దసరా స్పెషల్ కట్టె పొంగలి..ఇలా చేస్తే చల్లారినా కూడా గట్టిగా మద్ద అవ్వదు!

Posted By:

దేశవ్యాప్తంగా ఇవాళ విజయదశమి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. హిందువులే కాకుండా అనేక ఇతర మతాల వాళ్లు కూడా దసరా పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే ఈ దసరా రోజున అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడానికి స్పెషల్ కట్టె పొంగలి ట్రై చేయండి.

సాధారణగా రోజుల్లో టిఫిన్స్ కి ఏం చేయాలో తోచనప్పుడు కూడా సింపుల్ గా ఈ కట్టె పొంగలి చేసుకోవచ్చు. ఘాటుగా, ఎంతో రుచిగా, చల్లారిన తర్వాత కూడా గట్టిగా ముద్ద అవ్వకుండా ఉండేలా కట్టె పొంగలి మీ ఇంట్లో ఈ దసరా రోజు ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Dussehra 2026 special naivedyam recipe how to make tasty katte pongali at home in telugu

తయారీకి కావాల్సిన పదార్థాలు

-బియ్యం
-పెసరపప్పు
-ఉప్పు
-మిరియాలు
-నీళ్లు
-నెయ్యి
-పచ్చిశెనగపప్పు
-ఆవాలు
-జీలకర్ర
-జీడిపప్పు
-కరివేపాకు
-ఇంగువ
-అల్లం ముక్కలు
-పసుపు
-పచ్చిమిర్చి

దసరా స్పెషల్ రెడ్ చికెన్.. చికెన్ కర్రీ వండేటప్పుడు ఈ సీక్రెట్ మసాలా వేస్తే టేస్ట్ నెక్ట్స్ లెవల్ అంతే!

తయారీ విధానం

-ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకోండి. అందులో ముప్పావు కప్పు పెసరపప్పు(moong dal)వేసి ఆయిల్ లేకుండానే వేయించాలి. బాగా ఫ్రై అయ్యి కాస్త కలర్ మారిన తర్వాత స్టవ్ ఆపేయండి

-తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకోండి. అందులో 1 కప్పు బియ్యం(100గ్రాములు), వేయించిన పెసరపప్పు వేయండి. ఇందులో నీళ్లు పోసి 2-3సార్లు బాగా కడగండి. తర్వాత అందులోనే నీళ్లు అరగంటసేపు నానబెట్టండి.

-తర్వాత కట్టె పొంగలి ఉడకడానికి సరిపడా గిన్నెను స్టవ్ మీద పెట్టి అందులో బియ్యం కొలిచిన కప్పు కొలతతోనే 6-7 కప్పుల నీళ్లు పోయండి, ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, పావు టీస్పూన్ మిరియాలు వేసి నీళ్లను బాగా మరగనివ్వాలి.

-నీళ్లు వేడవుతున్నప్పుడు అరగంట సేపు నానబెట్టుకున్న బియ్యం,పెసరపప్పు మిశ్రమాన్ని అందులో వేయండి. ఒకసారి బాగా కలిపి మంటను మీడియంలో ఉంచి ఉడికించాలి. మధ్యమధ్యలో కలుపుతూ మూతను కొంచెం ఓపెన్ గా ఉంచాలి. దీంతో ఇందులోని ఎసరు పొంగినట్లు అవ్వకుండా చక్కగా ఉడుకుతుంది.

-నీళ్లు దగ్గరపడి, అన్నం దాదాపుగా ఉడికినట్లు అయిన తర్వాత పప్పు గుత్తి లేదా గరిటెతో అన్నాన్ని మ్యాష్ చేసుకోండి. అంటే మెదిపినట్లు చేయాలి. అప్పుడు అన్నం కొంచెం గట్టిగా అనిపిస్తుంది. ఆ టైంలో అందులో 1 కప్పు వేడి నీళ్లు పోసుకోండి. బాగా కలిపి మరో 2 నిమిషాలు ఉడికించాలి.

-అదే సమయంలో మరోవైపు, స్టవ్ మీద తాలింపు రెడీ చేసుకోవాలి. ఇందుకోసం స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడయ్యాక అందులో 1 టీస్పూన్ పచ్చిశెనగపప్పు, అర టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ జీలకర్ర వేసి అవి కొంచెం వేగాక అందులోనే సన్నగా తరిగిన అల్లం ముక్కలు, 2 పచ్చిమిర్చి ముక్కలు, కచ్చాపచ్చగా దంచిన అర టీస్పూన్ మిరియాలు, కొంచెం జీడిపప్పు, కరివేపాకు వేయింయాలి. చివరగా అందులో పావు టీస్పూన్ ఇంగువ వేసి కలిపాక చిటికెడు పసుపు వేసి కలుపుకోండి.

-వేగిన తాలింపుని పక్కన ఉడుకుతున్న కట్టె పొంగలిలో వేసి వెంటనే మూతపెట్టి 1-2 నిమిషాలు తక్కువ మంట మీద ఉడికించాలి. ఇలా చేయడం వల్ల తాలింపులోని ఫ్లేవర్స్ అన్నీ కట్టె పొంగలికి బాగా పడతాయి. 2 నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలపండి. అంతే కమ్మని కట్టె పొంగలి రెడీ.

[ of 5 - Users]
Story first published: Tuesday, October 20, 2026, 9:11 [IST]
Desktop Bottom Promotion