Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
బీట్రూట్ రసం..ఆరోగ్యానికి అమృతం, రుచికి అద్భుతం..ఎలా చేయాలంటే
ప్రకృతి ప్రసాదాల్లో బీట్ రూట్ ఒకటి. బీట్ రూట్ తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని మనందరికీ తెలిసిన విషయమే. బీట్రూట్, దాని ప్రకాశవంతమైన రంగు, ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందిన ఒక అద్భుతమైన కూరగాయ. ఇది కేవలం రుచికరమైనది మాత్రమే కాదు విటమిన్స్, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. ఆరోగ్యానికి బోలెడు మేలు చేసే బీట్ రూట్ తో రసం కాస్తే..అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడూ అదే మిరియాల రసం చేసుకుని బోర్ కొడుతుంటే ఓ సారి తప్పకుండా బీట్ రూట్ రసం తయారు చేసుకోండి. దీనిని చేసుకోవడం కూడా చాలా ఈజీ. మీ ఇంట్లోనే ఈజీగా బీట్ రూట్ రసం ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
బీట్ రూట్ రసం తయారీకి కావాల్సిన పదార్థాలు
-బీట్ రూట్
-పసుపు
-చింతపండు
-మిరియాలు
-కారం
-కరివేపాకు
-కొత్తిమీర
-టామాటో
-ఆయిల్
-ఆవాలు
-జీలకర్ర
-వెల్లుల్లి
-ధనియాలు
-మెంతులు
-ఇంగువ
-ఉప్పు
బీట్ రూట్ రసం తయారీ విధానం
-ముందుగా నిమ్మకాయ సైజు అంత చింతపండు ఓ బౌల్ లో వేసి అందులో నీళ్లు పోసి 10 నిమిషాలు నానబట్టండి.
-తర్వాత మిక్సీ గిన్నెలో 1 టీప్పూన్ ధనియాలు, అర టీస్పూన్ మిరియాలు చిటికెడు మెంతులు, 1 టీస్పూన్ జీలకర్ర వేసి కొంచెం కచ్చాపచ్చాగానే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి.
-తర్వాత రెండు బీట్ రూట్ లను తీసుకొని పైన తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలను మిక్సీ జార్ లో వేసి కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి.
-గ్రైండ్ చేసిన బీట్ రూట్ మిశ్రమాన్ని వడగిన్నెలో వేసి వడకట్టి తీసుకోండి. ఈ బీట్ రూట్ జ్యూస్ ని పక్కన పెట్టుకోండి.
-తర్వాత నానిన చింతపండులో 1 టమాటో కాయను చేత్తో మెత్తగా పిసికి వేసి ఆ తర్వాత ఆ మెత్తం రసాన్ని పిప్పి పడకుండా బీట్ రూట్ జ్యూస్ లో వేసి కలపడండి.
-ఇప్పుడు రసం పెట్టుకోడానికి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి వేడి చేశాక ఇందులో పావు టీస్పూన్ ఆవాలు,పావు టీస్పూన్ జీలకర్ర వేసి వేయించాక అందులో6 కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, 3 ఎండుమిరపకాయలు తుంచి వేయాలి.
-కరివేపాకు,వెల్లుల్లి వేగిన తర్వాత ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్న పొడిని,చిటికెడు ఇంగువను వేసి కలపాలి. పొడి మాడకుండా చూసుకోండి.
-తర్వాత అందులో కలిపి పెట్టుకున్న బీట్ రూట్ రసం పోసి బాగా కలపాలి. పులుపుకు తగ్గట్లుగా నీరు కలపండి. రుచికి సరిపడా ఉప్పు, పావు టీస్పూన్ కారం, పావు టీస్పూన్ పసుపు వేసి తక్కువ మంటమీద 10 నిమిషాలు బాగా కలపడండి.
-రసం బాగా మరుగుతున్నప్పుడు కావాలనుకుంటే కొద్దిగా బెల్లం అందులో వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం కొత్తిమీర తరుగు అందులో వేసి కలపండి. అంతే టేస్టీ బీట్ రూట్ రసం రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications







