Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బలమైన రాగి తీపి రొట్టెలు..రక్తహీనతకు,బరువు తగ్గాలనుకున్నోళ్లకు బెస్ట్..ఎలా చేసుకోవాలంటే
రుచికరమైన,ఆరోగ్యకరమైన,సంప్రదాయకమైన వంటకం రాగి తీపి రొట్టెలు. చాలా చాలా టేస్టీతో పాటు కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉండి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. బరువు తగ్గాలనుకున్నోళ్లకి, రక్తహీనతో బాధపడేవాళ్లకి, జుట్టు ఎక్కువగా రాలిపోతున్నోళ్లకి రాగి తీపి రొట్టెలు తినడం చాలామంచిదని పెద్దలు చెబుతుంటారు. వీటిని తయారుచేసుకోవడం కూడా చాలా సులువు. మీ ఇంట్లోనే చాలా సింపుల్ గా రాగి తీపి రొట్టెలు తయారుచేసుకోడానికి కావాల్సి పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
రాగి తీపి రొట్టెలు తయారీకి కావాల్సిన పదార్థాలు
-రాగి పిండి
-నీళ్లు
-కొబ్బరి తురుము
-యాలకలు
-ఉప్పు
-బెల్లం తరుము
-ఆయిల్

రాగి తీపి రొట్టెలు తయారీ విధానం
-ముందుగాఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో 2 మీడియం సైజు కప్పుల రాగి పిండి, అరకప్పు కొబ్బరి తురుము, కచ్చాపచ్చాగా దంచిన యాలకలు, పావు టీస్పూన్ ఉప్పువేసి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 1 టీగ్లాసు నీళ్లు పోసి వేడి చేశాక అందులో అరకప్పు బెల్లం తరుము వేయాలి. మీడియం మంట మీద కలుపుతూ కరిగించుకోవాలి.
-ఇప్పుడు ఈ బెల్లం నీళ్లను వడకట్టి ముందుగా కలిపి పెట్టుకున్న రాగిపిండి మిశ్రమంలో పోసి కలపాలి. ఇందులో కొన్ని నీళ్లు కూడా పోసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి.
Ragi Chapati: పోషకమైన రాగి చపాతీలు..చాలా మెత్తగా సూపర్ టేస్టీగా ఉంటాయి..ఎలా చేసుకోవాలంటే
-తర్వాత ఓ ప్లేటు మీద తడి గుడ్డ వేసి దానిమీద పిండిని ముద్దలుగా తీసుకుంటూ చేతిని నీటితో తడుపుకుంటూ రొట్టెలుగా వత్తుకోవాలి. రొట్టె మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా వత్తుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద దోశె పెనం పెట్టి దానికి కొంచెం ఆయిల్ రాశాక రొట్టెను దీని మీద వేసి రెండు వైపులా తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి. తర్వాత దాన్ని ఓ ప్లేట్ లోకి తీసుకోండి. అంతే రాగి తీపి రొట్టెలు రెడీ. దీన్ని తింటుంటే ఆ టేస్ట్ మాటల్లో వర్ణించలేనిది.
-వీటిని ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ లోకి అయినా తీసుకోవచ్చు లేదా సాయంత్నం స్నాక్ లా అయినా ఆస్వాదించవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications