Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
టేస్ట్ లో తిరుగులేని గుంటూరు గోంగూర పులావ్.. దీని ముందు అమృతం కూడా వేస్ట్ అనాల్సిందే..ఎలా చేసుకోవాలంటే..
తెలుగు వాళ్ల వంటకాల గురించి మాట్లాడితే ఫస్ట్ గుర్తుకువచ్చేది గోంగూర. దీనిని ఆంధ్రమాత అని కూడా పిలుస్తారు. గోంగూర లేని భోజనం తెలుగు భోజనమే కాదు అని కొందరు అంటుంటారు. గోంగూర పుల్లపుల్లని,ప్రత్యేకమైన రుచికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. గోంగూరను కేవలం పచ్చడి మాత్రమే కాకుండా పప్పు, మాంసం కూరల్లో కూడా వాడటం తెలిసిందే. అలాంటి గోంగూరతో చేసే ఒక అద్భుతమైన వంటకం పులావ్. ముఖ్యంగా కారం, ఘాటుకు ఫేమస్ అయిన గుంటూరు స్టైల్ లో ఈ గోంగూర పులావ్ చేస్తే ఇక దాని రుచి వర్ణనాతీతం.
పార్టీలకు, పండుగలకు లేదా వీకెండ్స్ తో ఫ్యామిలీతో కలిసి ఆస్వాదించడానికి ఇది పర్ఫెక్ట్ గా ఉంటుంది. కేవలం రుచి మాత్రమే కాదండోయ్..ఆరోగ్యానికి కూడ ఇది బోలెడంత మేలు చేస్తుంది. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపించే గుంటూరు స్టైల్ గోంగూర పులావ్ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు
-ఎర్ర గోంగూర
-బిర్యానీ ఆకులు
-ఉప్పు
-జీడిపప్పు
-పసుపు
-అల్లంవెల్లుల్లి పేస్ట్
-స్టార్ అనాస
-యాలకలు
-పచ్చిమిర్చి
-కరివేపాకు
-కొత్తిమీర
-నూనె
-దాల్చిన చెక్క
-ఉల్లిపాయలు
-షాజీరా
-టమోటా
-మరాఠీ మొగ్గ
-లవంగాలు
-సోనామసూరి బియ్యం
-రాతి పువ్వు

గుంటూరు స్టైల్ గోంగూర పులావ్ తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద అడుగు మందంగా ఉండే పాన్ పెట్టి అందులో అరకప్పు నూనె వేసి వేడి చెయ్యాలి.
-ఇప్పుడు 2 పెద్ద ఉల్లిపాయలను సన్నగా,పొడవుగా కట్ చేసి వేడెక్కిన ఆయిల్ లో వేసుకోండి. ఇందులో కాస్త ఉప్పు వేసుకొని కలిపి ఉల్లిపాయలను గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి మారి క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకొని నూనెలో నుంచి తీసి పక్కన ఉంచుకోండి.
-తర్వాత అదే పాన్ లో ఉన్న నూనెలోనే 1 ఇంచు దాల్చిన చెక్క, 1 మరాఠీ మొగ్గ, 2 బిర్యానీ ఆకులు, 5 లవంగాలు, 2 రాతిపువ్వులు 2 స్టార్ అనాస, 5 యాలకలు వేసి 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి.
-ఇప్పుడు అదే పాన్ లోనే 15 జీడిపప్పు పలుకులు వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించి 1 టీస్పూన్ షాజీరా కూడా వేసి నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక 4 పచ్చిమిర్చి చీలికలు, 2 రెబ్బల కరివేపాకు వేసి పచ్చిమిర్చి మగ్గేవరకు ఫ్రై చేసుకోవాలి.
-తర్వాత అందులోనే అర టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయి నూనె పైకి తేలేంతవరకు ఫ్రై చేసుకోవాలి.
-తర్వాత అందులో 3 టమాటోల పెద్ద ముక్కలు వేసి వాటిని 50 శాతం వరకు ఫ్రై చేశాక 75గ్రాముల ఎర్ర గోంగూర ఆకుని అందులో వేసి కలిపి మూతపెట్టి ఆకు మెత్తగా మగ్గేదాకా ఉడికించుకోవాలి.
-గోంగూర ఆకు మెత్తగా మగ్గాక అందులో ఒకటిన్నర కప్పుపైనే నీళ్లు పోసి,ఉప్పు వేసి కలిపి మతపెట్టి పెద్ద మంట మీద తెర్లకాగనివ్వాలి.
-నీరు తెర్లకాగుతున్నప్పుడు మూతతీసి అందులో గంటసేపు నానబెట్టిన సోనామసూరి బియ్యం వేసి బాగా కలుపుకోండి. ఒక కట్ట కొత్తిమీర తరుగు కాడలతో సహా, వేయించిన ఉల్లిపాయలు,పుదీనా తరుగు కొంచెం వేసి మూతపెట్టి పెద్ద మంట మీద 6 నిమిషాలు,తక్కువ మంట మీద 7-8 నిమిషాలు ఉడికించాలి. కుక్కర్ లో అయితే పెద్ద మంట మీద 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపేయాలి.
-తర్వాత మూత తీసి చూస్తే పొడిపొడిలాడుతూ ఉండే గోంగూర పులావ్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
