Latest Updates
-
హోటల్ స్టైల్ ఇడ్లీ కారం పొడి..బ్రేక్ ఫాస్ట్ లోకి చట్నీ కూడా వద్దంటారు..ఇంట్లోనే ఇలా చేసుకోండి.. -
కిడ్నీలు పాడవడానికి ముందు కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఇవే -
ఇడ్లీ,దోశ,చపాతీల్లోకి కేక పుట్టించే చికెన్ నిర్వాణ..బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు -
పెద్ద ఎర్రిపప్ప అయ్యావ్ మావా: ప్రియురాలి కోసం మొత్తం అమ్మేసి 1900 కి.మీ ప్రయాణించి వెళ్తే..అసలు అమ్మాయే కాదట! -
దసరా స్పెషల్ నైవేద్యం చక్కెర పొంగలి..సంప్రదాయ పద్ధతిలో ఇలా చేస్తే ఇళ్లంతా డివోషనల్ వైబ్ -
దసరా స్పెషల్ కట్టె పొంగలి..ఇలా చేస్తే చల్లారినా కూడా గట్టిగా మద్ద అవ్వదు! -
దసరా నాడు అపరాజితా దేవి పూజ ఎలా చేయాలి? శుభ ముహూర్తం, మంత్రాలు, శమీ పూజ డీటెయిల్స్.. -
దసరా స్పెషల్ రెడ్ చికెన్.. చికెన్ కర్రీ వండేటప్పుడు ఈ సీక్రెట్ మసాలా వేస్తే టేస్ట్ నెక్ట్స్ లెవల్ అంతే! -
హ్యాపీ విజయదశమి 2026..మీ బంధుమిత్రులకు దసరా విషెస్ చెప్పండిలా.. -
దసరా స్పెషల్..పాకం పట్టే పనిలేకుండా ఈజీగా బెల్లం గవ్వలు చేసుకోండిలా..గుల్ల గుల్లగా భలే రుచిగా..
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే..
పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ లోకి రోజూ అదే ఇడ్లీలు, దోశలు, పూరీలు తింటూ ఉన్నారా? అయితే ఒకసారి వీటిన్నంటిని పక్కకు నెట్టేసి జొన్న గుగ్గిళ్లు ట్రై చేయండి. వారానికి ఒకసారి దీన్ని తిన్నా కూడా మీ శరీరం శక్తితో నిండిపోతుంది. 100 ఏళ్లు ఆరోగ్యంగా బతికించడంలో సాయపడే బ్రేక్ ఫాస్ట్ ఇది. దీని తయారీకి పెద్దగా ఆయిల్ కూడా అవసరం లేదు.
బ్యాచిలర్స్ సైతం దీన్ని ఈజీగా చేసుకోవచ్చు. పైగా ఇప్పుడంతా మిల్లెట్స్ ట్రెండ్ నడుస్తోంది. ఆరోగ్య రీత్యా మిల్లెట్స్ తో చేసిన ఆహారాలు తినేందుకు జనం ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో మిల్లెట్స్ తో ముందువరుసలో ఉండే జొన్నలలో టేస్టీగా గుగ్గిళ్లను ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి. సాయంత్రం స్నాక్ గా తినడానికి కూడా ఇది బాగుంటుంది.

తయారీకి కావాల్సిన పదార్థాలు
-జొన్నలు
-నీళ్లు
-ఉప్పు
-పసుపు
-వేరుశెనగపప్పు
-ఇంగువ
-వెల్లుల్లి
-నూనె లేదా నెయ్యి
-పచ్చిమిర్చి
-ఉల్లిపాయ
-ఎండుమిర్చి
-జీలకర్ర
-మినపగుళ్లు
-పచ్చి శెగనపప్పు
-ఆవాలు
-కరివేపాకు
-కొత్తిమీర
-క్యారెట్ తురుము లేదా పచ్చి కొబ్బరి తురుము
హోటల్ స్టైల్ ఇడ్లీ కారం పొడి..బ్రేక్ ఫాస్ట్ లోకి చట్నీ కూడా వద్దంటారు..ఇంట్లోనే ఇలా చేసుకోండి..
తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నె తీసుకోండి. అందులో 1 కప్పు జొన్నలు వేసుకోండి. అందులో నీళ్లు పోసి 2 సార్లు శుభ్రంగా జొన్నలను కడగాలి. తర్వాత అందులో 2 కప్పుల నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. లేదా 8 గంటలు నానబెట్టుకోవాలి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి కావాలనుకుంటే రాత్రి నానబెట్టుకోండి. సాయంత్రం స్నాక్ గా కావాలనుకుంటే ఉదయాన్నే నానబెట్టుకోండి.
-జొన్నలు నానిన తర్వాత అందులోని నీటిని వంపేయండి, మళ్లీ అందులో నీళ్లు పోసి ఒకసారి జొన్నలను శుభ్రంగా కడగండి.
-ఇప్పుడు కడిగిన జొన్నలను కుక్కర్ లో వేసుకోండి. ఇందులోనే పావు కప్పీ వేరుశెనగపప్పు వేసుకోండి. ఇందులోనే 1 కప్పు నీళ్లు పోసుకోండి. కుక్కర్ ని స్టవ్ మీద పెట్టి మూతపెట్టుకుని మీడియం మంట మీద 6 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి.
-కుక్కర్ లో ఫ్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి జొన్నలు ఉడికాయో లేదో చెక్ చేయండి. నొక్కి చూస్తే జొన్నలు మెత్తగా ఉంటే ఉడికిపోయినట్లే.
-ఉడికిన జొన్నలు, వేరుశెనగపప్పును ఒక జాలి గిన్నెలోకి తీసుకోండి. దీంతో అందులో ఉన్న అదనపు నీరంతా పోతుంది. వీటని పక్కన పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద తాలింపు కోసం ఒక పాన్ పెట్టుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ నూనె లేదా నెయ్యి వేసి వేడయ్యాక అందులో అర టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చి శెనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్లు వేసి వేయించుకోవాలి. అవి కొంచెం వేగాక ఇందులోనే 2 ఎండుమిరపకాయలు తుంపి వేసుకోండి. కావాలనుకుంటే ఇందులో 2 చల్ల మిరపకాయలు కూడా వేసుకోవచ్చు. ఇవి వేగిన తర్వాత అందులోనే 2 పచ్చిమిరపకాయల సన్నని తరుగు, 1 పెద్ద ఉల్లిపాయను పొడవుగా కట్ చేసుకుని వేసుకోండి. 6 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోండి. చివరగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి.
-ఉల్లిపాయలు లైట్ గా కలర్ మారేవరకు వేయించుకున్న తర్వాత అందులో పావు టీస్పూన్ పసుపు, పావు టీస్పూన్ ఇంగువ వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో ఉడికించుకున్న జొన్నలు,వేరుశెనగపప్పు వేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం కలిసేలా కలుపుకోండి. బరువు తగ్గాలనుకువాళ్లు ఉప్పు తక్కువ వేసుకుంటే మంచిది. ఇందులో కావాలనుకుంటే కొంచెం కారం కూడా వేసుకుని కలుపుకోవచ్చు. అంతా బాగా కలుపుకున్నాక మూతపెట్టి 2 నిమిషాలు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. దీంతో అన్నీ ప్లేవర్స్ జొన్నలకు బాగా పడతాయి.
-2 నిమిషాల తర్వాత మూత తీసి అందులో కావాలనుకుంటే పచ్చి కొబ్బరి తురుము లేదా క్యారెట్ తురుము, కొత్తిమీర తరుగు, కొంచెం నిమ్మరపం పిండుకోండి. అంతా బాగా కలిసేలా కలుపుకోండి.
-అంతే జొన్న గుగ్గిళ్లు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
