Latest Updates
-
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్!
Gongura Pachadi : రుచికరమైన నోరూరించే గోంగూర రోటి పచ్చడి.! ఇలా చేసి తింటే ఎప్పటికీ వదులుకోరు..
Gongura Pachadi : ఆంధ్రులకు గోంగూర సుపరిచితం. గోంగూర పచ్చడి అంటే చాలా మందికి ఇష్టం. దాదాపు ఏ సీజన్లో అయినా మనకు అందుబాటులో ఉంటుంది. ఆకుపచ్చ-ఆకులతో, ఎరుపు-కాండాలతో కూడిన గోంగూర మందార జాతికి చెందినది. దీనిని ఆకుకూరల రాణిగా పిలుచుకుంటారు. గోంగూర పచ్చడి రుచికరంగా ఉండటమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. మరి అలాంటి గోంగూర పచ్చడిని ఎలా తయారుచేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
వేసవిలో ఏ కూర వండినా అంతగా తినాలని అనిపించదు. నీళ్లు మాత్రం గుటగుటా తాగేస్తుంటాం. అన్నంలో కూడా వేరే ఏ ఇతర కూరలు నచ్చనప్పటికీ గోంగూర ఉంటే మాత్రం పుల్లగా... పుల్లగా లాగించేస్తాం. మరో రెండు ముద్దలు ఎక్కువే తింటాము. ఆంధ్రుల అభిమాన పచ్చడి గోంగూర అంటే పడి చచ్చే వారు ఎందరో. అలాంటి గోంగూరతో చట్నీనే కాదు వేరే వంటకాలూ వండొచ్చు.

గోంగూర చికెన్, గోంగూర పప్పు, గోంగూర పులుసులు, గోంగూర చేపల పులుసు, గోగూర రొయ్యలు, గోంగూర మటన్ వంటి అనేక రుచికరమైన వంటలు చేస్తారు. ఇక గోంగూర ను నిల్వ పచ్చడి కూడా తయారుచేసుకుంటారు.. ఇక అప్పటికప్పుడు చేసుకునే పచ్చడి ప్రఖ్యాతి గాంచిన సంగతి తెలిసిందే.. మరి ఈరోజు ఆంధ్ర స్పెషల్ నోరూరించే గోంగూర పచ్చడి ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..!
కావాల్సిన పదార్ధాలు :
గోంగూర కట్టలు -2 పెద్ద సైజు
నూనె కొద్దిగా
చింతపండు : కొద్దిగా (నిమ్మపండులో సగం సైజంత)
ఉప్పు: రుచికి సరిపడా
ఎండు మిర్చి: 5-10 కారం బాగా ఉండాలంటే మరికొన్నివేసుకోవచ్చు
వెల్లులి రెబ్బలు 4-8
జీలకర్ర మెంతి పొడి: 1/2tsp
పోపుకు కావాల్సిన పదార్ధాలు :
నూనె: 2tbsp
ఆవాలు: 1tsp
కరివేపాకు రెండు రెమ్మలు
శెనగప్పు: 1tsp
మినపప్పు: 1tsp
ఉల్లిపాయ : 1(చిన్న ముక్కలుగా తరిగినవి)
టమోటో: 1(సన్న ముక్కలుగా తరిగినవి)
ఎండు మిర్చి 3
వెల్లుల్లి 2-3
ఇంగువ-చిటికెడు
తయారీ విధానం :
* గోంగూర కాడల నుంచి ఆకు కోసి శుభ్రంగా కడిగి బట్ట మీద ఆర
బెట్టాలి.
* స్టౌ మీద పాన్ పెట్టి కొంచెం నూనె వేసి గోంగూర ఆకుని వేసి బాగా
మెత్తగా మగ్గ నివ్వాలి. కాడ అదిమి చూస్తే మెత్తబడే వరకు మగ్గనివ్వాలి.
తర్వాత స్టౌ ఆఫ్ చేసి చల్లారబెట్టాలి
* అంతలోపు మరో స్టౌ మీద పాన్ పెట్టి ఎండుమిర్చి, జీలకర్ర వేసి దోరగా
వేగించుకోవాలి.
* ఇప్పుడు రోట్లోలో పది వెల్లుల్లి రెమ్మలు, జీలకర్ర, కొద్దిగా మెంతి
పిండి, రుచికి సరి పడా ఉప్పు, వేయించుకున్న ఎండుమిర్చి ,కొద్దిగా చింత
పండు, బాగా దంచుకోవాలి.
* ఎండు మిర్చి మిగిలిన పదార్థాలు బాగా పొడి అయిన తర్వాత మగ్గిన గోంగూర
కూడ వేసి కొంచెం ఆకులు వుండే లా నూరు కోవాలి.
* ఆ తర్వాత ఈ పచ్చడికి పైన సూచించిన పోపు దినుసులతో తాలింపు పెట్టి,
పచ్చడిలో వేసి కలుపుకోవాలి. అంతే కమ్మటి గోంగూర రోటి పచ్చడి రెడీ.ఈ
పచ్చడిని అన్నంలోను ఇడ్లీలోను వేసుకోవచుకోవచ్చు.
గోంగూర ఆరోగ్యానికి ఏవిధంగా ఉపయోగపడుతుంది?
గోంగూర పచ్చడి తినడం వల్ల మహిళ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం. అలాగే ఎముకలకు కావాల్సిన క్యాల్షియంను అందిస్తుంది. ఎముకలను స్ట్రాంగ్ గా చేస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.హోమోసిస్టీన్ స్థాయిని నియంత్రిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిది, మలబద్ధకాన్ని నివారిస్తుంది, పొట్టను సులభతరం చేస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications