Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
బోర్ కొట్టిన దోశలకు బదులు..అదిరిపోయే టమాటో దోశ, సింపుల్ గా క్షణాల్లోనే ఇలా చేసుకోండి
రెండు తెలుగు రాష్ట్రాల్లో పొద్దున్నే ఇళ్లల్లో కానీ లేదా హోటల్స్ లో కాని ప్రధానంగా తయారుచేసే వంటకం ఏదైనా ఉందంటే అది దోశనే. దోశ తినని తెలుగువారుండరు. అయితే రోజూ అవే మసాలా దోశలు,అవే ఎగ్ దోశలు, అవే ఆనియన్ దోశలు తిని తిని బోర్ కొట్టేసిందా? అయితే ఓసారి టమాటో దోశ ట్రై చేసి తీరాల్సిందే. మాటల్లో వర్ణించలేని టేస్ట్ టమాటో దోశ సొంతం. సాధారణంగా కడప సహా రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో దీనిని ఎక్కువగా తయారుచేస్తుంటారు.
ఈ టమాటో దోశను చాలా సింపుల్ గా అప్పటికప్పుడు తయారుచేసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇది నచ్చుతుంది. సింపుల్ గా అప్పటికప్పుడు తయారుచేసుకోగలిగే టమాటో దోశను మీ ఇంట్లో చేసుకోడానికి కావలసిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

టమాటో దోశ తయారీకి కావలసిన పదార్థాలు
-టమాటో
-ఎండుమిర్చి
-ఉప్పు
-వెల్లుల్లి
-మినపగుళ్లు
-బియ్యం
-నీళ్లు
టమాటో దోశ తయారీ విధానం
-ఒక గిన్నెలో శుభ్రంగా కడిగిన ముప్పావు కప్పు బియ్యం వేసి అందులో నీళ్లు పోసి రెండు గంటల సేపు నానబెట్టాలి.
-తర్వాత మరో గిన్నెలో అరకప్పు మినపగుళ్లు వేసి వీటిని కూడా శుభ్రంగా కడిగి నీళ్లు పోసి కనీసం రెండు గంటలు నానబెట్టుకోవాలి.
-రెండు గంటల తర్వాత నానిన బియ్యం,మినపగుళ్లను మిక్సీ గిన్నెలో వేసి ఇందులో 8 ఎండుమిర్చి, 3 పొట్టుతీసిన వెల్లుల్లి రెబ్బలు,4-5 టమాటోల ముక్కలు,రుచికి సరిపడా ఉప్పు వేసి నీళ్లు పోయకుండా పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
-గ్రైండ్ చేసుకున్న పిండిని ఓ గిన్నెలోకి తీసుకొని ఒక గంటసేపు పక్కనపెట్టుకోండి.
-గంట తర్వాత పిండిలో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ దోశ పిండిలా కలుపుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద దోశ పెనం పెట్టి వేడి చెయ్యాలి. పెనం వేడయ్యాక దాని మీద గరిట దోశ పిండిని వేసి స్ప్రెడ్ చేయాలి.
-దోశపైన పిండి తడి ఆరిపోయిన తర్వాత దానిమీద కొంచెం నెయ్యి వేసి దోశను బాగా కాల్చుకొని పెనం మీదనుంచి దించేయాలి. అంతే టమాటో దోశ రెడీ. మీకు నచ్చిన చట్నీతో దీన్ని ఆస్వాదిస్తే ఆ మజానే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
