Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
మోదీలా ఫిట్ గా,బలంగా ఉండాలటే..గుజరాత్ స్పెషల్ ఖండ్వీ తినాల్పిందే..ఎలా చేసుకోవాలంటే
గుజరాత్ కి చెందిన సాంప్రదాయ, రుచికరమైన, ఆరోగ్యకరమైన స్నాక్ 'ఖండ్వీ'. ఖండ్వీని గుజరాతీ వంటకాల్లో ఒక ఆణిముత్యంగా చెబుతుంటారు. బరువు తగ్గాలనుకున్నోళ్లకి, డయాబెటిస్ ఉన్నవారికి లేదా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించాలనుకునే వారికి సురక్షితమైన, ఆరోగ్యకరమైన స్నాక్ ఇది. సాధారణంగా దీనిని బ్రేక్ ఫాస్ట్ లోకి లేదా సాయంత్రం స్నాక్ గా తీసుకుంటారు. నోటిలో పెట్టుకుంటే కరిగిపోయే టేస్ట్ ఉంటుంది. తేలికగా జీర్ణమయ్యే గుణం, తక్కువ నూనెతో తయారవడం దీని ప్రత్యేకతలు.
ఖండ్వీ అనేది కేవలం ఒక వంటకం కాదు అది గుజరాత్ సంస్కృతిలో ఒక భాగం. దీనిని తయారుచేయడం ఒక కళ. దాని రుచి, ఆరోగ్యం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఒకసారి ప్రయత్నిస్తే ఇది మీ ఇష్టమైన స్నాక్స్ లో ఒకటిగా మారుతుంది. గుజరాత్ స్పెషల్ ఖండ్వీని మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

ఖండ్వీ తయారీకి కావాల్సిన పదార్థాలు
-శనగపిండి: 1 కప్పు (100-120 గ్రాములు)
-పుల్లటి మజ్జిగ: 2 కప్పులు
-పసుపు పొడి: 1/4 టీస్పూన్
-అల్లంపచ్చిమిర్చి పేస్ట్: 1 టీస్పూన్
-ఉప్పు: రుచికి సరిపడా
-నీరు: 1/4 కప్పు
-నూనె: గ్రీసింగ్ కోసం
-నెయ్యి: 2 టేబుల్ స్పూన్లు
-ఆవాలు: 1 టీస్పూన్
-జీలకర్ర: 1/2 టీస్పూన్
-నువ్వులు: 1-2 టీస్పూన్లు
-ఇంగువ: చిటికెడు
-పచ్చిమిర్చి: 2-3
-కరివేపాకు: 8-10 రెబ్బలు
-కొత్తిమీర: 2 టేబుల్ స్పూన్లు
-తురిమిన పచ్చి కొబ్బరి: 2 టేబుల్ స్పూన్లు

తయారీ విధానం
ఒక పెద్ద గిన్నెలో శనగపిండిని తీసుకోండి. దీంట్లోనే పసుపు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు వేయండి.
ఇప్పుడు శనగపిండి మిశ్రమంలో పుల్లని మజ్జిగను నెమ్మదిగా పోస్తూ ఉండలు లేకుండా బాగా కలపండి. అవసరమైతే 1/4 కప్పు నీరు చేర్చుకోవచ్చు. ఈ మిశ్రమం ఎంత పలుచగా ఉంటే ఖండ్వీ రోల్స్ అంత మృదువుగా వస్తాయి.
ఇప్పుడు ఒక మందపాటి అడుగున్న కడాయిని స్టవ్ మీద పెట్టి వేడి చేశాక ఇందులో తయారుచేసి పెట్టుకున్న శనగపిండి మజ్జిగ మిశ్రమాన్ని పోయండి. మంటను తక్కువలో ఉంచి గరిటెతో నిరంతరం ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. సుమారు 8-12 నిమిషాలు ఉడికించాక మిశ్రమం చిక్కబడటం ప్రారంభమవుతుంది.
మిశ్రమం చిక్కబడగానే అది పాన్ అంచులను వదిలి మెత్తగా, మెరిసేలా మారినప్పుడు అది సిద్ధమైందని అర్థం. ఇది చాలా చిక్కగా, గట్టి ముద్దలా మారకూడదు. కొద్దిగా జిగురుగా ఉండాలి.
కొన్ని ప్లాట్ ఫాం ప్లేట్లు లేదా చదునైన ట్రేలను సిద్ధం చేసుకోండి. వాటిని కొద్దిగా నూనెతో గ్రీస్ చేయండి.
ఉడికించిన మిశ్రమం వేడిగా ఉన్నప్పుడే ఒక పెద్ద గరిటెడు మిశ్రమాన్ని గ్రీస్ చేసిన ప్లేట్ లేదా ట్రే మధ్యలో పోయండి. మిశ్రమాన్ని పలుచగా, సమానంగా ప్లేట్ మొత్తం విస్తరించండి. సుమారు 5-7 నిమిషాలు చల్లబడనివ్వండి. మిశ్రమం ఆరిపోయి సెట్ అవుతుంది.
సెట్ అయిన ఖండ్వీ షీట్లపై నిలువుగా లేదా అడ్డంగా 1-1.5 అంగుళాల వెడల్పు గల పట్టీలుగా కట్ చేయండి.
ఒక పట్టీని ఒక చివర నుండి జాగ్రత్తగా, నెమ్మదిగా చుట్టడం ప్రారంభించండి. అవి సున్నితంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. చక్కని రోల్స్‌గా వస్తాయి.
అన్నింటినీ ఇదే విధంగా రోల్ చేసి ఒక ప్లేట్‌లో పక్కన పెట్టుకోండి.
తర్వాత ఒక చిన్న కడాయిలో తాళింపు కోసం నెయ్యి వేడి చేయండి. వేడయ్యాక, ఆవాలు, జీలకర్ర, తెల్ల నువ్వులు, ఇంగువ చీల్చిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి.
తయారుచేసుకున్న ఖండ్వీ రోల్స్‌పై ఈ తాలింపును సమానంగా పోయండి. పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయండి. అంతే ఖండ్వీ రెడీ. పుదీనా చట్నీ లేదా మీకు నచ్చిన చట్నీతో తింటే స్వర్గమే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications