Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
ఈ కిచిడి తింటే, బిర్యానీని కూడా వద్దంటారు.. చాలా మందికి ఫేవరెట్,ఎలా చేసుకోవాలో చూడండి?
ఎవరికైనా ప్రతిరోజూ ఒకే రకమైన వంటకాలు తినడం బోర్ కొడుతుంది. అటువంటి సమయాల్లో చాలా మంది కిచిడిని తయారుచేసుకుంటారు. పప్పులు, కూరగాయలు మిశ్రమంతో చేసిన ఈ రుచికరమైన వంటకం పిల్లలు, పెద్దలు, బ్యాచిలర్స్ కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే దీనిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. అయితే, ఈ సారి కిచిడికి ఒక కొత్త వేరియంట్ ట్రై చేయండి. అదే దమ్ కిచిడీ. ఇది కిచిడిని మరింత రుచికరంగా తయారుచేస్తుంది. అలాగే ఇది చాలా సులభమైన పద్దతిలో చేసుకోగలుగుతారు. ఇది సేమ్ బిర్యానీ లాగా రుచిగా ఉంటుంది. అయితే ఈ స్టోరీలో దమ్ కిచిడి ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
బాస్మతి బియ్యం - 2 కప్పులు
కందిపప్పు - 1/2 కప్పు
ఉల్లిపాయలు - 2
టమాటాలు - 2
పచ్చిమిర్చి - 4
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర - కొద్దిగా
పుదీనా - కొద్దిగా
గరం మసాలా - 1 టీస్పూన్
పసుపు - 1/2 టీస్పూన్
కారం - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి తగినంత
నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
నూనె - 2 టేబుల్ స్పూన్లు
నీరు - 4 కప్పులు
దాల్చిన చెక్క - 2 చిన్న ముక్కలు
లవంగాలు - 4
యాలకులు - 2
బిర్యానీ ఆకు - 1
తయారీ విధానం:
ముందుగా బియ్యం మరియు కందిపప్పును కడిగి, 30 నిమిషాలు నీటిలో నానబెట్టండి.
ఈలోపు ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అన్నీ చిన్నగా కట్ చేసి వుంచండి.
స్టవ్ మీద గిన్నె పెట్టి నెయ్యి, నూనె వేడి చేసి దానిలో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు వేసి వేయించండి.
బిర్యానీ దినుసులు వేయించిన తర్వాత ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించండి.
అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించండి.
ఇప్పుడు టమాటాలు, పచ్చిమిర్చి వేసి, మెత్తబడే వరకు ఉడికించండి.
శ్రీరామ నవమి స్పెషల్.. రామయ్యకు ఎంతో ఇష్టమైన వడపప్పు పానకం ఎలా చేసుకోవాలో తెలుసా?
పసుపు, కారం, గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలిపి, నూనె పైకి తేలే వరకు సిమ్‌లో ఉడికించండి.
ఆ మసాలా మగ్గిన తరువాత నానబెట్టిన బియ్యం, కందిపప్పు వేసి బాగా కలిపి, అందులో నీరు పోసి, కొత్తిమీర, పుదీనా వేసి మరోసారి కలుపుకోండి.
ఇప్పుడు గిన్నెపై మూత పెట్టి, ఆవిరి బయటికి పోకుండా, మూత పై బరువు వస్తువును పెట్టి సిమ్‌లో 15 నిమిషాలు ఉడికించండి.
నీరు పూర్తిగా ఆవిరై, బియ్యం మెత్తగా ఉడికితే దమ్ కిచిడీ సిద్ధంగా ఉంటుంది.
ఇది వేడివేడిగా వడ్డించండి, ఇది అద్భుతంగా ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్, లంచ్ లేదా డిన్నర్‌కి ఇది ఒక పర్ఫెక్ట్ వంటకం.
చిట్కాలు:
బిర్యానీకి మరింత రుచిని కలిగించేలా గరం మసాలా కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు.
మీరు ఇష్టపడిన కూరగాయలను కూడా ఈ కిచిడిలో చేర్చవచ్చు.
బాస్మతి బియ్యం లేకపోతే సాధారణ బియ్యం కూడా వాడుకోవచ్చు.
దమ్ కిచిడిని సరిగ్గా తయారుచేయాలంటే, గిన్నె కింద ఒక పాత పెనం ఉంచితే వంటకాలు అడుగంటకుండా ఉండవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












