Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
Gongura chicken pickle: గోంగూర చికెన్ నిల్వ పచ్చడి..చూస్తే నోరూరిపోతుంది,తింటే అద్భుతం..ఇలా చేయాలి
గోంగూర చికెన్ నిల్వ పచ్చడి..చూస్తే నోరూరిపోతుంది,తింటే అద్భుతంగా ఉంటుంది. దీనిని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే నా సామి రంగా మాటల్లో చెప్పలేని అనుభూతి అంతే. ముఖ్యంగా చలికాలంలో వేడి అన్నంలో ఇది కలుపుకొని తింటుంటే ఇంక ఏమైనా ఉంటుందా చెప్పండి. అయితే ఈ గోంగూర చికెన్ నిల్వ పచ్చడిని తయారు చేసుకోడానికి ఏమేం పదార్థాలు కావాలి,తయారీ విధానం వంటి వివరాలను ఇక్కడ చూసేయండి
గోంగూర చికెన్ నిల్వ పచ్చడి తయారీకి కావాల్సిన
పదార్థాలు
-అర కేజీ చికెన్
-పావు కేజీ గోంగూర
-చింతపండు
-జీలకర్ర
-మెంతులు
-ఆవాలు
-ధనియాలు
-దాల్చిన చెక్క
-లంగం
-ఆయిల్
-పసుపు
-ఉప్పు
-కారం
-అల్లం వెల్లుల్లి పేస్ట్
గోంగూర చికెన్ నిల్వ పచ్చడి తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 250 గ్రాముల గొంగూర వేసి బాగా శుభ్రంగా కడగండి.
-కడిగిన గోంగూరని వడగిన్నెలో వేసి నీరు అంతా పోయిన తర్వాత పొడి గుడ్డ మీద వేసి బాగా ఆరబెట్టండి.
-ఆరిన గోంగూరని చిన్న ఆకులుగా కట్ చేసుకొని దాన్ని ఓ బౌల్ లో వేసి పక్కనపెట్టుకోండి.
-ఇప్పుడు ఓ చిన్న గిన్నెలో నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసి కొంచెం వేడినీళ్లు అందులో పోసి నానబెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అర టీ గ్లాస్ వేరుశెనగ నూనె పోసి అది వేడెక్కిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న గోంగూర్ మొత్తం వేసి మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి 1-2 నిమిషాలు కలుపుతూ వేయించుకోండి.
-గోంగూర బాగా వేగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం ఇందులో వేసి కలపండి. మంటలను లో ప్లేమ్ లో పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేవరకు కలుపుతూ వేయించుకోండి.
-ఇప్పుడు ఇందులోనే అర గ్లాస్ ఆయిల్ పోసి కలుపుతూ వేయించుకోండి. ఆయిల్ పూర్తిగా సపరేట్ అయిన తర్వాత పాన్ ని దించేసి పక్కనపెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద మరో బాండీ పెట్టి అందులో అర టేబుల్ స్పూన్ ధనియాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ మెంతులు,1 ఇంచు చెక్క, 4 లవంగ మొగ్గలు వేసి దోరగా వేయించుకోండి. తర్వాత వీటిని మిక్సీ గిన్నెలో వేసి మెత్తని పొడిగా చేసుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 1 టీ గ్లాస్ వేరుశెనగ నూనె పోసి అది వేడెక్కిన తర్వాత అందులో శుభ్రంగా కడుక్కున్న అర కేజీ బోన్ లెస్ చికెన్,అర టీ స్పూన్ పసుపు,1 టీస్పూన్ ఉప్పు వేసి చికెన్ లోని నీరు మొత్తం ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంతవరకు మంటలను హై ప్లేమ్ లో పెట్టి ఉడికించుకోండి.
-తర్వాత ఇందులో 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చి వాసన పోయే వరకు వేపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి.
-చికెన్ ముక్కలు చల్లారిన తర్వాత అందులో ముందుగా మిక్సీలో గ్రైండ్ చేసి ఉంచుకున్న మసాలా పొడి, 5 టేబుల్ స్పూన్ల కారం,సరిపడా ఉప్పు వేసి బాగా కలిపిన తర్వాత ఇందులోనే వేయించుకున్న గోంగూర వేసి బాగా కలపండి.గోంగూర చికెన్ నిల్వ పచ్చడి రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












