Latest Updates
-
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.!
Jowar kichidi : జొన్న ఖిచిడి..టేస్టీ అండ్ హెల్దీ..ఇలా చేశారంటే అమృతమే
ప్రస్తుతం అనారోగ్య సమస్యల కారణంగా చాలా మంది ఆరోగ్యకరమైన ఆహారం తినేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆరోగ్యానికి మేలు చేసే వాటిలో మిల్లెట్స్ లో ఒకటైన జొన్నలు ముందువరుసలో ఉంటాయి. జొన్నలతో చాలా రకాల ఆహారాలు తయారు చేసుకోవచ్చు. జొన్నలతో తయారు చేసుకునే వాటిల్లో జొన్న కిచిడీ కూడా ఒకటి. ఈ కిచిడి ఎంతో రుచికరంగా ఉండడంతోపాటు, ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. జొన్న ఖిచిడీలో ఫైబర్, ప్రోటీన్, ఐరన్, మెగ్నీషియం, భాస్వరం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
శరీరానికి శక్తిని, జీర్ణక్రియను మెరుగుపరచడంలో, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో, మలబద్ధకాన్ని నివారించడంలో,మధుమేహాన్ని నియంత్రించడంలో,బరువు తగ్గడానికి సహాయపడే జొన్న ఖిచిడి ఎలా తయారుచేయాలో ఇక్కడ చూడండి.

జొన్న ఖిచిడి తయారీకి కావలసిన పదార్థాలు
జొన్న రవ్వ - 1 కప్పు
పెసర పప్పు - 1/2 కప్పు
పసుపు - 1/2 టీస్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
ఆవాలు - 1 టీస్పూన్
అల్లం-వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
కరివేపాకు - కొన్ని ఆకులు
కొత్తిమీర - కొద్దిగా
టమోటా - 1
పచ్చిమిర్చి - 2
ఉల్లిపాయ - 1
ఆయిల్ - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - తగినంత
తిన్న వెంటనే చేయకూడని పనులు ఇవే..పొరపాటున చేస్తే హాస్పిటల్ బెడ్ మీద గ్యారెంటీ!
జొన్న ఖిచిడి తయారీ విధానం
-ముందుగా పెసర పప్పును శుభ్రంగా కడిగి 15 నిమిషాలు నానబెట్టాలి.
-తర్వాత స్టవ్ మీద ఒక మందపాటి గిన్నెలో ఆయిల్ వేడి చేసి అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి.
-తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి.
-ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం వేయించాలి.
-తర్వాత అందులో టమోటా ముక్కలు, పసుపు, ఉప్పు వేసి టమోటా మెత్తబడే వరకు ఉడికించాలి.
-ఇప్పుడు అందులో నానబెట్టిన పెసర పప్పు, జొన్న రవ్వ వేసి బాగా కలపాలి.
-తర్వాత అందులో 3 కప్పుల నీళ్లు పోసి మూతపెట్టి 15-20 నిమిషాలు తక్కువ మంటపై ఉడికించాలి.
-ఖిచిడీ ఉడికిన తర్వాత కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే జొన్న ఖిచిడి రెడీ. కిడ్నీ సమస్యలు ఉన్నవారు జొన్న ఖిచిడీని మితంగా తీసుకోవాలి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications