Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పంజాబీ స్టైల్ లో కడ్డు కా హల్వా..టేస్ట్ లో ది బెస్ట్,ఆరోగ్యానికి ఓ నిధి..ఈజీగా ఎలా చేసుకోవాలంటే
గుమ్మడికాయ అనగానే మనకు గుర్తొచ్చేది సాంబారు, పులుసు లేదా మహా అయితే ఓ కూర. అదే గుమ్మడికాయతో నోట్లో వేసుకుంటే కరిగిపోయే అద్భుతమైన హల్వా చేయొచ్చని మీకు తెలుసా? పంజాబీ సంప్రదాయ వంటకాల్లో ఒకటైన కడ్డు కా హల్వా రుచికి చిరునామా, ఆరోగ్యానికి ఓ వరం. సాధారణ స్వీట్లకు భిన్నంగా, కొత్తదనాన్ని కోరుకునే వారికి ఇది ఒక తియ్యటి సమాధానం. పండుగలు వచ్చినా, ఇంటికి బంధువులు వచ్చినా ఈసారి ఈ గుమ్మడికాయ హల్వాతో వారిని ఆశ్చర్యపరచండి.
గుమ్మడికాయ సహజసిద్ధమైన తీపి, ఘుమఘుమలాడే నెయ్యి సువాసన, పాల మీగడ లాంటి మృదుత్వం, యాలకుల పరిమళం ఈ అద్భుతమైన కలయిక ఎవరినైనా ఇట్టే కట్టిపడేస్తుంది. దీని తయారీ కూడా చాలా సులభం, తక్కువ సమయంలోనే సిద్ధం చేసుకోవచ్చు. ఈ హల్వా కేవలం రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా ఓ నిధి లాంటిది. గుమ్మడికాయలో కేలరీలు చాలా తక్కువ. కాబట్టి బరువు గురించి ఆందోళన చెందేవారు కూడా దీన్ని నిరభ్యంతరంగా ఆస్వాదించవచ్చు. ఇందులో విటమిన్ A,C, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి చూపుకు, రోగనిరోధక శక్తికి ఎంతగానో దోహదపడతాయి. గుమ్మడికాయకు సహజంగానే తీపి గుణం ఉండటం వల్ల, మనం వాడాల్సిన చక్కెర పరిమాణం గణనీయంగా తగ్గుతుంది. ఆరోగ్యానికి బోలెడు మేలు చేసే టేస్టీ గుమ్మడికాయ హల్వా పంజాడీ స్టైల్ లో ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

గుమ్మడికాయ హల్వా తయారీకి కావలసిన పదార్థాలు
-గుమ్మడికాయ తురుము - 1 కప్పు
-చిక్కటి పాలు - 1 కప్పు
-స్వచ్ఛమైన నెయ్యి - అర కప్పు
-చక్కెర - అర కప్పు
-యాలకుల పొడి - పావు టీస్పూన్
-కుంకుమపువ్వు - చిటికెడు
-బాదం,పిస్తా - 2-3 టేబుల్ స్పూన్లు
గుమ్మడికాయ హల్వా తయారీ విధానం
-ముందుగా మంచిగా పండిన గుమ్మడికాయను శుభ్రంగా కడిగి పై తొక్క, లోపలి గింజలను పూర్తిగా తొలగించి, సన్నగా తురుముకోవాలి.
-అడుగు మందంగా ఉన్న పాన్ లో నెయ్యి వేసి వేడిచేయాలి. నెయ్యి కరిగాక గుమ్మడికాయ తురుము వేసి పచ్చి వాసన పోయి మెత్తబడే వరకు సుమారు 5-7 నిమిషాలు సన్నని మంటపై వేయించాలి.
-ఇప్పుడు పాలు పోసి మిశ్రమం దగ్గరపడే వరకు బాగా కలపాలి. పాలు పూర్తిగా ఇగిరిపోయి, హల్వా చిక్కబడటానికి సుమారు 20 నిమిషాలు పడుతుంది. ఈ సమయంలో అడుగంటకుండా మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి.
-మిశ్రమం చిక్కబడ్డాక చక్కెర వేసి కలపాలి. చక్కెర కరిగాక మిశ్రమం కాస్త పలుచబడుతుంది. నీరంతా ఆవిరైపోయి, నెయ్యి పాన్ అంచుల నుంచి విడివడుతున్నప్పుడు హల్వా సిద్ధమైనట్టే.
-చివరగా యాలకుల పొడి, పాలల్లో నానబెట్టిన కుంకుమపువ్వు వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.ఆరోగ్యకరమైన, అమోఘమైన రుచి కలిగిన పంజాబీ స్టైల్ గుమ్మడికాయ హల్వా రెడీ. వేడివేడిగా లేదా చల్లారిన తర్వాత, సన్నగా తరిగిన బాదం, పిస్తాలతో అలంకరించి సర్వ్ చేసుకోవడమే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications