Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
దహీ తడ్కా శాండ్ విచ్..ఒక్కసారి తిన్నారంటే ఇంకా ఇంకా అంటారు,ఎలా చేయాలంటే
సాయంత్రం సమయంలో ఏదైనా టేస్ట్ స్నాక్ తినాలని అనిపిస్తుంటే ఓ సారి దహీ తడ్కా శాండ్ విచ్(Dahi Tadka Sandwich)ట్రై చేయండి. దీని కోసం రెస్టారెంట్లు,బేకరీలకు వెళ్లి వందల రూపాయలు ఖర్చు చేయకుండా ఇంట్లోనే ఈజీగా తయారుచేసుకోవచ్చు. దహీ తడ్కా శాండ్విచ్ రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకం. ఇది పెరుగు, కూరగాయలు, మసాలాల కలయికతో తయారుచేస్తారు. ఇది తేలికపాటి అల్పాహారం లేదా స్నాక్‌గా తినడానికి అనుకూలంగా ఉంటుంది. దీనిని తయారుచేయడానికి కావలసిన పదార్థాలు,తయారీ విధానం,ప్రయోజనాలు ఇక్కడ చూడండి.
దహీ తడ్కా శాండ్ విచ్ తయారీకి కావలసిన పదార్థాలు
బ్రెడ్ స్లైసులు: 4
పెరుగు: 1 కప్పు
ఉల్లిపాయ: 1
టమోటా: 1
పచ్చిమిర్చి: 2
కొత్తిమీర: కొద్దిగా
కరివేపాకు: కొద్దిగా
ఆవాలు: 1/2 టీ స్పూన్
జీలకర్ర: 1/2 టీ స్పూన్
పసుపు: 1/4 టీ స్పూన్
కారం: 1/2 టీ స్పూన్
ఉప్పు: తగినంత
నూనె: 1 టేబుల్ స్పూన్

దహీ తడ్కా శాండ్ విచ్ తయారీ విధానం
-ముందుగా పెరుగును ఒక గిన్నెలో వేసి బాగా చిలకాలి.
-తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, కారం వేసి బాగా కలపాలి. మీరు కావాలనుకుంటే పెరుగు మిశ్రమంలో తురిమిన క్యారెట్, క్యాప్సికమ్ లేదా ఇతర కూరగాయలను కూడా వేసుకోవచ్చు.
-ఇప్పడు స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేడి చేయాలి.
-ఆయిల్ వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి.
-తర్వాత పసుపు వేసి కలపాలి.
-ఇప్పుడు పెరుగు మిశ్రమాన్ని పాన్ లో వేసి 2-3 నిమిషాలు ఉడికించాలి.
-బ్రెడ్ స్లైసులకు పెరుగు మిశ్రమాన్ని సమానంగా పట్టించాలి.
-తర్వాత రెండు బ్రెడ్ స్లైసులను కలిపి శాండ్విచ్ లా తయారుచేయాలి.
-పాన్ మీద కొద్దిగా నూనె వేసి శాండ్ విచ్ లను రెండు వైపులా బంగారు రంగు వచ్చేవరకు కాల్చాలి. అంతే దహీ తడ్కా శాండ్విచ్ రెడీ. శాండ్విచ్లను కాల్చేటప్పుడు, మంటను తక్కువగా ఉంచాలి, లేకపోతే అవి మాడిపోతాయి.
గోదావరి జిల్లాల ఈ స్పెషల్ పచ్చడి తింటే..జన్మకి ఇంకేదీ అక్కర్లుదు అంటారు,ఎలా చేయాలంటే
దహీ తడ్కా శాండ్విచ్ ప్రయోజనాలు
ఇది తేలికపాటి, ఆరోగ్యకరమైన అల్పాహారం. త్వరగా తయారుచేయగల వంటకం కూడా. ఇది పిల్లలకు,పెద్దలకు ఇద్దరికీ నచ్చుతుంది. పెరుగులో ప్రోటీన్, కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. కూరగాయలలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ ఉంటాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
