నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా..

Posted By:

గోంగూర..పేరు వింటేనే కొంతమందికి నోట్లో నీళ్లూరుతాయి. ఆంధ్ర మాతగా గోంగూరని పిలుస్తారు. అలాంటి గోంగూరతో సోయా(మీల్ మేకర్) కలిపి వండితే ఇక దానికి తిరుగుండదు. చాలా చాలా రుచిగా ఉంటుంది. గోంగూర సోయా కర్రీ చపాతీ, పరోటా, జొన్న రొట్టె, రైస్ లోకి అద్భుతంగా ఉంటుంది. గోంగూర సోయా కర్రీ మ ఇంట్లోనే ఈజీగా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావాల్సిన పదార్థాలు

గోంగూర పేస్ట్ కోసం

ఫ్రెష్ గోంగూర ఆకులు- 2 కప్పులు
ఆయిల్- 1 టేబుల్ స్పూన్
ఉల్లిపాయ- 1
టమాటో- 1
నీళ్లు-తగినన్ని

Gongura soya curry recipe in telugu perfect for chapati roti and rice

కర్రీ కోసం:

సోయా చంక్స్- 2 కప్పులు
నువ్వుల నూనె- 2 టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయ- 1
పచ్చిమిర్చి- 2
కరివేపాకు- 2 రెమ్మలు
అల్లం వెల్లుల్లి పేస్ట్- 1 టేబుల్ స్పూన్
టమాటో- 1
కారం పొడి- తగినంత
ధనియాల పొడి- 1 టేబుల్ స్పూన్
గరం మసాలా-1-2 టేబుల్ స్పూన్
చికెన్ మసాలా-1-2 టేబుల్ స్పూన్
ఉప్పు-కొద్దిగా
నీళ్లు-కొద్దిగా
కరివేపాకు-కొద్దిగా

తయారీ విధానం

-ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాక అందులో గోంగూర ఆకులు వేయండి. అందులోనే తరిగిన ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు వేసి కొంచెం నీళ్లు పోసి మొత్తం మెత్తగా అయ్యేదాకా మగ్గనివ్వాలి. తర్వాత స్టవ్ ఆపేసి మిశ్రమన్ని చల్లారనివ్వాలి.

-చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి.

గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే..

-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో నువ్వుల నూనె వేసి వేడి చేశాక అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివసన పోయేదాకా వేయించాలి. తర్వాత ఇందులో టమాటో ముక్కలు వేసి అవి మెత్తగా అయ్యేదాకా ఉడికించాలి.

-టమాటో ముక్కలు మెత్తగా అయ్యాక అందులో గ్రైండ్ చేసుకున్న గోంగూర పేస్ట్ వేసి కలుపుకోండి. ఇందులోనే కారం, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా వేసి మొత్తం బాగా కలిసేలా కలిపి ఆయిల్ సపరేట్ అయ్యేవరకు ఉడికించాలి.

-పాన్ నుంచి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు అందులో ఉడికించిన సోయా ముక్కలు, సరిపడా ఉప్పు వేసి మొత్తం సోయా ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోండి. తర్వాత అందులోనే కొంచెం నీళ్లు పోసి మూతపెట్టి మరో 10 నిమిషాలు ఉడకనివ్వాలి.

-గ్రేవీ గట్టిపడి, ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు అందులో కరివేపాకు వేసి కలుపుకుని స్టవ్ ఆపేయండి.

-అంతే గోంగూర సోయా కర్రీ రెడీ.

[ of 5 - Users]
Story first published: Wednesday, October 21, 2026, 15:17 [IST]
Desktop Bottom Promotion