Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
బిస్కెట్లతో బ్రహ్మాండమైన బర్త్ డే కేక్..కుక్కర్ లోనే ఈజీగా..వంట రాని వారు కూడా చేయొచ్చు
పుట్టినరోజు వేడుకలంటేనే కేక్ కటింగ్ ఒక ప్రత్యేకమైన ఘట్టం. ఆ కేక్ ను మనమే స్వయంగా మన ఇంట్లో, మన ఆత్మీయుల కోసం తయారుచేస్తే ఆ ఆనందమే వేరు. అయితే మీ ఇంట్లో ఓవెన్ లేకపోయినా, పెద్దగా వంట అనుభవం లేకపోయినా ఇంట్లో ఉండే ప్రెజర్ కుక్కర్, బిస్కెట్లతో ఎంత సులభంగా బర్త్‌డే కేక్ ను తయారు చేయవచ్చు. ఈ కేక్ మృదువుగా, చాక్లెట్ ఫ్లేవర్ తో ఎంతో రుచిగా ఉంటుంది. మీరు మీ ప్రియమైనవారి పుట్టినరోజున ఈ కేక్ ను స్వయంగా చేసి సర్ప్రైజ్ చేయండి. మీ చేతులతో చేసిన ఈ కేక్.. బయట కొన్న ఖరీదైన కేక్ కంటే వంద రెట్లు ఎక్కువ ఆనందాన్ని, సంతృప్తిని ఇస్తుంది
తయారీకి కావాల్సిన పదార్థాలు
-చక్కెర
-పాలు
-చాకో చిప్ కుకీస్
-కోకోవా పౌడర్
-బటర్
-బేకింగ్ పౌడర్
-బేకింగ్ సోడా
-చాక్లెట్

తయారీ విధానం
-ముందుగా హ్యాపీ హ్యాపీ చాకో చిప్ కుకీస్ 400 గ్రాములు తీసుకోండి.
-ఓ మిక్సీ గిన్నెలో 400గ్రాముల చాకో చిప్ కుకీస్ బిస్కెట్లను వేయండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల చక్కెర, 1 టేబుల్ స్పూన్ కోకోవా పౌడర్(ఇది మీ ఇష్టం)కూడా వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.
-గ్రైండ్ చేసిన పొడిని ఓ బౌల్ లోకి తీసుకోండి. ఇందులోనే 1 కప్పు పాలను కొంచెంగా పోస్తూ పొడిలో కలిసేలా కలుపుకోవాలి. మిశ్రమాన్ని జారుగా ఉండేలా కలుపుకోవాలి.
-ఇప్పుడు కలుపుకున్న మిశ్రమంలోనే అర టీస్పూన్ బేకింగ్ సోడా, 1 టీస్పూన్ బేకింగ్ పౌడర్, మరో 3 టేబుల్ స్పూన్ల పాలు పోసి గరిటతో మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి.
-తర్వాత ఓ కేకు గిన్నె తీసుకొని అందులో నెయ్యి అప్లై చేయండి. అడుగున, అంచులకు నెయ్యి లేదా బటర్ అప్లయ్ చేశాక అందులో అడుగున ఒక బటర్ పేపర్ వేసి దానిమీద రెడీ చేసుకున్న కేకు మిశ్రమం మొత్తాన్ని పోసేయండి. బబూల్స్(నీటి బుడగలు)లేకుండా గిన్నెను కాస్త అట ఇటూ చేత్తో తిప్పుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో ఈ కేకు గిన్నెను పెట్టి తక్కువ మంట మీద 50 నిమిషాల దాకా బేక్ చేయాలి.
-తర్వాత ఆ గిన్నెను కుక్కర్ లో నుంచి బయటకు తీసి గిన్నెను బోర్లిస్తే కేకు బయటకు వచ్చేస్తుంది.
-ఇప్పుడు ఓ గిన్నెలో 100గ్రాముల చాక్లెట్, 1 టేబుల్ స్పూన్ బటర్, 2 టేబుల్ స్పూన్ల పాలు పోసి దీనిని స్టవ్ మీద పెట్టి బాగా కరగనివ్వాలి.
-తర్వాత ఈ కరిగిన మిశ్రమాన్ని కేకు మీద పోసేయండి. అంతే సూపర్ టేస్టీ బర్త్ డే కేకు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications