Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్..బరువు తగ్గాలంటే రాగి రవ్వ కిచిడి తినాల్సిందే..ఎలా చేసుకోవాలంటే
రాగి రవ్వ కిచిడి అనేది రాగి రవ్వ, పప్పు, కూరగాయలతో తయారుచేసే ఒక రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకం. దీన్ని బ్రేక్ ఫాస్ట్,లంచ్,డిన్నర్ ఎలా తీసుకున్నా మంచిదే. పిల్లలు కూడా దీన్ని ఇష్టంగా తింటారు. ఇది తేలికగా జీర్ణం అవుతుంది కాబట్టి పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారికి కూడా ఇది మంచిది. దీన్ని తయారుచేయడానికి ఎక్కువ సమయం పట్టదు. రాగి రవ్వ కిచిడి తయారీకి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
రాగి రవ్వ కిచిడి తయారీకి కావాల్సిన పదార్థాలు
-రాగి రవ్వ
-పెసలు
-పచ్చి బఠాణీ
-క్యారెట్
-బంగాళదుంప
-కారం
-ఉప్పు
-కొత్తిమీర
-పసుసు
-ఉప్పు
-జీలకర్ర
-కరివేపాకు
-పచ్చిమర్చి
-అల్లం తరుగు
టమాటో తరుగు
-స్వీట్ కార్న్
-ఉల్లిపాయ
-నెయ్యి

రాగి రవ్వ కిచిడి తయారీవిధానం
-ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో అరకప్పు రాగి రవ్వ వేసి నీళ్లు కూడా పోసి 2-3 సార్లు శుభ్రంగా కడగాలి.
-తర్వాత అందులో నీళ్లు పోసి 4-5 గంటలు నాననివ్వాలి.
-తర్వాత మరో గిన్నెలో అందులో 1/4కప్పు పెసలు వేసి నీళ్లు పోసి రెండుసార్లు శుభ్రంగా కడిగి నీళ్లు పోసి కనీసం 2 గంటలు అయినా నానబెట్టుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేశాక ఇందులో 1 టీస్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు 3 పచ్చిమిర్చి చీలికలు, 1 ఉల్లిపాయ తరుగు, 1 టీస్పూన్ అల్లం తరుగు వేసుకొని కొద్దిగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి.
-ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగాక అందులో 1 కప్పు బంగాళదుంప ముక్కలు, 1 కప్పు క్యారెట్ ముక్కలు, 1 టమాటో తరుగు, అర కప్పు స్వీట్ కార్న్, రుచికి సరిపడా ఉప్పు, పావు టీస్పూన్ పసుపు, అర కప్పు పచ్చి బఠాణీ అర టీస్సూన్ కారం వేసి కలిపి కొద్దిగా వేయంచాకా ఇందులో నానటెట్టిన్ రాగి రవ్వ, పెసలు వేసి కలపండి.
-ఇప్పుడు ీందుేలో 3 కప్పుల నీళ్లు, కొద్దిగా కొత్తిమీర తరుగు,ఉప్పు వేసి కలిపి మూతపెట్టేసి పెద్ద మంట మీద 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి. అంతే రాగి రవ్వ కిచిడి రెడీ. దీనికి సైడ్ డిష్ గా ఎలాంటి చట్నీ అవసరం లేదు. పెరుగుతో కలిపి తింటే మాత్రం అద్భుతమైన రుచి ఉంటుంది.
ప్రయోజనాలు
రాగిలో పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి, ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు లేదా మధుమేహం వచ్చే ప్రమాదం ఉన్నవారికి మంచి ఆహారం.రాగిలో పీచు పదార్థాలు అధికంగా ఉండటం వల్ల కడుపు నిండిన భావన కలిగి, అతిగా తినకుండా నిరోధిస్తుంది. ఇది బరువు తగ్గడానికి లేదా బరువును నియంత్రించడానికి సహాయపడుతుంది. రాగిలో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనతతో బాధపడుతున్న వారికి ఇది చాలా మంచిది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications