Latest Updates
-
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్!
పండిన అరటిపండ్లు ఉన్నాయా? పిల్లల కోసం ఇలా యమ్మీ కేక్ చేసేయండి
పిల్లలకు కేక్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పుట్టినరోజు వేడుకలైనా, క్రిస్మస్ పండుగైనా, లేదా సాధారణ రోజుల్లోనైనా వారి కళ్లు ఎప్పుడూ కేక్ పైనే ఉంటాయి. ఇక అది చాక్లెట్ కేక్ అయితే, వారి ఆనందానికి అవధులు ఉండవు. తరచుగా పిల్లలు బయట దొరికే కేక్ ల కోసం మారాం చేస్తుంటారు.
కానీ మార్కెట్ లో దొరికే కేక్ లలో మైదా, అధిక చక్కెర, ప్రిజర్వేటివ్స్ ఉండటం వల్ల అవి పిల్లల ఆరోగ్యానికి అంత మంచివి కావు. అందుకే దీనికి చక్కటి పరిష్కారమే హోమ్ మేడ్ బనానా కేక్. ఇది చాలా సులభంగా తయారుచేయవచ్చు, పైగా చాలా ఆరోగ్యకరం కూడా. ఇంట్లోనే హెల్దీ బనానా కేక్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
వెన్న- 4-5 టేబుల్ స్పూన్లు
బ్రౌన్ షుగర్ - 1 కప్పు
గుడ్లు - 2
కాఫీ పౌడర్ - చిటికెడు
పండిన అరటిపండ్లు - 4
గోధుమ పిండి - 1 కప్పు కంటే కొంచెం తక్కువ
చాక్లెట్ చిప్స్ - తగినన్ని
తయారీ విధానం
-ముందుగా ఒక చిన్న పాన్ లో 4-5 టేబుల్ స్పూన్ల వెన్నను కరిగించండి.
-కరిగిన వెన్నను ఒక పెద్ద బౌల్ లోకి తీసుకుని, దానికి సుమారు 1 కప్పు బ్రౌన్ షుగర్ కలపండి. ఈ రెండింటినీ కొన్ని నిమిషాల పాటు బాగా గిలకొట్టాలి. ఆ తర్వాత రెండు గుడ్లను పగులగొట్టి అందులో వేయాలి. మిశ్రమం మృదువుగా, క్రీమీగా మారే వరకు బీట్ చేస్తూనే ఉండాలి. చివరగా చిటికెడు కాఫీ పొడి వేసి కలపండి.
-బాగా పండి, పైన నల్లని మచ్చలు ఉన్న 4 అరటిపండ్లను ఒక ఫోర్క్ లేదా చెంచాతో మెత్తని పేస్ట్ లా అయ్యేలా మాష్ చేయండి.
-అరటి పండ్ల గుజ్జును ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెన్న-గుడ్ల మిశ్రమంలో వేసి కలపండి. ఆ తర్వాత, 1 కప్పు పిండిని కొద్దికొద్దిగా వేస్తూ కలపాలి. పిండి మరీ గట్టిగా కాకుండా, కేక్ బ్యాటర్ లా జారుగా ఉండేలా చూసుకోండి. చివరగా చాక్లెట్ చిప్స్ ను వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా కలపండి
-ఇప్పుడు కేక్ టిన్ తీసుకుని దానికి అడుగున బటర్ పేపర్ వేయండి లేదా వెన్నను టిన్ లోపల అంతా రాయండి.
-సిద్ధం చేసిన కేక్ మిశ్రమాన్ని టిన్ లో పోసి, సమానంగా సర్దండి. పైన మరిన్ని చాక్లెట్ చిప్స్ చల్లితే, బేక్ అయ్యాక చూడటానికి, తినడానికి అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మీ ఓవెన్ లేదా మైక్రోవేవ్లో ఉంచి కేక్ పూర్తిగా ఉడికే వరకు బేక్ చేయండి (సుమారు 180 డిగ్రీల వద్ద 30-40 నిమిషాలు పట్టవచ్చు).
-కేక్ ఉడికిన తర్వాత బయటకు తీసి కాసేపు చల్లారనివ్వండి. ఆ తర్వాత మీ పిల్లలకు ఇష్టమైన ఆకారాల్లో ముక్కలుగా కట్ చేయండి.
-అంతే ఎంతో రుచికరమైన, మృదువైన మరియు ఆరోగ్యకరమైన బనానా చాక్లెట్ కేక్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications