Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఎముకల బలం, అపారమైన శక్తి.. నిమిషాల్లో తయారయ్యే టేస్టీ వరిగల కిచిడీ..గిన్నె కూడా నాకేస్తారు
వరిగలు.. అత్యంత ఆరోగ్యకరమైన చిరుధాన్యాలలో ఒకటి. వరిగల కిచిడీ అనేది బియ్యం కిచిడీకి ఒక అద్భుతమైన, పోషకభరితమైన ప్రత్యామ్నాయం. ఇది తేలికగా జీర్ణమవుతుంది, రుచికరంగా ఉంటుంది. ఉదయం అల్పాహారంగా తీసుకోవడానికి చాలా మంచిది. దీనిని మీరు సులభంగా తయారు చేసుకుని దాని ప్రయోజనాలను పొందవచ్చు. వరిగల్లో ఐరన్, కాల్షియం, విటమిన్లు ఇతర ముఖ్యమైన మినరల్స్ ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు, శరీరంలో శక్తి స్థాయిలను పెంచి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.
వరిగలలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. వీటిని తీసుకున్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా పెరుగుతాయి. ఇది టైప్ 2 మధుమేహం ఉన్నవారికి లేదా మధుమేహం రాకుండా నివారించుకోవాలనుకునే వారికి అద్భుతమైన ఆహారం. వరిగల కిచిడి తయారీకి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

-ఆవాలు
-సొరకాయ
-వరిగలు
ఇంగువ
జీలకర్ర
అల్లం
పచ్చిమిర్చి
క్యారెట్
నెయ్యి
ఉప్పు
కరివేపాకు
కొత్తిమీర
కందిపప్పు
పెసరపప్పు
ఎర్ర కందిపప్పు
టమాటో
తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో అరకప్పు వరిగలు,గుప్పుడు కందిపప్పు, గుప్పెడు పెసరపప్పు, గుప్పెడు ఎర్ర కందిపప్పు కూడా వేసుకొని నీళ్లు పోసి బాగా కడిగాక ఆ నీటిని వంపేసి మంచినీళ్లు 5 కప్పులు అందులో పోసి గంట సేపు నానబెట్టుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర వేసి 1 నిమిషం పాటు వేయించుకున్నాక పావు స్పూన్ ఇంగువ వేసి ఒకసారి కలిపి 1 స్పూన్ అల్లం తరుగు, 2 పచ్చిమిర్చిల తరుగు, 1 క్యారెట్ చిన్న ముక్కలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసి వాటిల్లోని పచ్చిదనం పోయేలా ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించుకోవాలి.
-తర్వాత చిన్న చిన్నగా కట్ చేసిన(తొక్క తీయకుండానే) లేత సొరకాయ ముక్కలను స్టవ్ మీద ఉన్న గిన్నెలో వేసి 5-6 నిమిషాలు కలుపుతూ వేయించుకున్నాక 1 టమాటో ముక్కలు కూడా వేసి ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించుకోవాలి.
-ఇప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు, పావు స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం వేసి ఒక నిమిషంపాటు కలుపుకోవాలి.
-తర్వాత ఇందులో నానబెట్టుకున్న వరిగలు,కందిపప్పు మిశ్రమాన్ని నీళ్లతో సహా వేసి పెద్ద మంట మీద 1 నిమిషం పాటు నీళ్లను మరగనివ్వాలి.
-ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి తక్కువ మంట మీద 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయాలి.
-ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసి కిచిడీని గరిటెతో మెల్లగా కలపాలి. పైన కొత్తిమీరతో అలంకరించి, వేడి వేడిగా నెయ్యి లేదా పెరుగు, ఊరగాయతో కలిపి వడ్డించాలి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications