చుక్క నూనె లేకుండా లంచ్‌ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.!

బీట్‌రూట్‌ అనగానే రక్తహీనత సమస్యకి బెస్ట్ సొల్యూషన్ అనేది ఠక్కున గుర్తొస్తుంది. కానీ క్యారెట్‌ తిన్నంత ఇష్టంగా చాలా మంది బీట్‌రూట్‌ను తినరు. ఎక్కువగా జ్యూస్‌లు చేసుకుని తాగుతుంటారు. ఇలా బీట్‌రూట్‌ను ఎన్నో రకాలుగా మనం ఆహారంలోకి తీసుకుంటాం. ఈ సారి బీట్‌రూట్‌తో ఈజీగా ఇలా కొబ్బరి అన్నం ట్రై చేయండి. అది కూడా చూక్క నూనె లేకుండా. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రక్తహీనత సమస్యని నివారిస్తుంది. ఇంకా టైం లేనప్పుడు పిల్లలకి, పెద్దలకి లంచ్‌ బాక్స్‌లోకి సింపుల్‌గా చేసేయొచ్చు. బీట్‌రూట్‌ కొబ్బరి అన్నం ఎలా తయారుచేయాలో చూద్దాం..

healthy dish Beetroot coconut rice for anemia solution without oil

బీట్‌రూట్‌ కొబ్బరి అన్నం తయారీకి కావాల్సిన పదార్థాలు

బాస్మతి బియ్యం- పావు కేజీ(250 గ్రా)
నెయ్యి- టేబుల్‌ స్పూన్‌
పచ్చిశనగపప్పు- టీస్పూన్‌
మినప్పప్పు- టీస్పూన్‌
వేరుశనగ గుండ్లు- టీస్పూన్‌
జీడిపప్పు పలుకులు- పది
ఆవాలు- టీస్పూన్‌
జీలకర్ర- టీస్పూన్‌
ఇంగువ- కొద్దిగా
పచ్చిమిర్చి- మూడు
బీట్‌రూట్‌- రెండు(మీడియం సైజు)
తురిమిన పచ్చికొబ్బరి- అర కప్పు
ఉప్పు- టీస్పూన్‌

బీట్‌రూట్‌ కొబ్బరి అన్నం తయారీ విధానం

కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే..

ముందుగా బాస్మతి బియ్యాన్ని రెండు సార్లు కడిగి 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత సరిపడా ఎసరు పోసి అన్నం వండుకోవాలి.

బీట్‌రూట్‌ను తొక్క తీసి కడిగి గ్రేటర్‌ సాయంతో తురుముకోవాలి. పచ్చికొబ్బరిని కూడా తురుముకోవచ్చు లేదా మిక్సీలో గ్రైండ్‌ చేసుకోవచ్చు.

healthy dish Beetroot coconut rice for anemia solution without oil

ఇప్పుడు స్టవ్‌పైన వెడల్పాటి పాన్ పెట్టుకుని అందులో నెయ్యి వేసి కరిగిన తర్వాత పచ్చి శనగపప్పు, మినప్పప్పు, వేరుశనగ గుండ్లు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా ఇంగువ, కట్‌ చేసిన పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి.

ఇవన్నీ వేగిన తర్వాత బీట్‌రూట్‌, పచ్చికొబ్బరి తురుము వేసి కలపాలి. మూత పెట్టి రెండు నిమిషాల పాటు లేదా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి.

బీట్‌రూట్‌, కొబ్బరి నెయ్యిలో బాగా వేగిన తర్వాత వండుకున్న బాస్మతి అన్నం వేసి కలపాలి. నిమిషం పాటు చిన్న మంటపైన ఉడికించిన తర్వాత పైనుంచి కొత్తిమీర చల్లి స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవడమే.

కూరతో పనిలేదు.. నిమిషాల్లో తయారయ్యే సూపర్ టేస్టీ బెండకాయ రైస్..లంచ్ బాక్స్ లోకి సూపర్!

లంచ్‌ బాక్స్‌లోకి వేడివేడిగా బీట్‌రూట్‌ కొబ్బరి అన్నం రెడీ. ఇది శరీరానికి సరిపడా పుష్కలంగా పోషకాలను అందిస్తుంది. పిల్లలు, వృద్ధులు తప్పకుండా తీసుకోవాల్సిన రెసిపీ ఇది.

తరచూ తీసుకోవడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్‌ స్థాయిలు పెరిగి రక్తహీనత సమస్యను నివారిస్తుంది. చర్మం సహజంగా, కాంతివంతంగా మెరిసేందుకు దోహదపడుతుంది. మెరుగైన రక్షణను ఇస్తుంది.

[ of 5 - Users]
Story first published: Friday, September 4, 2026, 10:02 [IST]
Desktop Bottom Promotion