Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ప్రసాదం స్టైల్ కొబ్బరన్నం..చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే
పవిత్రమైన పండుగ రోజుల్లో లేదా ప్రత్యేక సందర్భాలలో దేవుడికి నైవేద్యంగా పెట్టే ప్రసాదాలలో కొబ్బరన్నం ఒకటి. దీని ప్రత్యేకమైన రుచి, సువాసన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. సాధారణంగా మనం ఇంట్లో చేసుకునే కొబ్బరన్నానికి, గుడిలో ప్రసాదంగా పెట్టే కొబ్బరన్నానికి కొద్దిగా తేడా ఉంటుంది. గుడి ప్రసాదం రుచి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అయితే కొన్ని టిప్స్ పాటిస్తే ప్రసాదం స్టైల్ కొబ్బరన్నం ఇంట్లో కూడా అదే టేస్ట్ తో తీసుకురావచ్చు.
ఇది ఎప్పుడైనా తినడానికి బాగుంటుంది. లంచ్ బాక్సులకి కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎలా,ఎప్పుడు తిన్నా అదిరిపోయే ప్రసాదం స్టైల్ కొబ్బరన్నం ఇంట్లో తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

కోకోనట్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు
-బియ్యం
-కొబ్బరిపాలు
-ఆయిల్
-కొబ్బరి తురుము
-మినపప్పు
-పచ్చి శెనగపప్పు
-ఆవాలు
-జీలకర్ర
-ఇంగువ
-కరివేపాకు
-జీడిపప్పు
-ఉప్పు
-పచ్చి మిరపకాయలు
-పచ్చి కొబ్బరి తురుము
-కొత్తిమీర
కోకోనట్ రైస్ తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో 1 కప్పు శుభ్రంగా కడిగిన బియ్యం, ఒకటి ముప్పావు కప్పుల కొబ్బరి పాలు, పావు కప్పు నీళ్లు, అర టీస్పూన్ ఆయిల్ వేసి మూతపెట్టేయండి.
-రెండు విజిల్స్ మీడియం మంట మీద, 1 విజిల్ పెద్ద మంటమీద ఉడికనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేయండి.
-స్టీమ్ అంతా పోయాక మూతతీసి అడుగు నుంచి గరిటతో కలబెట్టండి. వేడిమీదనే రుచికి సరిపడా ఉప్పు ఇందులో వేసి కలపండి.
-తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చెయ్యాలి.
-వేడెక్కిన ఆయిల్ లో 1 టీస్పూన్ జీలకర్ర, 1 టీస్పూన్ మినపప్పు, 1 టీస్పూన్ ఆవాలు, 1 టీస్పూన్ పచ్చి శెనగపప్పు, 4 పచ్చిమిరపకాయల చీలికలు, పిడికెడు జీడిపప్పు పలుకులు, 2 రెబ్బల కరివేపాకు వేసి ఎర్రగా వేయించుకోవాలి. కావాలనుకుంటే ఇందులోనే చిటికెడు ఇంగువ కూడా వేసుకోండి.
-తాళింపు బాగా వేగిన తర్వాత అందులో 1 పచ్చి కొబ్బరి చిప్పు తురుము వేసి కలిపి వెంటనే ప్టవ్ మీద నుంచి దించేయాలి.
-ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఈ తాళింపు మిశ్రమం మొత్తాన్ని వేసి,కొంచెం కొత్తిమీర తరుగు కూడా చల్లుకొని కలుపుకోండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications