Latest Updates
-
హరిద్వార్ లో ఎండిపోయిన గంగానది? మగ్గులతో భక్తుల పుణ్యస్నానాలు..వీడియో చూడండి -
జుట్టు రాలడం ఆగి, ఒత్తుగా పెరగాలా? అయితే మెంతులను ఈ 3 రకాలుగా వాడండి -
నోరూరించే పనీర్ కొబ్బరి మసాలా..మళ్లీ మళ్లీ కావాలని అడిగి మరీ చేయించుకుంటారు -
గోధుమ పిండిలో ఈ 5 పదార్థాలు కలిపితే..జీవితంలో హాస్పిటల్స్ కు వెళ్లాల్సిన పనే ఉండదు! -
లివర్ ఆరోగ్యంగా, క్లీన్ గా ఉండాలంటే డాక్టర్ చెప్పిన 5 సింపుల్ టిప్స్.. -
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ!
సింపుల్ రెసిపీ, అద్భుతమైన రుచి..కొబ్బరి అట్టు ఎలా చేసుకోవాలంటే
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ వంటి దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ప్రసిద్ధి చెందిన ఒక సాంప్రదాయ అల్పాహారం కొబ్బరి అట్టు. ఇది సాధారణ దోశకు భిన్నంగా, కొబ్బరి రుచి, సువాసనతో ప్రత్యేకంగా ఉంటుంది. కొబ్బరి, బియ్యం పిండితో తయారయ్యే ఈ అట్టు రుచి, ఆరోగ్యం రెండింటినీ అందించే ఒక అద్భుతమైన అల్పాహారం. దీనిని సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీ దినచర్యలో ఈ రుచికరమైన,పౌష్టికమైన అల్పాహారాన్ని చేర్చుకోవడం ద్వారా మీరు ఆరోగ్యంగా ఉండటానికి ఒక అడుగు ముందుకు వేసినట్లే. కొబ్బరి అట్టు తయారీకి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
కొబ్బరి అట్టు తయారీకి కావాల్సిన పదార్థాలు
-ఉల్లిపాయ
-వెల్లుల్లి రెబ్బలు
-ఎండుమిర్చి
-నువ్వులు
-కొబ్బరి తురుము
-అల్లం
-పచ్చిమిర్చి
-జీలకర్ర
-పసుపు
-ఉప్పు

కొబ్బరి అట్టు తయారీ విధానం
-ముందుగా ఒకటిన్నర గ్లాసు బియ్యాన్ని బియ్యాన్ని గంటన్నర సేపు నానబెట్టాలి.
-తర్వాత మిక్సీ గిన్నెలో నానబెట్టిన బియ్యం,1 కొబ్బరి చెక్క తురుము, 3 స్పూన్ల నువ్వులు, 10 పచ్చిమిర్చి,2 చిన్న స్పూన్ల జీలకర్ర, 5ఎండుమిర్చి, 2 ఇంచుల అల్లం,4 వెల్లుల్లి రెబ్బలు,1 ఉల్లిపాయ ముక్కలు, కొంచెం నీళ్లు పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి.
-గ్రైండ్ చేసుకున్న పిండిలో సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, కొద్దిగా జీలకర్ర, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఉల్లికోడు వేసుకొని బాగా కలుపుకోవాలి. కొబ్బరి అట్టు పిండిని ఇడ్లీ లేదా దోశ పిండి లాగా పొంగబెట్టాల్సిన అవసరం లేదు. దీనిని వెంటనే తయారు చేసుకోవచ్చు. అయితే కొన్ని గంటలు పులయనిస్తే రుచి ఇంకా బాగుంటుంది.
-తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి బాగా వేడి చెయ్యాలి.
-పెనం వేడెక్కిన తర్వాత దానిమీద ఓ గుంట గరిటతో కలిపిన పిండిని తీసుకొని స్టవ్ మీద అట్టు పోసుకోవాలి.
-అట్టు పైన కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. నూనె లేదా నెయ్యితో అట్టుని రెండువైపులా బాగా కాల్చుకోండి. అంతే టేస్టీ కొబ్బరి అట్టు రెడీ. దీనిని నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే నోటికి స్వర్గమే.
ప్రయోజనాలివే
కొబ్బరిలో మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ (MCTs) పుష్కలంగా ఉంటాయి. ఇవి
శరీరం ద్వారా త్వరగా జీర్ణమై శక్తిగా మారతాయి. బియ్యం
కార్బోహైడ్రేట్ లను అందిస్తుంది.. ఇది రోజువారీ
కార్యకలాపాలకు అవసరమైన శక్తిని ఇస్తుంది. కొబ్బరిలో విటమిన్ సి, ఐరన్,
మెగ్నీషియం, పొటాషియం వంటి ముఖ్యమైన విటమిన్లు,మినరల్స్ ఉన్నాయి..ఇవి
శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. బియ్యం పిండి కూడా బి
విటమిన్లు వంటి కొన్ని పోషకాలను అందిస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
