ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే!

Posted By:

ఉరుకులు పరుగుల జీవితంలో ఉదయాన్నే తినే ఫుడ్ చాలా ముఖ్యం. కానీ రోజూ అదే ఇడ్లీ, అదే దోస, లేదా ఉప్మా తింటే ఎవరికైనా బోర్ కొడుతుంది. అయితే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే అద్భుతమైన బ్రేక్‌ఫా స్ట్ ఆప్షన్ కోసం మీరు చూస్తున్నట్లయితే మల్టీగ్రెయిన్ దోస(బహుధాన్యాల దోస) మీకు పర్ఫెక్ట్.

కేవలం బియ్యం, మినపపప్పుతోనే కాకుండా రకరకాల పప్పులు, చిరుధాన్యాలతో తయారు చేసే ఈ దోసలో ప్రోటీన్లు, ఫైబర్, శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా, ఎంతో కరకరలాడుతూ భలే రుచిగా ఉంటుంది. మల్టీగ్రెయిన్ దోసను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

High Protein Breakfast Recipe How to Make Perfect Multigrain Dosa at Home in Telugu

కావలసిన పదార్థాలు

ఇడ్లీ బియ్యం - 1 కప్పు
మినపపప్పు - అర కప్పు
పెసలు (లేదా పెసరపప్పు) - అర కప్పు
పసుపు పెసరపప్పు - అర కప్పు
కందిపప్పు - అర కప్పు
రాజ్‌ గిర (అమరాంత్) - అర కప్పు
రాగులు - అర కప్పు
అటుకులు- అర కప్పు
మెంతులు - 1 టీస్పూన్
పచ్చిమిర్చి - 2
అల్లం - 1 అంగుళం ముక్క
ఉప్పు - రుచికి సరిపడా
నీరు - తగినంత

చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా?

తయారీ విధానం

-మొదటగా ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో ఇడ్లీ బియ్యం, మినపపప్పు, పెసలు, పసుపు పెసరపప్పు, కందిపప్పు, రాజ్‌ గిర, రాగులు, మెంతులు అన్నీ వేయండి. వీటన్నింటినీ శుభ్రమైన నీటితో కనీసం మూడు నాలుగు సార్లు బాగా కడగాలి.

-నీరు పారదర్శకంగా కనిపించేంత వరకు కడిగిన తర్వాత, అందులో తగినన్ని మంచి నీళ్లు పోసి సుమారు 4 నుండి 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. నానిన తర్వాత ఆ నీటిని వంపేసి, మరోసారి శుభ్రమైన నీటితో కడిగి పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని నానబెట్టుకున్న ధాన్యాలు, పప్పులు, అటుకులను అందులో వేయండి. వీటికి పచ్చిమిర్చి, అల్లం ముక్కలు జత చేయండి. సాధారణ దోస పిండిలాగా చిక్కగా రావడానికి కొద్దిగా మాత్రమే నీళ్లు పోసి మెత్తని పేస్ట్‌ లా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలో ఒకేసారి కాకుండా అవసరాన్ని బట్టి కొద్దికొద్దిగా వేసుకుంటూ రుబ్బుకోవడం మంచిది.

-మెత్తగా రుబ్బుకున్న పిండిని ఒక పెద్ద పాత్రలోకి తీసుకుని, మూతపెట్టి రాత్రంతా అలా ఉంచండి.

-రాత్రంతా పులియబెట్టడం వల్ల ఉదయానికి పిండి బాగా పొంగి, పరిమాణం పెరుగుతుంది. ఇప్పుడు గరిటతో పిండిని మెల్లగా కలపండి. రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేయండి.

-అంతే ఎంతో ఆరోగ్యకరమైన హై ప్రోటీన్ దోస పిండి రెడీ. మీకు కావలసినంత పిండిని వేరే గిన్నెలోకి తీసుకుని, మిగిలిన పిండిని ఫ్రిజ్‌ లో భద్రపరుచుకుంటే రెండు మూడు రోజుల పాటు ఫ్రెష్ గా ఉంటుంది.

-ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి వేడయ్యాక, కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి పిండిని పల్చగా దోసలా పోసుకోవాలి. రెండు వైపులా దోరగా, కరకరలాడేలా కాల్చుకుంటే వేడివేడి మల్టీగ్రెయిన్ దోస రెడీ.

[ of 5 - Users]
Story first published: Monday, September 7, 2026, 20:24 [IST]
Desktop Bottom Promotion