Latest Updates
-
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా!
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.!
బీట్రూట్ అనగానే రక్తహీనత సమస్యకి బెస్ట్ సొల్యూషన్ అనేది ఠక్కున గుర్తొస్తుంది. కానీ క్యారెట్ తిన్నంత ఇష్టంగా చాలా మంది బీట్రూట్ను తినరు. ఎక్కువగా జ్యూస్‌లు చేసుకుని తాగుతుంటారు. ఇలా బీట్రూట్ను ఎన్నో రకాలుగా మనం ఆహారంలోకి తీసుకుంటాం. ఈ సారి బీట్రూట్తో ఈజీగా ఇలా కొబ్బరి అన్నం ట్రై చేయండి. అది కూడా చూక్క నూనె లేకుండా. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రక్తహీనత సమస్యని నివారిస్తుంది. ఇంకా టైం లేనప్పుడు పిల్లలకి, పెద్దలకి లంచ్ బాక్స్‌లోకి సింపుల్‌గా చేసేయొచ్చు. బీట్రూట్ కొబ్బరి అన్నం ఎలా తయారుచేయాలో చూద్దాం..

బీట్రూట్ కొబ్బరి అన్నం తయారీకి కావాల్సిన పదార్థాలు
బాస్మతి బియ్యం- పావు కేజీ(250 గ్రా)
నెయ్యి- టేబుల్ స్పూన్
పచ్చిశనగపప్పు- టీస్పూన్
మినప్పప్పు- టీస్పూన్
వేరుశనగ గుండ్లు- టీస్పూన్
జీడిపప్పు పలుకులు- పది
ఆవాలు- టీస్పూన్
జీలకర్ర- టీస్పూన్
ఇంగువ- కొద్దిగా
పచ్చిమిర్చి- మూడు
బీట్రూట్- రెండు(మీడియం సైజు)
తురిమిన పచ్చికొబ్బరి- అర కప్పు
ఉప్పు- టీస్పూన్
బీట్రూట్ కొబ్బరి అన్నం తయారీ విధానం
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే..
ముందుగా బాస్మతి బియ్యాన్ని రెండు సార్లు కడిగి 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత సరిపడా ఎసరు పోసి అన్నం వండుకోవాలి.
బీట్రూట్ను తొక్క తీసి కడిగి గ్రేటర్ సాయంతో తురుముకోవాలి. పచ్చికొబ్బరిని కూడా తురుముకోవచ్చు లేదా మిక్సీలో గ్రైండ్ చేసుకోవచ్చు.

ఇప్పుడు స్టవ్‌పైన వెడల్పాటి పాన్ పెట్టుకుని అందులో నెయ్యి వేసి కరిగిన తర్వాత పచ్చి శనగపప్పు, మినప్పప్పు, వేరుశనగ గుండ్లు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా ఇంగువ, కట్ చేసిన పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి.
ఇవన్నీ వేగిన తర్వాత బీట్రూట్, పచ్చికొబ్బరి తురుము వేసి కలపాలి. మూత పెట్టి రెండు నిమిషాల పాటు లేదా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి.
బీట్రూట్, కొబ్బరి నెయ్యిలో బాగా వేగిన తర్వాత వండుకున్న బాస్మతి అన్నం వేసి కలపాలి. నిమిషం పాటు చిన్న మంటపైన ఉడికించిన తర్వాత పైనుంచి కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే.
కూరతో పనిలేదు.. నిమిషాల్లో తయారయ్యే సూపర్ టేస్టీ బెండకాయ రైస్..లంచ్ బాక్స్ లోకి సూపర్!
లంచ్ బాక్స్‌లోకి వేడివేడిగా బీట్రూట్ కొబ్బరి అన్నం రెడీ. ఇది శరీరానికి సరిపడా పుష్కలంగా పోషకాలను అందిస్తుంది. పిల్లలు, వృద్ధులు తప్పకుండా తీసుకోవాల్సిన రెసిపీ ఇది.
తరచూ తీసుకోవడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరిగి రక్తహీనత సమస్యను నివారిస్తుంది. చర్మం సహజంగా, కాంతివంతంగా మెరిసేందుకు దోహదపడుతుంది. మెరుగైన రక్షణను ఇస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications