Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
క్రిస్మస్ సందర్భంగా ఏ వంటలు తయారు చేయాలనుకుంటున్నారు? ఇక్కడ 7 ఫేమస్ వంటలు ఉన్నాయి, ఒకసారి ట్రై చేయండి
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆనందించే పండుగలలో క్రిస్మస్ ఒకటి. ఇది యేసుక్రీస్తు జన్మదినాన్ని జరుపుకోవడానికి కుటుంబాలు ఒకచోట చేరే సమయం. క్రిస్మస్ ట్రీని అలంకరించడం, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం నుండి కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో కలిసి భోజనం చేయడం వరకు ఈ పండుగను చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు.
ఇతర పండుగల మాదిరిగానే క్రిస్మస్ కూడా రుచికరమైన వంటకాలతో జరుపుకుంటారు. రోస్ట్ టర్కీ, ప్లం కేక్, ఎగ్‌నాగ్ వంటి వంటకాలతో క్రిస్మస్ జరుపుకుంటారు.

దేశవ్యాప్తంగా 9 ప్రసిద్ధ క్రిస్మస్ వంటకాలు ఇక్కడ ఉన్నాయి:

1. చంద్రకళ/ సూర్యకళ స్వీట్
ఇది ఆంధ్రాలో క్రిస్మస్ సందర్భంగా చేసే తీపి వంటకం. పేరు
సూచించినట్లుగా, దాని ఆకారం సూర్యుడిలా గుండ్రంగా ఉంటుంది లేదా
చంద్రుడిలా సగం ఆకారంలో ఉంటుంది. ఇది మైదా పిండితో తయారు చేస్తారు.
మైదా పిండిని చపాతీ పిండిలో బాగా కలిపి కొన్ని గంటలపాటు అలాగే ఉంచాలి.
తరువాత పొరలుగా చేసి, ప్రతి పొర మధ్యలో వెన్నను వేయండి. కాబట్టి
పొరలుగా మరియు చంద్రుడు లేదా సూర్యుని ఆకారంలో ముడుచుకుంటే, అది
క్రంచీగా మారుతుంది. తర్వాత షుగర్ సిరప్ లో వేసి పైన డ్రై ఫ్రూట్స్
వేస్తే రుచికరమైన సూర్యకళ స్వీట్ రెడీ.

2. కలకలాలు
కలకలాలు అంటే చాలా మందికి తెలియదు. ఇది ఇంట్లో రెండు విధాలుగా
తయారుచేసుకుంటారు. ఒకటి స్వీట మరొకటి రుచికరమైన కారంగా ఉండే కలకలాలు.
ఇవి చేసే విధానం కూడా చాలా సులభం. గోధుమ పిండిలో మైదా పిండి
కలుపుతుండగా పంచదార, అరటి పండు, గుడ్డు (ఉపయోగించకపోవచ్చు) వేసి బాగా
కలిపి బిస్కెట్ ఆకారంలో కట్ చేసి నూనెలో వేయించుకుంటే రుచికరమైన
స్వీట్ కలకలాలు రెడీ. ఇందులో పంచదారకు బదులు ఉప్పు కారం వేస్తే
తయారుచేస్తే కారం కలకలాలు తయారు అవుతాయి. ఇది చాలా రుచిగా కూడా
ఉంటుంది.

3. రోజ్ కుకీలు
గోవా యొక్క మరొక ప్రసిద్ధ సాంప్రదాయ డెజర్ట్ రోజ్ కుకీలు (అచప్పం).
వీటని ఎక్కువగా క్రిస్మస్ సమయంసుకుంటారు. ఇది బియ్యప్పిండి, గుడ్డు,
నువ్వులు మరియు పంచదారతో చేసిన పిండితో తయారు చేసులో తయారు చేకుంటారు.
ఈ భారతీయ స్టైల్ కుకీలు ఎక్కువగా పండుగ సీజన్‌లో తయారు
చేస్తారు.

4. ప్లం కేక్
క్రిస్మస్ సందర్భంగా ఇంట్లోనే కేక్‌లను తయారు చేయడం
ప్రత్యేకం. పండుగల సమయంలో ఎక్కువగా ప్లం కేక్‌లను ఇంట్లోనే
తయారుచేస్తారు. దీనికి ఎక్కువ సమయం పట్టదు. తక్కువ సమయంలో
కుక్కర్‌లో కేక్‌ను తయారు చేసుకోవచ్చు. కాబట్టి
క్రిస్మస్ జరుపుకునే ప్రతి ఒక్కరూ ప్లం కేక్ కూడా చేస్తారు.
5. పాలప్పం
పాలప్పాన్ని అప్పం అని కూడా అంటారు. ఇది కేరళ వంటకాలలో ఒక రకమైన
పాన్‌కేక్. క్రిస్మస్ వేడుకలకు ఇది ప్రధానమైన అల్పాహారం. ఇది
పులియబెట్టిన బియ్యం పిండి మరియు కొబ్బరి పాలతో తయారు చేస్తారు.
6. నాన్వెజ్
క్రిస్మస్ సందర్భంగా చాలా మంది ఇళ్లలో మాంసం వండుకోవడం సర్వసాధారణం.
పండగలో చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ గ్రేవీ, చికెన్ ప్రై,
మటన్ కబాబ్ అన్నీ చాలా స్పెషల్.
7. డక్ మోయిల్
ఈ వంటకం మహారాష్ట్రలోని ఆంగ్లో-ఇండియన్ కమ్యూనిటీ నుండి వచ్చింది. ఈ
వంటకం బాతు మాంసంతో తయారు చేయబడింది. ఇది బ్రెడ్, రైస్, ఫుజియాస్
మరియు సలాడ్‌లతో వడ్డిస్తారు. మహారాష్ట్రలో, ఆంగ్లో-ఇండియన్
కమ్యూనిటీ బాటిల్ మసాలాతో ఈ వంటకాన్ని తయారుచేస్తారు మరియు ఈ వంటకం
లేకుండా క్రిస్మస్ వేడుకలు పూర్తికావు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
