రాత్రి అన్నం మిగిలితే ఇలా ఊతప్పం చేయండి.. పిల్లలు, పెద్దలు లొట్టలేసుకుని తింటారు!

Posted By:

మన ఇళ్లల్లో అప్పుడప్పుడూ వండిన అన్నం మిగిలిపోవడం చాలా సహజం. మనం ఎంత లెక్క కట్టి కొలతలేసి వండినా కూడా ఎంతో కొంత మిగిలిపోతుంటది. అయితే రాత్రి వండిన అన్నం మిగిలిపోతే చాలామంది దాంతో పులిహోర, ఎగ్ రైస్ లేదా పెరుగన్నం, టమాటో రైస్ చేసుకుంటారు..మరికొందరు అయితే పొద్దుపొద్దున్నే రైస్ తినాలా అంటూ చద్దన్నం పడేస్తుంటారు.

అయితే రాత్రి మిగిలిపోయిన అన్నంతో రకరకాల వెరైటీల వంటకాలు కూడా చేసుకోవచ్చు. అందులో ఒకటి ఊతప్పం. మిగిలిపోయిన అన్నంతో ఊతప్పం చేసుకుంటే ఆ రుచిని మాటల్లో వర్ణించలేరు. అంత టేస్టీగా ఉంటుంది. ఇంట్లోనే ఉన్న పదార్థాలతో అప్పటికప్పుడు రాత్రి మిగిలిన అన్నంలో ఊతప్పం ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Don t Throw Away Leftover Rice Try This Delicious Instant Uthappam Recipe in Telugu

మిగిలిన అన్నంతో ఊతప్పం తయారీకి కావాల్సినవి

-బియ్యం పిండి
-శనగ పిండి
-గోధుమ పిండి
-కొత్తిమీర
-టమాటో
-కరివేపాకు
-క్యారెట్
-ఉల్లిపాయ
-పచ్చిమిర్చి
-జీలకర్ర

బెంగాలీ స్పెషల్ రాధాభల్లవి పూరీ..ప్లేట్ లోనే స్వర్గం కనిపించేస్తది!

మిగిలిన అన్నంతో ఊతప్పం తయారీ విధానం

-ముందుగా ఒక గిన్నె తీసుకోండి. అందులో మిగిలిపోయిన అన్నం ఒక కప్పు వేసి దాన్ని చేత్తోనే మెత్తగా మెదుపుకున్నట్లు చేయండి.

-తర్వాత ఆ అన్నంలోనే పావు కప్పు పొడి బియ్యం పిండి, పావు కప్పు శనగపిండి, పావు కప్పు గోధుమ పిండి, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, కొన్ని టమాటో ముక్కలు, 1 చిన్న క్యారెట్ తురుము, కరివేపాకు, కొత్తిమీర, సరిపడా ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర వేసి మొత్తం బాగా కలిసేలా చేత్తో కలుపుకోండి.

-బాగా కలిసేటట్లు కలుపుకున్నాక అందులో కొంచెం కొంచెంగా నీళ్లు పోసి తడుపుకుని ఊతప్పం వేసుకోడానికి ఎలా కలుపుకుంటామో అలా పిండిని కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం వంటసోడా వేసి కలుపుకోండి. దీనివల్ల ఊతప్పం మందంగా వేసినా కూడా చాలా సాఫ్ట్ గా వస్తాయి.

-తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టకోండి. పాన్ లో అర స్పూన్ ఆయిల్ వేసి కొంచెం వేడయ్యాక అందులో కలుపుకున్న పిండిని ఊతప్పంలా వేసుకోండి. మూతపెట్టి వేడి చేయాలి. ఒక వేపు కాలిన తర్వాత మరోవైపు తిప్పుకోండి.

-రెండువైపులా మంచిగా కాలిన తర్వాత ప్లేట్ లోకి తీసుకోండి. అంతే మిగిలిన అన్నంతో టేస్టీ ఊతప్పం రెడీ.

[ of 5 - Users]
Story first published: Wednesday, September 9, 2026, 10:00 [IST]
Desktop Bottom Promotion