Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
ఇడ్తీ,దోశ,బోండా,పూరీ వదిలేయండి..హెల్దీ గుజరాత్ స్టైల్ 'దూది నా ముటియా' ట్రై చేయండి,ఎలా చేయాలంటే
రోజూ పొద్దున్నే ఇడ్లీ,దోధ,బోండా,పూరీ తిని తిని బోర్ కొట్టేసిందా? ఈ బోరింగ్ టిఫిన్స్ కి బదులుగా కొత్తగా ఏదైనా తింటే బాగుండు అని ఆలోచిస్తున్నారా? అయితే ఓ సరి దూది నా ముటియా తిని చూడండి. దూది నా ముటియా అనేది గుజరాత్లో చాలా ప్రసిద్ధి చెందిన ఒక రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆవిరితో ఉడికించిన చిరుతిండి. దీనిని సొరకాయ, గోధుమ పిండి, వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో తయారుచేస్తారు. తేలికగా జీర్ణమవుతుంది, అనేక పోషక విలువలను కలిగి ఉంటుంది.
ఉదయం అల్పాహారంగా లేదా సాయంత్రం స్నాక్‌గా తీసుకోవడానికి దూది నా ముటియా చాలా బాగుంటుంది. దూది నా ముటియాని ఇంట్లోనే సులభంగా ఎలా తయారుచేసుకోవాలి,దీని తయారీకి కావలసిన పదార్థాలు ఏంటో ఇక్కడ చూడండి.

దూది నా ముటియా తయారీకి కావలసిన పదార్థాలు
సొరకాయ- తురిమినది 2 కప్పులు
నువ్వులు - 1 టేబుల్ స్పూన్
ఆవాలు - 1/2 టీస్పూన్
జీలకర్ర - 1/2 టీస్పూన్
గోధుమ పిండి - 1 కప్పు
శెనగ పిండి - 1/4 కప్పు
పెసర పిండి - 1/4 కప్పు
పసుపు పొడి - 1/4 టీస్పూన్
ధనియాల పొడి - 1/2 టీస్పూన్
జీలకర్ర పొడి - 1/4 టీస్పూన్
ఉప్పు - తగినంత
పంచదార - 1/2 టీస్పూన్
అల్లం-వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
పచ్చిమిర్చి పేస్ట్ - 1/2 టీస్పూన్
కొత్తిమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు
పుదీనా తరుగు - 1 టేబుల్ స్పూన్
బేకింగ్ సోడా - 1/4 టీస్పూన్
నిమ్మరసం - 1 టీస్పూన్
నూనె - తగినంత
క్యాబేజీ నిల్వ పచ్చడి..ఓసారి తిన్నాక వదిలిపెడితే ఒట్టు..ఎలా చేసుకోవాలంటే
దూది నా ముటియా తయారీ విధానం
-సొరకాయని బాగా కడిగి తొక్క తీసివేయండి. దాని లోపలి గింజలు, మెత్తటి భాగాన్ని తొలగించండి. తర్వాత దానిని తురుముకోండి. తురిమిన దాని నుండి ఎక్కువ నీటిని పిండి వేయండి.
-ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో గోధుమ పిండి, శెనగ పిండి, పెసర పిండి, అల్లం-వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు, నువ్వులు, పసుపు పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, వంట సోడా, నిమ్మరసం, నూనె, ఉప్పు, పంచదార వేయండి.
-ఇప్పుడు పిండిలో తురిమి పిండిన సొరకాయ వేసి బాగా కలపండి. అవసరమైతే కొద్దిగా నీరు చల్లుకుంటూ మెత్తని పిండి ముద్దలా తయారు చేసుకోండి. పిండి మరీ గట్టిగా లేదా మరీ మెత్తగా ఉండకూడదు.
-పిండి నుండి చిన్న చిన్న భాగాలు తీసుకుని మీకు నచ్చిన ఆకారంలో ముటియాలను తయారు చేసుకోండి.
-ఒక ఆవిరి కుక్కర్ ను లేదా ఒక పెద్ద గిన్నెలో నీరు పోసి దానిపై చిల్లుల ప్లేటు ఉంచండి. ప్లేటుకు కొద్దిగా నూనె రాయండి.
-తయారుచేసిన ముటియాలను ప్లేటుపై ఒకదానికొకటి అంటుకోకుండా అమర్చండి. మూత పెట్టి మీడియం మంటపై 15-20 నిమిషాలు లేదా ముటియాలు బాగా ఉడికే వరకు ఆవిరి పట్టండి. ముటియాలు ఉడికిన తర్వాత రంగు మారుతాయి, గట్టిగా అవుతాయి.
-ముటియాలు చల్లారిన తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక బాణలిలో కొద్దిగా నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేయండి. అవి చిటపటలాడిన తర్వాత నువ్వులు, కొద్దిగా కరివేపాకు వేసి వేయించండి.
-తర్వాత కట్ చేసిన ముటియా ముక్కలను వేసి 2-3 నిమిషాలు వేయించండి. అంతే దూది నా ముటియా రెడీ.
-దూది నా ముటియాను టొమాటో కెచప్, గ్రీన్ చట్నీ లేదా మీ ఇష్టమైన ఏదైనా చట్నీతో వేడిగా లేదా చల్లగా సర్వ్ చేయవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications