Latest Updates
-
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది
రోజూ తినే ఫ్రైడ్ రైస్ బోర్ కొట్టిందా?..సింగపూర్ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి కేక అంతే..ఎలా చేసుకోవాలంటే
రోజూ తినే ఫ్రైడ్ రైస్ బోర్ కొట్టిందా? కొంచెం కొత్తగా, కారంగా, రుచికరంగా ఏదైనా తినాలనిపిస్తోందా? అయితే మీకోసమే ఈ సింగపూర్ ఫ్రైడ్ రైస్. ఇది కేవలం ఒక వంటకం కాదు, రకరకాల సాస్‌ల కలయికతో, రంగురంగుల కూరగాయలతో నోరూరించే ఒక అద్భుతం. ప్రతి ముద్దలో కరకరలాడే కూరగాయల ముక్కలు, కారంగా తగిలే సాస్ ల రుచి మిమ్మల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఇంట్లో పార్టీ ఉన్నా, వీకెండ్ లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి ప్రత్యేకంగా భోజనం చేయాలనుకున్నా, ఈ వంటకం కచ్చితంగా అందరి మన్ననలను పొందుతుంది. తక్కువ సమయంలో, సులభంగా తయారు చేసుకోవచ్చు. సింగపూర్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
-అన్నం - 2 కప్పులు
-ఆలివ్ ఆయిల్- 2 టేబుల్ స్పూన్లు
-వెల్లుల్లి రెబ్బలు - 4-5
-స్ప్రింగ్ ఉల్లిపాయలు - అర కప్పు
-క్యారెట్ - పావు కప్పు
-క్యాప్సికమ్ - అర కప్పు
-పచ్చిమిర్చి - 1
-రెడ్ చిల్లీ సాస్- 2 టేబుల్ స్పూన్లు
-లైట్ సోయా సాస్ - 1 టేబుల్ స్పూన్
-చిల్లీ గార్లిక్ సాస్ - 1 టేబుల్ స్పూన్
-వెనిగర్ - అర టేబుల్ స్పూన్
-మిరియాల పొడి - అర టీస్పూన్
-ఉప్పు - రుచికి సరిపడా

తయారీ విధానం
-ముందుగా బియ్యాన్ని 90శాతం ఉడికించి, నీరు వార్చి ఒక వెడల్పాటి ప్లేటులో ఆరబెట్టాలి. అన్నం పూర్తిగా చల్లారి, పొడిగా అవ్వడం చాలా ముఖ్యం.
-ఇప్పుడు ఒక పెద్ద బాండీని స్టవ్ మీద పెట్టి ఎక్కువ మంట మీద నూనె వేడి చేయాలి. నూనె వేడెక్కాక సన్నగా తరిగిన వెల్లుల్లి వేసి మంచి సువాసన వచ్చేవరకు వేయించాలి. ఇప్పుడు స్ప్రింగ్ ఉల్లిపాయలోని తెల్లని భాగం, పచ్చిమిర్చి వేసి ఒక నిమిషం పాటు వేపాలి. ఆ తర్వాత క్యారెట్, క్యాప్సికమ్ ముక్కలు వేసి, కూరగాయలు మెత్తబడకుండా వాటి కరకరలాడే స్వభావం పోకుండా కేవలం రెండు నిమిషాలు వేయించాలి.
-ఇప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి. ఆ తర్వాత రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, చిల్లీ గార్లిక్ సాస్, వెనిగర్ వేసి బాగా కలపాలి. సాస్ లన్నీ కూరగాయలకు బాగా పట్టేలా ఒక నిమిషం ఉడికించాలి.
-చివరగా, చల్లార్చి పెట్టుకున్న అన్నాన్ని బాండీలో వేయాలి. మంటను ఎక్కువగా పెట్టి అన్నం విరగకుండా సాస్ లు, కూరగాయలతో పూర్తిగా కలిసేలా గరిటతో గానీ లేదా బాణలిని ఎగరేస్తూ గానీ (టాస్ చేస్తూ) కలపాలి. రెండు నిమిషాల పాటు ఇలా చేయడం వల్ల అన్నానికి మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది.
-స్టవ్ ఆఫ్ చేసి సన్నగా తరిగిన స్ప్రింగ్ ఉల్లిపాయ పచ్చని భాగంతో గార్నిష్ చేయాలి. అంతే వేడివేడిగా, కారకారంగా ఉండే సింగపూర్ ఫ్రైడ్ రైస్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications