుపు
-శెనగపప్పు
-పసుపు
-క్యారెట్ తరుము
-కొత్తిమీర

దబ్బకాయ పులిహోర తయారీ విధానం
-ముందుగా వేడి అన్నంని ఓ డీసులో వేసి అందులో కొద్దిగా కరివేపాకు వేసి కలిపి అన్నాన్ని చల్లారనివ్వాలి.
-తర్వాత ఒక దబ్బకాయ తీసుకొని దానిని రెండు ముక్కలుగా కట్ చేసి వాటి రసాన్ని ఓ గిన్నెలో పిండుకోండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 5 టీస్పూన్ల ఆయిల్ వేడి చేసి వేడి చెయ్యాలి.
-ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో 3 టీస్పూన్ల పల్లీలు వేసి వేపుకోవాలి. పల్లీలు లైట్ గా కలర్ మారిన తర్వాత అందులో అర టీస్పూన్ ఆవాలు, అరటీస్పూన్ మినపప్పు, అరటీస్పూన్ శెనగపప్పు వేసి కలుపుకోవాలి.
తమలపాకు కొబ్బరి పచ్చడి ఎప్పుడైనా తిన్నారా? దీని ముందు మిగతా చట్నీలన్నీ వేస్ట్..ఎలా చేసుకోవాలంటే
-తర్వాత అందులో చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు కొద్దిగా, 10 జీడిపప్పు పలుకులని, 7 ఎండుమిరపకాయలు, 4 చీల్చిన పచ్చిమిర్చి వేసి అన్నింటిని వేయించుకోవాలి. చివరలో రెండు రెమ్మల కరివేపాకు, పావు టీస్పూన్ పసుపు వేసి అన్నింటిని బాగా వేయించుకోవాలి.
-అన్నీ బాగా వేగిన తర్వాత ఈ తాళింపుని చల్లారిన అన్నంలో వేసుకోవాలి. అన్నంలోనే రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా క్యారెట్ తురుము, కొద్దిగా కొత్తిమీర వేసి అన్నీ కలిసేటట్లు అన్నాన్ని బాగా కలుపుకోవాలి.
-ఇఫ్పుడు పక్కన పెట్టుకున్న దబ్బకాయ రసాన్ని సరిపోయినంత అన్నంలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే దబ్బకాయ పులిహోర రెడీ.
-దబ్బకాయ రసం మిగిలిపోయి ఉంటే దానిని ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పడు మళ్లీ దబ్బకాయ పులిహోర చేసుకోవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications