Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
Chilli chicken: గ్రీన్ చిల్లి చికెన్ తినాలంటే అదృష్టం ఉండాలి..ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూడండి
నాన్ వెజ్ లో ప్రతి ఒక్కరూ ఇష్టపడే చికెన్ తో అనేక రకాల వెరైటీలు చేయవచ్చు. ఇందులో ఒకటి గ్రీన్ చిల్లి చికెన్. భారతీయ,చైనీస్ వంటకాలలో బాగా ప్రాచుర్యం పొందిన రుచికరమైన రెసిపి ఇది. చికెన్ ను వివిధ రకాల సాస్ లు, ముఖ్యంగా పచ్చిమిర్చి వేసి దీనిని తయారుచేస్తారు. ఇది ఘాటుగా, కొద్దిగా తీపిగా, పుల్లగా ఉండే ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది. గ్రీన్ చిల్లి చికెన్ స్టార్టర్ గా లేదా నూడిల్స్ లేదా ఫ్రైడ్ రైస్‌తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. గ్రీచ్ చిల్లి చికెన్ ను ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూడండి.
గ్రీన్ చిల్లి చికెన్ తయారీకి కావలసిన పదార్థాలు
-బోన్ లెస్ చికెన్ - 500 గ్రాములు
-పచ్చిమిర్చి - 10-15
-ఉల్లిపాయలు - 2 మీడియం సైజు
-కాప్సికమ్- 1 మీడియం సైజు
-సోయా సాస్ - 2 టేబుల్ స్పూన్లు
-రెడ్ చిల్లి సాస్ - 1 టేబుల్ స్పూన్
-టొమాటో కెచప్ - 1 టేబుల్ స్పూన్
-ఉప్పు - రుచికి తగినంత
-మిరియాల పొడి - 1/2 టీ స్పూన్
-కొత్తిమీర - కొద్దిగా
-నువ్వులు -కొంచెం
-అల్లం - 1 ఇంచు ముక్క
-వెల్లుల్లి - 5-6 రెబ్బలు
-వెనిగర్ - 1 టేబుల్ స్పూన్
-చికెన్ స్టాక్ లేదా నీరు - 1/4 కప్పు
-కార్న్‌ఫ్లోర్ - 2 టేబుల్ స్పూన్లు
-నూనె - వేయించడానికి సరిపడినంత

గ్రీన్ చిల్లి చికెన్ తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో చికెన్ ముక్కలు, కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిపి 15-20 నిమిషాలు పక్కన పెట్టండి.
-తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేడి చేసి మాగ్నెట్ చేసిన చికెన్ ముక్కలను బంగారు రంగు వచ్చే వరకు బాగా వేయించి పక్కకు తీసి పెట్టుకోండి
-ఇప్పుడు మరొక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేడి చేసి సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి వేసి సుమారు ఒక నిమిషం వేయించండి.
-ఇప్పుడు చీలికలు చేసుకున్న పచ్చిమిర్చి వేసి ఒక నిమిషం పాటు వేయించండి. పచ్చిమిర్చి ఘాటును బట్టి మీరు ఎక్కువ లేదా తక్కువ వేసుకోవచ్చు.
-తర్వాత పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి అవి కొద్దిగా మెత్తబడే వరకు వేయించండి.
-ఇప్పుడు చతురస్రాకారంలో కట్ చేసుకున్న కాప్సికమ్ ముక్కలు వేసి ఒక నిమిషం పాటు వేయించండి. వాటిని మరీ ఎక్కువగా ఉడికించకూడదు..కొద్దిగా క్రంచీగా ఉండాలి.
-సోయా సాస్, రెడ్ చిల్లి సాస్, టొమాటో కెచప్, వెనిగర్ వేసి బాగా కలపండి.
-ఇప్పుడు చికెన్ స్టాక్ లేదా నీరు పోసి ఒకసారి బాగా కలపండి. రుచికి తగినంత ఉప్పు వేసుకోండి.
-సాస్ మరగడం ప్రారంభించిన తర్వాత కార్న్‌ఫ్లోర్ పేస్ట్ ను కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతూ ఉండండి. సాస్ చిక్కబడే వరకు ఉడికించండి.
-వేయించిన చికెన్ ముక్కలను సాస్ లో వేసి బాగా కలపండి. చికెన్ కు సాస్ బాగా పట్టేలా కొన్ని నిమిషాలు ఉడికించండి.
-చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర, నువ్వులు వేసి గార్నిష్ చేయండి. అంతే గ్రీన్ చిల్లి చికెన్ రెడీ.
-వేడి వేడిగా నూడిల్స్, ఫ్రైడ్ రైస్ లేదా రోటీతో తింటే నోట్లో బ్లాస్టే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications