Latest Updates
-
డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ప్రతి చిన్న సమస్యకి మందులు వాడటం ఎంత ప్రమాదమో తెలుసా.? -
పెళ్లిళ్ల స్పెషల్.. హైడ్రా పాత్ షాహి రెడ్ చికెన్.. బ్యాచ్లర్స్ సైతం సింపుల్‌గా చేసుకునేలా.! -
అమర్నాథ్ యాత్రికులకు అలర్ట్.. బడ్జెట్ ఎక్కడ, ఎంతవుతుంది.. పూర్తి వివరాలు.! -
చర్మ సౌందర్యాన్ని ఇట్టే పెంచే పాలకూర.. దాబా స్టైల్లో నోరూరించేలా ఇలా చేయండి.! -
ఇంట్లోకి మురికి రాకుండా చేసే 5 బెస్ట్ డోర్ మ్యాట్లు.. వర్షాకాలంలో బెస్ట్ ఆప్షన్స్.! -
గుండెకి మేలు, ఎముకలకి బలం.. ఇంకా ఎన్నో.. రోజూ మెట్లు ఎక్కితే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా.! -
మహిళలు, పిల్లల ఎముకల బలానికి అమృతం లాంటి నల్ల మినపపప్పు చట్నీ..ఇడ్లీ,దోశెలతో సూపర్ టేస్ట్ -
హిందూ ధర్మంలో ‘లోక కల్యాణం’ అనే భావన ఎందుకు అంత గొప్పది? -
ముద్దు పెట్టుకునేటప్పుడు కళ్ళు ఎందుకు మూసుకుంటాం? కళ్ళు తెరిచి ముద్దు పెట్టుకుంటే ఏమవుతుంది? -
వంట రాని వారు కూడా చిటికెలో చేసే సూపర్ టేస్టీ స్నాక్.. ఆలూ కట్లీ చేసుకోండిలా..
రొటీన్ అన్నం,కూరలతో బోర్ కొట్టిందా? అయితే చిటికెలో ఈ పాలకూర రైస్ ట్రై చేయండి..మళ్లీ మళ్లీ తింటారు!
రోజూ తినే రొటీన్ అన్నం, కూరలతో బోర్ కొట్టిందా? అప్పటికప్పుడు నోటికి రుచిగా, అదే సమయంలో ఆరోగ్యానికి మేలు చేసేలా ఏదైనా వెరైటీగా చేసుకోవాలి అనుకుంటే పాలకూర రైస్ బెస్ట్ ఆప్షన్.
ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకైనా, మధ్యాహ్నం లంచ్ బాక్స్ లోకైనా, రాత్రి డిన్నర్ కైనా ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మిగిలిపోయిన అన్నంతో కూడా దీన్ని క్షణాల్లో చిటికెలో తయారు చేసుకోవచ్చు. బాస్మతి రైస్ వాడితే దీని రుచి మరింత అద్భుతంగా ఉంటుంది.

ఇన్ స్టంట్ పాలకూర రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు
పాలకూర - 1 పెద్ద కట్ట
ఉడికించిన అన్నం - తగినంత
నూనె - రెండున్నర టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి - 4
ఉల్లిపాయ - 1
కరివేపాకు - 2 రెమ్మలు
బిర్యానీ ఆకులు - 2
లవంగాలు - 3
యాలకులు - 2
దాల్చిన చెక్క - 2 చిన్న ముక్కలు
మిరియాల పొడి - అర టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
జీలకర్ర - అర టీస్పూన్
పసుపు - అర టీస్పూన్
తాజా పెరుగు - 2 టేబుల్ స్పూన్లు
నెయ్యి, జీడిపప్పు - కొద్దిగా
ఇన్ స్టంట్ పాలకూర రైస్ తయారీ విధానం
-ముందుగా ఒక కట్ట పాలకూరను తీసుకుని, శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో కొద్దిగా నూనె వేయాలి. నూనె వేడెక్కాక తరిగిన పాలకూరను వేసి సన్నని మంటపై 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. పాలకూర రంగు మారకుండా పచ్చగా ఉండాలంటే ఉడికేటప్పుడు మూత పెట్టకూడదు. ఇందులోనే రెండు పచ్చిమిర్చి వేసి కాస్త వేయించి స్టవ్ ఆపేయాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత, మిక్సీ జార్ లో వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు అదే పాన్ లో మరో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. నూనె వేడెక్కాక బిర్యానీ ఆకులు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క ముక్కలు వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత అర టీస్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి.
-ఉల్లిపాయలు కాస్త మగ్గాక మిగిలిన రెండు పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు రెమ్మలు వేసి కలుపుకోవాలి. తర్వాత ఇందులో అర టీస్పూన్ పసుపు, రెండు టేబుల్ స్పూన్ల చిలికిన తాజా పెరుగు వేసి మిశ్రమం అంతా బాగా కలిసేలా వేయించాలి.
-పెరుగు మిశ్రమం వేగిన తర్వాత, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్‌ను ఇందులో వేసి పచ్చివాసన పోయేలా కాసేపు ఉడికించాలి. ఆ తర్వాత అర టీస్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
-చివరగా ఉడికించి చల్లార్చిన అన్నాన్ని (లేదా మిగిలిపోయిన అన్నాన్ని) ఇందులో వేసి, ఆకుపచ్చని పాలకూర మిశ్రమం, మసాలాలు అంతా అన్నానికి పట్టేలా నిదానంగా కలుపుకోవాలి. అన్నం విరిగిపోకుండా జాగ్రత్తపడాలి.
-అంతే ఎంతో రుచికరమైన, ఘుమఘుమలాడే ఇన్ స్టంట్ పాలకూర రైస్ రెడీ. దీనికి మరింత రుచిని జోడించాలనుకుంటే, చివరగా కొద్దిగా నెయ్యిలో వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications