Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
పాతకాలపు పద్ధతిలో పచ్చి బొప్పాయి ఊరగాయ..వేడి వేడి అన్నంలోకి సూపర్ కాంబినేషన్
పండిన బొప్పాయి పండు రుచి,ఆరోగ్య ప్రయోజనాల గురించి మనందరికీ తెలిసిందే. అయితే,పచ్చి బొప్పాయిలో కూడా విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయని మీకు తెలుసా? పూర్వకాలంలో మన పెద్దలు పచ్చి బొప్పాయిని నల్ల ఉప్పుతో తినేవారు,మరికొందరు వెనిగర్ లో నానబెట్టి సుగంధ ద్రవ్యాలతో తీసుకునేవారు.
ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. బొప్పాయిలో విటమిన్ సి, ఏ, బి9, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. రుచిలో మామిడికాయ ఊరగాయకు ఏమాత్రం తీసిపోని, ఆరోగ్యకరమైన పచ్చి బొప్పాయి ఊరగాయను ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
పచ్చి బొప్పాయి - 1 కిలో
ధనియాలు - 2 టీస్పూన్లు
జీలకర్ర- 1 టీస్పూన్
సోంపు-1 టీస్పూన్
వాము - 1 టీస్పూన్
మెంతులు - అర టీస్పూన్
ఆవాలు - 3 టీస్పూన్లు
ఎండుమిర్చి - 6
ఆవ నూనె - ఒకటిన్నర కప్పు
కలోంజి (నల్ల జీలకర్ర) - 1 టీస్పూన్
పసుపు - 1 టీస్పూన్
కాశ్మీరీ ఎర్ర కారం- 1 టీస్పూన్
ఆమ్చూర్ (మామిడి పొడి)- 1 టీస్పూన్
పచ్చిమిర్చి - 50 గ్రాములు
నలుపు, తెలుపు ఉప్పు - రుచికి తగినంత
వైట్ వెనిగర్ - కొద్దిగా
ఇంగువ - చిటికెడు
తయారీ విధానం
-ముందుగా బొప్పాయిని బాగా కడిగి తేమ లేకుండా పొడి గుడ్డతో తుడవాలి.
-బొప్పాయిని సగానికి కోసి, లోపల ఉన్న గింజలను, సన్నని పొరను తీసివేయాలి. తొక్క తీయకుండానే మామిడికాయ ముక్కల్లా మీకు కావలసిన సైజులో ముక్కలుగా కోసుకోవాలి.
-ఒక పెద్ద పాత్రలో నీరు మరిగించి దానిపై చిల్లుల గిన్నె ఉంచండి. అందులో బొప్పాయి ముక్కలు వేసి కొన్ని నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించాలి. ముక్కలు మరీ మెత్తగా కాకుండా, కొంచెం ఉడికేలా చూసుకోవాలి.
-ఉడికించిన ముక్కలను ఒక కాటన్ గుడ్డపై వేసి ఎండలో 2-3 గంటల పాటు ఆరబెట్టాలి. దీనివల్ల ముక్కల్లోని అదనపు తేమ తొలగిపోయి, ఊరగాయ ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.
-స్టవ్ మద బాండీ పెట్టి అందులో ధనియాలు, జీలకర్ర, సోంపు, వాము, మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి వేసి దోరగా వేయించుకోవాలి. చల్లారాక, వీటిని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి.
-తర్వాత బాండీలో ఆవ నూనెను వేడి చేసి అందులో కలోంజి, వాము, ఇంగువ, పసుపు వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. పచ్చిమిర్చిని గాట్లు పెట్టి సిద్ధం చేసుకోవాలి.
-ఒక పెద్ద గిన్నెలో ఆరబెట్టిన బొప్పాయి ముక్కలు, పచ్చిమిర్చి వేసి, సిద్ధం చేసుకున్న మసాలా పొడిని కలపాలి. అనంతరం వేడి చేసి చల్లార్చిన నూనె మిశ్రమాన్ని పోయాలి.
-చివరగా కారం ఆమ్చూర్ పౌడర్, తగినంత ఉప్పు వేసి ముక్కలకు బాగా పట్టేలా కలపాలి. మీకు ఇష్టమైతే, నిల్వ సామర్థ్యాన్ని పెంచడానికి కొద్దిగా వెనిగర్ కలపవచ్చు.
-తయారైన ఊరగాయను తడి లేని, గాలి చొరబడని గాజు సీసాలో భద్రపరచాలి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications