Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Chia Seeds: బరువు తగ్గాలంటే ఉదయాన్నే చియా సీడ్స్ బ్రేక్‌ఫాస్ట్ తినాలి.. ఎలా చేసుకోవాలంటే?
బరువు అనేది ఈ మధ్య కాలంలో అత్యంత ప్రమాదకరమైన, అత్యంత చింతించాల్సిన సమస్యగా మారిపోయింది. చాలా మంది బరువు తగ్గేందుకు నానా రకాలుగా కష్టపడుతున్నారు. కొందరు డైట్స్ చేస్తుంటే మరికొందరు జిమ్‌లకు వెళ్లి కండలు కరిగిస్తున్నారు. అయినప్పటికీ వారు అనుకున్న విధాలుగా ఫలితాలు రాకపోవడంతో నిరాశ చెందుతున్నారు. అలాంటి వ్యక్తులు చియా సీడ్స్‌తో చేసే ఈ రెసిపీని తింటే కచ్చితంగా మంచి ఫలితాలను పొందుతారు. అలాగే ఎంత తిన్నా కూడా బరువు పెరగరు. ఇందులో పోషకాలు శరీర ఆకృతిని నిర్మించడంలో కూడా సహాయపడతాయి. ఇంతకీ ఈ చియా సీడ్స్‌తో బ్రేక్‌ఫాస్ట్ ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

చియా సీడ్స్‌తో బ్రేక్‌ఫాస్ట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు
- పావు కప్పు చియా విత్తనాలు
- ఒక కప్పు బాదం పాలు
- అర టీస్పూన్ వెనిలా
- ఒక టేబుల్ స్పూన్ తేనె
- స్ట్రాబెరిలు లేదా ఏదైనా పండుకు సంబంధించిన పొడవాటి ముక్కలు
చియా సీడ్స్‌తో బ్రేక్‌ఫాస్ట్ చేసుకునే విధానం
ఈ చియా విత్తనాలతో బ్రేక్‌ఫాస్ట్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి. అందులో చియా విత్తనాలు, బాదం పాలు, వెనీలా క్రీమ్, తేనె వేసి బాగా కలుపుకోవాలి. ఆ ద్రావణంలో చియా విత్తనాలు బాగా కలిసిపోయే విధంగా కలుపుతూనే ఉండాలి. అలా మొత్తం కలిసిపోయాక ఆ మిశ్రమాన్ని అయిదు నుంచి పది నిమిషాల పాటు కదిలించకుండా అలానే వదిలేయాలి.
పది నిమిషాలు పూర్తయిన తరువాత.. ఆ మిశ్రమాన్ని మరోసారి కలుపుకొని దానిని రెండు నుంచి మూడు గంటల సేపు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఆ తరువాత దానిని తీసుకొని అందులో కొన్ని బాదం పాలు వేసుకొని, పలుచగా చేసుకోవాలి. పై నుంచి స్ట్రాబెరీ ముక్కలు లేదా ఏదైనా పండుకు సంబంధించిన పొడవాటి ముక్కలను వేసుకోవాలి.
అంతే ఎంతో రుచికరమైన బరువు తగ్గేందుకు వీలుగా ఉండే చియా సీడ్స్ బ్రేక్‌ఫాస్ట్ సిద్ధమైనట్లే. దీనిని తినడం వల్ల కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. దీని కారణంగా త్వరగా ఆకలి వెయ్యదు. ఫలితంగా సులభంగానే ఏమీ చేయకుండా బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. బరువు తగ్గాలని మీరూ ట్రై చేస్తున్నట్లైతే ఓసారి ఈ చియా బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications