ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్

Posted By:

బరువ తగ్గాలన్నా, జుట్టు ఒత్తుగా పెరగాలన్నా, షుగర్ బీపీ కొలెస్ట్రాల్ కంట్రోల్ లో ఉండాలన్నా , జీర్ణ సమస్యలు లేకుండా గట్ హెల్త్(పేగుల ఆరోగ్యం)బాగుండాలన్నా, థైరాయిడ్ సమస్య ఉన్నవారికి, పీరియడ్స్ ప్రాబ్లం ఉన్న ఆడవాళ్లకి చాలా చాలా మేలు చేస్తుంది కరివేపాకు అవిసె గింజల పొడి. డెలివరీ తర్వాత బరువు తగ్గాలనుకున్న వాళ్లు, పొట్ట తగ్గాలనుకునేవాళ్లు రాలిన జుట్టు ఒత్తుగా పెరగాలనుకున్నవాళ్లు అన్నంలో 1 స్పూన్ ఈ పొడి వేసుని 2 ముద్దలు తిన్నా చాలు.

టిఫిన్స్ లో కలుపుకుని కూడా దీన్ని ఆస్వాదించవచ్చు. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. చేయడం కూడా చాలా ఈజీ. ఎక్కువ పదార్థాలు కూడా అవసరం ఉండదు. రక్తహీనతను దూరం చేసి, ఎముకలకు బలాన్నిచ్చి, హార్మోనల్ ఇంబాలెన్స్ కు చెక్ పెట్టే కరివేపాకు అవిసె గింజల కారం పొడి మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Healthy karam podi how to make flaxseeds and curry leaves podi recipe in telugu

తయారీకి కావాల్సిన పదార్థాలు

-అవిసె గింజలు
-కరివేపాకు
-పచ్చి శెనగపప్పు
-ధనియాలు
-జీలకర్ర
-మెంతులు
-మినపప్పు
-నూనె
-ఎండుమిర్చి
-వెల్లుల్లి
-చింతపండు
-ఉప్పు
-పసుపు
-ఇంగువ

హోటల్ స్టైల్ ఇడ్లీ కారం పొడి..బ్రేక్ ఫాస్ట్ లోకి చట్నీ కూడా వద్దంటారు..ఇంట్లోనే ఇలా చేసుకోండి..

తయారీ విధానం

-ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకోండి. అందులో పావు కప్పు అవిసె గింజలు(flaxseeds)వేసి ఇవి చిటపటలాడేదాకా తక్కువ మంట మీద నిదానంగా వేయించుకోవాలి. తర్వాత వీటిని ఓ ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి.

-తర్వాత స్టవ్ మీద ఉన్న అదే పాన్ లో 1 టేబుల్ స్పూన్ పచ్చి శెనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసి అవి కొంచెం వేగాక అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీస్పూన్ జీలకర్ర, పావు టీస్పూన్ మెంతులు వేసి తక్కువ మంట మీద మాడిపోకుండా దోరగా వేయించాలి. వేగిన తర్వాత ఈ దినుసులన్నింటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు స్టవ్ మీద అదే పాన్ లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి వేడయ్యాక అందులో 12-15 ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. ఎండుమిరపకాయలు వేగిన తర్వాత ఇందులో 2 కప్పుల శుభ్రం చేసి తడి ఆరబెట్టుకున్న కరివేపాకు వేసుకుని వేయించుకోండి. కరివేపాకును ముందు రోజే శుభ్రంగా కడిగా క్లాత్ మీద ఆరబెట్టుకుంటే తడి అంతా పోయి బాగుంటుంది.

-కరివేపాకు క్రిస్పీగా(కరకరలాడేలా)అయ్యేంతవరకు వేయించుకున్నాక అందులో స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి.

-తర్వాత మిక్సీ జార్ లో 1 వెల్లుల్లి గడ్డ రెబ్బలు మొత్తం పొట్టు తీయకుండానే వేసి మొత్తగా గ్రైండ్ చేసుకోండి. దీనిని తీసి పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు మిక్సీ జార్ లో ముందుగా వేయించిన మినపప్పు, పచ్చిశెనగపప్పు మిశ్రమం మొత్తం వేసి గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఇందులోనే అవిసె గింజలు వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఇందులోనే వేయించిన కరివేపాకు ఎండుమిర్చి మిశ్రమం వేసి
తర్వాత ఇందులోనే వేయించుకున్నవన్నీ వేసుకోండి. ఇందులోనే రుచికి తగినట్లు ఉప్పు, కొద్దిగా పసుపు, కొంచెం చింతపండు, కొంచెం ఇంగువ వేసి మొత్తాన్ని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోండి.

-గ్రైండ్ చేసుకున్న పొడిని ఒక ప్లేట్ లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ పొడిలా ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి మిశ్రమం వేసి చేత్తో బాగా కలిసేలా కలుపుకోండి. చల్లారాక ఈ పొడిని డబ్బాలో నిల్వ చేసుకోండి.

[ of 5 - Users]
Story first published: Wednesday, October 21, 2026, 5:54 [IST]
Desktop Bottom Promotion