షుగర్, బీపీకి చెక్ పెట్టే కొర్రల కిచిడీ..వారంలో 2 రోజులు తింటే బరువు తగ్గడమే కాకుండా రోజంతా సూపర్ ఎనర్జీ!

Posted By:

కొంతకాలంగా ప్రజల్లో ఆరోగ్య సృహ పెరగడంతో అందరూ మళ్లీ మన పూర్వీకులు తిన్న ఆహారం వైపు చూస్తున్నారు. ముఖ్యంగా రాగులు, జొన్నలు, కొర్రలు వంటి మిల్లెట్స్(సిరి ధాన్యాలు)తినేందుకు ఇష్టపడుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా మిల్లెట్స్ తినాలని ప్రజలను ఎంకరేజ్ చేస్తున్నారు. తాను కూడా వైట్ రైస్ తినడం పూర్తిగా మానేసినట్లు ఆయన చెబుతున్నారు. మన సాంప్రదాయ ధాన్యాలలో కొర్రలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. షుగర్, రక్తపోటు, అధిక బరువుతో బాధపడేవారికి, జీర్ణవ్యవస్థను మెరుగుపరుచుకోవాలనుకునే వారికి కొర్రల కిచిడీ బెస్ట్.

సాధారణ బియ్యంతో చేసే కిచిడీ కంటే కొర్రలతో చేసే కిచిడీలో పీచు పదార్థం, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉంటాయి. ప్రతిరోజూ బియ్యం లేదా గోధుమలతో చేసే పదార్థాలు తినడానికి బదులుగా వారంలో 2-3 రోజులు ఇలాంటి చిరుధాన్యాల వంటకాలను మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.ఫైబర్ పుష్కలంగా ఉండి, రోజంతా మిమ్మల్ని ఎనర్జీగా ఉంచే కొర్రల కిచిడీని మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Foxtail Millet Khichidi Recipe Healthy Nutrient Rich Korrala Kichidi for Weight Loss Diabetes

కొర్రల కిచిడీ తయారీకి కావాల్సిన పదార్థాలు

-పెసరపప్పు
-నూనె లేదా వెన్న
-ఆవాలు
-జీలకర్ర
-అల్లం
-వెల్లుల్లి
-ఇంగువ
-ఉల్లిపాయ
-పచ్చిమిర్చి
-కరివేపాకు
-పచ్చి బఠాణీ
-క్యారెట్
-బీన్స్
-టమాటో
-ఉప్పు
-పసుపు
-కారం
-కొర్రలు
-నీళ్లు
-కొత్తిమీర

చికెన్, మటన్ బిర్యానీలను మరిపించే స్పైసీ టమాటా బిర్యానీ..కుక్కర్ లో ఈజీగా చేసేయండిలా..

కొర్రల కిచిడీ తయారీ విధానం

-ముందు కొర్రలను కనీసం 6 గంటల సేపు నీటిలో నానబెట్టుకోవాలి.

-6 గంటల తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో పెసరపప్పు వేసి నూనె లేకుండానే మంచి దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకోండి.

-తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో నెయ్యి లేదా వెన్న వేసి వేడి చెయ్యాలి. తర్వాత అందులోనే జీలకర్ర, ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. తర్వాత అందులో సన్నగా తరిగిన అ్లలం ముక్కలు, సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు వేసి వేయించి ఆ తర్వాత అందులో చిటికెడు ఇంగువ కూడా వేసి కలుపుకోండి. తర్వాత అందులోనే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు వేసి కాసేపు వేగనివ్వాలి.

-ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వత అందులో పచ్చి బఠాణీలు, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు వేసి వేయించాలి. తర్వాత అందులో టమాటో ముక్కలు, ఉప్పు, పసుపు, కారం వేసి ముక్కలన్నీ మెత్తబడే వరకు మగ్గనివ్వాలి.

-తర్వాత అందులో 6 గంట పాటు నానబెట్టుకున్న కొర్రలను, వేయించి పక్కన పెట్టుకున్న పెసరపప్పు వేసి బాగా కలిపాక దీనికి సరిపడా నీళ్లు పోసి కుక్కర్ మూతపెట్టి 4 విజిల్స్ వచ్చేదాకా ఉడకనిచ్చి ప్రెజర్ పోయాక మూత తీసి పైన కొంచెం కొత్తిమీర చల్లి, నెయ్యి చల్లుకుంటే చాలు.

-అంతే వేడి వేడి కొర్రల కిచిడీ రెడీ. దీనిని వేడి వేడిగా ఆవకాయతో తింటే అద్భుతంగా ఉంటది.

[ of 5 - Users]
Story first published: Saturday, October 17, 2026, 8:08 [IST]
Desktop Bottom Promotion