Latest Updates
-
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
హెల్దీ బ్రేక్ ఫాస్ట్ సజ్జ దోశ..రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం..ఎలా చేసుకోవాలో చూడండి
ఇటీవల కాలంలో ప్రజలు ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి సారిస్తున్న క్రమంలో మిల్లెట్స్ ను తమ ఆహారంలో ఎక్కువగా భాగం చేసుకుంటున్నారు. పొద్దున్నే తినే బ్రేక్ ఫాస్ట్ నుంచి ప్రతి ఒక్క ఆహారంలో మిల్లెట్స్ ఉంచుకోడానికి ట్రై చేస్తున్నారు. సాధారణంగా మన తెలుగు ప్రజలు పొద్దున్నే తీసుకున్నే బ్రేక్ ఫాస్ట్ ఐటమ్స్ లో దోశ ప్రధానమైనది. కొంతమందికి పొద్దున్నే ప్రతిరోజూ దోశ కావాల్సిందే
అయితే దోశ తింటూనే మీరు ఆరోగ్యకరంగా ఉండాలనుకుంటున్నారా? అయితే ఓ సారి మిల్లెట్స్ లో ఒకటైన సజ్జలతో చేసే దోశ ట్రై చేయండి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం పొందొచ్చు. సజ్జ దోశ ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు చేస్తుంది. సజ్జ దోశ తయారుచేయడానికి కావలసిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

సజ్జ దోశ తయారీకి కావలసిన పదార్థాలు
-మినపప్పు
-సజ్జలు
-ఉప్పు
-ఆయిల్
-నీళ్లు
కుందాపుర స్టైల్ చికెన్ ఘీ రోస్ట్..కర్ణాటక రుచుల్లో రారాజు,జన్మలో మర్చిపోలేని రుచి..ఎలా చేసుకోవాలంటే
సజ్జ దోశ తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో 1 గ్లాసు మినపప్పు, రెండు గ్లాసుల సజ్జలు వేసి ఇవి మునిగేంతవరకు నీళ్లు పోసి కనీసం 3 గంటలు నానబెట్టాలి.
-తర్వాత మిక్సీ గిన్నెలో నానబెట్టిన సజ్జలు,మినపప్పు వేసి కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ దోసె పిండిలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండి కొంచెం బరకగా ఉండాలి.
-గ్రైండ్ చేసుకున్న పిండిని ఓ గిన్నెలో వేసి 5 గంటలపాటు పులియబెట్టాలి.
-తర్వాత పిండిలో రుచికి సరిపడా ఉప్పు,నీళ్లు పోసి దోశ పిండిలా కలుపుకోండి.
-తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి వేడి చెయ్యాలి. పెనం వేడెక్కిన తర్వాత 1 గరిట పిండితో దోశలా స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ పోసేటప్పుడు మంటను తక్కువలో ఉంచాలి..దోశ పోసిన తర్వాత పెద్ద మంట పెట్టాలి. దోశ చుట్టూ ఆయిల్ చుక్కలు పోయాలి. దోశ చుట్టూ ఎర్రగా అయిన తర్వాత దాన్ని పెనం మీద నుంచి తీసేయాలి.
-సజ్జ దోశను మీకు నచ్చిన చట్నీతో లేదా కొబ్బరికారంతో తిన్నా అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
