Latest Updates
-
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే? -
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..! -
నవరాత్రి స్పెషల్: రుచితో పాటు ఆరోగ్యం.. జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన తమలపాకు కేసరి ప్రసాదం -
నోరూరించే ఆమ్లెట్ పులుసు.. పుల్లపుల్లగా, కారంకారంగా రుచి అదరహో! -
దీపావళికి ముందే ధ్వజ యోగం.. ఈ 4 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయమా? -
నల్ల పాలు తాగుతున్న తెలుగు హీరోయిన్..ప్రయోజనాలేంటో,ఎలా చేసుకోవాలో తెలుసా? -
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ! -
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్..
దాబా స్టైల్ భూనా చికెన్ మసాలా..స్పైసీగా, జ్యూసీగా కేక టేస్ట్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!
చికెన్ తో రకరకాల వెరైటీలు తయారుచేస్తుంటారు. అందులో భూనా చికెన్ మనాలా ఒకటి. చికెన్ వంటకాల్లో దీనికి ఉన్న ప్రత్యేకతే వేరు. మసాలాలను సన్నని మంట మీద, వాటిలోని పచ్చివాసన పూర్తిగా పోయి, నూనె పైకి తేలే వరకు ఓపిగ్గా వేయించడాన్ని భూనా అంటారు. ఈ ప్రత్యేకమైన వండే విధానం వల్లే చికెన్ ముక్కలకు మసాలాలు లోపలి వరకు పట్టి, కూరకు ఆ చిక్కటి గ్రేవీ,ఘాటైన రుచి వస్తుంది. ఈ వంటకాన్ని వండుతున్నప్పుడు ఇల్లంతా వ్యాపించే సువాసనలకే ఎవరికైనా ఇట్టే ఆకలి పుట్టుకొస్తుంది. దాబా స్టైల్ లో భూనా చికెన్ మసాలాను మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో ఇక్కడ చూడండి.

భూనా చికెన్ మసాలా తయారీకి కావలసిన పదార్థాలు
చికెన్: 500 గ్రాములు
ఉల్లిపాయలు: 3 పెద్దవి
టమోటాలు: 2
పెరుగు: 3 టేబుల్ స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1.5 టీస్పూన్లు
బిర్యానీ ఆకు: 1
దాల్చినచెక్క: 1 అంగుళం
పచ్చి యాలకులు:4 1 పెద్ద
నల్ల యాలకు: 1పెద్దది
లవంగాలు:5
కాశ్మీరీ ఎర్ర కారం పొడి:1 టీస్పూన్
ధనియాల పొడి,:1 టీస్పూన్
పసుపు: అర టీస్పూన్
జీలకర్ర పొడి: అర టీస్పూన్
గరం మసాలా: 1 టీస్పూన్
కసూరి మేతి: అర టీస్పూన్
నూనె లేదా నెయ్యి: 4 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర: కొద్దిగా
రాత్రి పూట స్వీట్ తినాలనిపిస్తుందా? ఓవెన్
అక్కర్లేకుండానే ఇంట్లోనే బేకరీ స్టైల్ బనానా బ్రెడ్
చేసుకోండిలా..
భూనా చికెన్ మసాలా తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో శుభ్రం చేసిన చికెన్ ముక్కలను తీసుకోండి. అందులో కొద్దిగా ఉప్పు, అర టీస్పూన్ పసుపు, అర టీస్పూన్ కారం, ఒక టీస్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపండి. దీన్ని 20-30 నిమిషాల పాటు పక్కన పెట్టండి. ఇలా చేయడం వల్ల చికెన్ ముక్కలు వండిన తర్వాత లోపల మెత్తగా, ఎంతో జ్యూసీగా ఉంటాయి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి, మందపాటి అడుగు ఉన్న కడాయిని పెట్టుకుని నూనె లేదా నెయ్యి వేడి చేయండి. అందులో బిర్యానీ ఆకు, దాల్చినచెక్క, యాలకులు, లవంగాలు వేయండి. మసాలాల సువాసన నూనెకు పట్టాక, సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేయండి.
-అసలైన దాబా స్టైల్ రుచి రావాలంటే ఉల్లిపాయలను ఓపిగ్గా, పర్ఫెక్ట్ బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చివాసన పోయేలా మరో రెండు నిమిషాలు వేయించండి.
-ఇప్పుడు టమోటా ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి టమోటాలు గుజ్జులా మెత్తబడే వరకు ఉడికించండి. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, కాశ్మీరీ కారం వేసి బాగా కలపండి. మసాలాల నుండి నూనె విడిపోయి పైకి తేలే వరకు ఉడికించండి
-ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ ను కడాయిలో వేయండి. మంటను కాస్త పెంచి, మసాలాలు చికెన్ కు బాగా పట్టేలా 5 నుండి 7 నిమిషాల పాటు నిరంతరం కలుపుతూ వేయించండి. తర్వాత మంటను తగ్గించి, గిలకొట్టిన పెరుగును వేయండి. పెరుగు విరిగిపోకుండా ఉండాలంటే వేగంగా కలుపుతూ ఉండాలి.
-కడాయిపై మూత పెట్టి, చికెన్ ను దానిలో ఊరే రసాలతోనే సన్నని మంటపై 15-20 నిమిషాల పాటు నెమ్మదిగా ఉడకనివ్వండి. అడుగు అంటకుండా మధ్యమధ్యలో కలుపుతుండాలి.
-చికెన్ మెత్తగా ఉడికి, గ్రేవీ చిక్కబడి ముక్కలకు పట్టుకున్న తర్వాత, గరం మసాలా, చేతితో నలిపిన కసూరి మేతి, సన్నగా తరిగిన తాజా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయండి.
అంతే ఘుమఘుమలాడే, నోరూరించే దాబా స్టైల్ భూనా చికెన్ మసాలా రెడీ. సిద్ధం.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
