Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
వినాయక చవితికి పర్ఫెక్ట్ మోదకాలు..ఇలా చేస్తే రుచి అదుర్స్
హిందూమతంలో ఏ పూజ అయినా ఏ ముఖ్య కార్యక్రమమైనా ముందుగా వినాయకుడిని పూజించి తర్వాత పని మొదలుపెడుతుంటారు. వినాయకుడి పూజతో ఆటంకాలు అన్నీ తొలగిపోతాయని చెబుతారు. ఈ ఏడాది ఆగస్టు 27న వినాయక చవితి సెలబ్రేట్ చేసుకుంటారు. మనదేశంలో అన్ని రాష్ట్రాల్లో జరుపుకునే అతిపెద్ద పండుగ వినాయకచవితి. ఒక్క హిందువులే కాకుండా అనేక ఇతర మతాల వ్యక్తులు కూడా వినాయకచవితిని సెలబ్రేట్ చేసుకుంటారు.
వినాయక చవితి పండుగ వచ్చిందంటే ముందుగా గుర్తుకొచ్చేది గణపతికి ఎంతో ఇష్టమైన మోదకాలు. ఈ ప్రసాదం గణేశుడికి ఎంత ఇష్టమంటే ఆయనకు మోదకప్రియ అనే పేరు కూడా ఉంది. సంస్కృతంలో మోదకం అనే పదానికి ఆనందపు చిన్న భాగం అని అర్థం. ఈ ప్రసాదం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సూచిస్తుందని కూడా నమ్ముతారు. మోదకాలు అనేక రకాలుగా తయారు చేస్తారు. ముఖ్యంగా ఉడికించినవి ఒకటి, నూనెలో వేయించి (ఫ్రైడ్ మోదక్) చేస్తారు. ఉడికించే మోదకాలను ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

మోదకాలు తయారీకి కావాల్సిన పదార్థాలు
-బియ్యప్పిండి- 1 కప్పు
-నీరు-1 కప్పు
-నెయ్యి- 1 టీస్పూన్
-ఉప్పు- చిటికెడు
-తురిమిన తాజా కొబ్బరి- 1 కప్పు
-తురిమిన బెల్లం- పావు కప్పు కప్పు
-యాలకుల పొడి- అర టీస్పూన్
-నెయ్యి-1 టీస్పూన్
-డ్రై ఫ్రూట్స్ (జీడిపప్పు, ఎండు ద్రాక్ష): 2 టేబుల్ స్పూన్స్
తయారీ విధానం
-ముందుగా పూర్ణం తయారుచేసుకోవాలి. ఇందుకోసం ఒక మందపాటి గిన్నెలో నెయ్యి వేసి వేడి చేయండి.
-నెయ్యి కరిగాక, అందులో తురిమిన కొబ్బరి, బెల్లం వేసి బాగా కలపండి.
-ఈ మిశ్రమాన్ని మీడియం మంట మీద బెల్లం పూర్తిగా కరిగి, కొబ్బరి మిశ్రమం దగ్గరపడే వరకు ఉడికించండి. మిశ్రమం కొద్దిగా జిగురుగా మారితే సరిపోతుంది. అతిగా ఉడికించవద్దు.
-ఇప్పుడు యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి, స్టవ్ ఆఫ్ చేయండి.
-ఈ పూర్ణాన్ని చల్లారడానికి పక్కన పెట్టండి.
-ఇప్పుడు మరొక గిన్నెలో నీరు, నెయ్యి, చిటికెడు ఉప్పు వేసి బాగా మరగనివ్వండి.
-నీరు బాగా మరిగాక స్టవ్ ఆపేసి బియ్యప్పిండిని కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా బాగా కలపండి.
-పిండిని బాగా కలిపి మూత పెట్టి 2-3 నిమిషాలు ఆవిరిలో ఉంచండి.
-పిండి కొద్దిగా చల్లారాక చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని, పిండిని మెత్తగా, సున్నితంగా ఉండేలా బాగా కలిపి ముద్దగా చేయండి. పిండిలో పగుళ్లు లేకుండా చూసుకోండి.

-తయారు చేసుకున్న పిండి ముద్దను చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి.
-ఒక్కో ఉండను అరచేతిలో తీసుకుని, వేళ్లతో నెమ్మదిగా ఒత్తుతూ కప్పు ఆకారంలో మలచండి. కప్పు మధ్యలో మందంగా, అంచుల వద్ద పల్చగా ఉండేలా చూసుకోండి.
-కప్పు మధ్యలో ముందుగా తయారు చేసుకున్న కొబ్బరి పూర్ణాన్ని ఒక టీస్పూన్ వేయండి.
-ఇప్పుడు అంచులను నెమ్మదిగా ముడతలు పెడుతూ, మధ్యలో కలిపి మూసేయండి. ఇది ఒక పువ్వు ఆకారాన్ని పోలి ఉంటుంది.
-మోదకం అచ్చు (మోల్డ్) ఉంటే దానికి కొద్దిగా నెయ్యి రాసి, పిండిని లోపల పెట్టి, మధ్యలో పూర్ణం వేసి మూసేయండి. అచ్చు ద్వారా సులభంగా ఒకే ఆకారంలో మోదకాలను తయారు చేయవచ్చు.
-ఈ విధంగా అన్ని మోదకాలను తయారు చేసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు ఇడ్లీ పాత్ర లేదా స్టీమర్ తీసుకోండి. అందులో సరిపడా నీరు పోసి వేడి చేయండి.
-స్టీమర్ ప్లేట్లకు కొద్దిగా నెయ్యి రాసి, దానిపై మోదకాలను ఉంచండి.
-పాత్ర మూత పెట్టి సుమారు 10-15 నిమిషాలు మీడియం మంట మీద ఉడికించండి.
-మోదకాలు మెరిసేలా, మృదువుగా మారితే అవి ఉడికినట్లు అర్థం.
-ఆరిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని, కొద్దిగా నెయ్యి వేసి నైవేద్యంగా సమర్పించండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications