జీర్ణశక్తిని పెంచే సూపర్ ఫుడ్..మిగిలిపోయిన అన్నంతో టేస్టీ కొత్తిమీర రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్!

Posted By:

ఉదయం పూట హడావిడిగా ఉన్నప్పుడు, పిల్లల లంచ్ బాక్స్‌కు లేదా ఆఫీస్‌కు తీసుకెళ్లడానికి అద్భుతంగా సరిపోయే వంటకం కొత్తిమీర రైస్. ఇది చేయడం చాలా సులభం, పైగా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. కొత్తిమీరలో జీర్ణశక్తిని పెంచే గుణాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.

మిగిలిపోయిన అన్నంతో కూడా ఈ రెసిపీని చాలా సులువుగా చేసుకోవచ్చు. అద్భుతమైన రుచి, ఈజీగా రెడీ అయ్యే కొత్తిమీర రైస్ ని చేసుకోడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

Got Leftover Rice Turn it into Delicious Healthy Coriander Rice for the Lunchbox

కొత్తిమీర రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు

-బియ్యం
-ఉప్పు
-కొత్తిమీర
-నూనె
-ధనియాలు
-జీలకర్ర
-జీడిపప్పు
-నువ్వులు
-జీలకర్ర
-ఆవాలు
-పచ్చిమిర్చి
-ఎండుమిర్చి
-ఇంగువ
-ఉల్లిపాయ
-క్యారెట్

ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే!

కొత్తిమీర రైస్ తయారీ విధానం

-ముందుగా 1 కప్పు బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి 10 నిమిషాలు నానబెట్టుకోవాలి.

-నానిన బియ్యంలో నుంచి నీళ్లు వంపేయండి.

-తర్వాత కుక్కర్ తీసుకొని అందులో నానబెట్టుకున్న బియ్యం వేయండి,ఇందులోనే కొద్దిగా ఉప్పు, 2 కప్పుల నీళ్లు పోసి కుక్కర్ మూతపెట్టేయండి.

-ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ ని దానిమీద పెట్టండి. 2 విజిల్స్ రానివ్వాలి.

-ఈలోగా కొత్తిమీర పేస్ట్ తయారుచేసుకోండి. ఇందుకోసం స్టవ్ మీద ఒక బాండీ పెట్టి అందులో 3 చెంచాల నూనె వేసి వేడయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అర టేబుల్ స్పూన్ నువ్వులు, అర టీస్పూన్ జీలకర్ర వేసి వేయించాలి. నువ్వులు చిట్లిన తర్వాత అందులోనే 4 పచ్చిమిరపకాయల పెద్ద ముక్కలు వేసి వేయించాలి. తర్వాత 2 పెద్ద గుప్పిళ్ల కొత్తిమీర తరుగు(కాడలతో సహా)బాండీలో వేసి కాడలు మెత్తబడేదాకా వేపి స్టవ్ ఆపేయండి.

-ఇప్పుడు వేయించిన మొత్తాన్ని మిక్సీ గిన్నెలో వేసి కొంచెం నీళ్లు కలుపుకొని గట్టిగా, మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి.

-తర్వాత తాలింను కోసం స్టవ్ మీద మళ్లీ బాండీ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడయ్యాక అందులో 1 టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయ ముక్కలు వేసి వేపాలి.

-ఎండుమిర్చి రంగు మారుతున్నప్పడు అందులో 3 టేబుల్ స్పూన్ జీడిపప్పు ముక్కలు, 1 టేబుల్ స్పూన్ అల్లం తరుగు, సగం ఉల్లిపాయ చీలికలు, పావు కప్పు క్యారెట్ తరుగు, చిటికెడు ఇంగువ వేసి జీడిపప్పు ఎర్రగా మారేదాకా, ఉల్లి లైట్ గా మెత్తబడే దాకా వేయించాలి.

-తర్వాత బాండీలో గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ వేసి మొత్తం బాగా కలిసేలా 2 నిమిషాల కలుపుతూ ఉండాలి. తర్వాత అందులో వండిపెట్టుకున్న పొడి పొడి అన్నం వేసి కలుపుకోవాలి.

-రైస్ కి కొత్తిమీర పేస్ట్ అంతా బాగా పట్టించిన తర్వాత అందుతో కొంచెం కొత్తిమీర తరుగు, ఒక నిమ్మకాయ రసం పిండి బాగా కలుపుకొని స్టవ్ ఆపేయండి. అంతే కొత్తిమీర రైస్ రెడీ.

[ of 5 - Users]
Story first published: Tuesday, September 8, 2026, 8:45 [IST]
Desktop Bottom Promotion