Latest Updates
-
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే!
తిన్న వెంటనే చేయకూడని పనులు ఇవే..పొరపాటున చేస్తే హాస్పిటల్ బెడ్ మీద గ్యారెంటీ!
ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఫుడ్ తీసుకుంటే మాత్రమే సరిపోదు..అది ఏ సమయంలో తీసుకోవాలో కూడా తెలిసి ఉండాలి, అది తిన్న తర్వాత ఏం చేయాలి,చేయకూడదో కూడా తెలుసుకోవడం ముఖ్యం. మనలో చాలామంది భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగడం, స్నానం చేయడం, సిగరెట్ తాగడం, నిద్రపోవడం లేదా ఛాయ్ కాఫీలు లేదా వంటి తాగుతుండటం లేదా చేస్తుంటారు. మీరు కూడా అలా చేస్తుంటే వెంటనే ఈ అలవాట్లు మానుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భోజనం చేసిన వెంటనే ఈ పనులు చేయడం వల్ల జీర్ణక్రియపై ప్రభావం పడుతుంది. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. భోజనం తిన్న వెంటనే చేయకూడని కొన్ని పనులను ఇప్పుడు తెలుసుకుందాం.
సిగరెట్ తాగడం
భోజనం చేసిన వెంటనే చాలామందికి సిగరెట్ తాగే అలవాటు ఉంటుంది కొందరు అయితే భోజనం తిన్న చేతిని కుడుక్కున్నసెకన్ల వ్యవధిలో సిగరెట్ తాగడం మొదలుపెడతారు. అయితే ఇది చాలా ప్రమాదకరమైన అలవాటు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భోజనం చేసిన వెంటనే సిగరెట్ తాగడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. సిగరెట్ లోని నికోటిన్ జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. ఇది గుండె సంబంధిత సమస్యలకు దారి తీస్తుంది.

నిద్రపోవడం
భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. దీనివల్ల అజీర్ణం, గుండెల్లో మంట, నిద్రలేమి వంటి సమస్యలు వస్తాయి. తిన్న తర్వాత కనీసం అరగంట లేదా గంట తర్వాత నిద్రపోవడం బెటర్ అని నిపుణులు తెలిపారు.
టీ,కాఫీ
భోజనం చేసిన వెంటనే టీ,కాఫీ తాగే తాగుతారు చాలామంది. అయితే ఇలా చేయడం వల్ల తిన్న ఆహారంలోని పోషకాలు, ఐరన్ వంటివి శరీరం గ్రహించే శక్తి క్షీణిస్తుంది. ఇందుకు వీటిలోని ఫినోలిక్ సమ్మేళనాలే కారణమని నిపుణులు తెలిపారు. అందువల్ల తిన్న వెంటనే కాకుండా ఒక గంట తర్వాత తక్కువ మోతాదులో టీ లేదా కాఫీ తాగితే ఎలాంటి సమస్యా ఉండదని చెప్పారు.
తిన్న వెంటనే నీళ్లు తాగడం
తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల ఆహారం జీర్ణం కావడానికి సహకరించే ఎంజైమ్స్, జీర్ణ రసాలు వంటివి పొట్టలో తక్కువగా ఉత్పత్తవుతాయి. దీంతో ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. ముఖ్యంగా చల్లటి నీరు ఆహారంలోని కొవ్వులను గడ్డకట్టేలా చేస్తుంది, దీనివల్ల జీర్ణం కావడం కష్టమవుతుంది. అందువల్ల భోజనం చేసిన గంట తర్వాత ఓ గ్లాసు నీళ్లు తాగడం బెటర్ అని నిపుణులు చెబుతున్నారు. గోరువెచ్చని నీటిని తాగడం మంచిది.
స్నానం చేస్తున్నారా?
చాలామందికి తిన్న తర్వాత స్నానం చేసే అలవాటు ఉంటుంది. సాధారణంగా తీసుకున్న ఆహారం జీర్ణం కావడానికి తగిన శక్తి, పొట్టకు సరైన రక్తప్రసరణ అవసరం. అయితే స్నానం రక్తప్రసరణపై ప్రభావం చూపి శరీర ఉష్ణోగ్రతను అదుపు చేస్తుంది. భోజనం చేసిన వెంటనే స్నానం చేయడం వల్ల రక్త ప్రసరణలో మార్పులు వస్తాయి. జీర్ణక్రియకు అవసరమైన రక్తం జీర్ణాశయం నుండి చర్మం వైపు మళ్ళుతుంది, దీనివల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. దీనివల్ల అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి భోజనం చేసన అరగంట లేదా 45 నిమిషాల తర్వాత స్నానం చేయడం బెటర్ అని నిపుణులు చెబుతున్నారు.
ఫ్రూట్స్ అప్పుడే తినాలి
తిన్న వెంటనే ఏదో ఒక పండు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని అంటుంటారు. అయితే భోజనం చేసిన తర్వాత పండ్లు తినేకంటే బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఫ్రూట్స్ తీసుకున్నట్లయితే వాటిలోని పోషకాలను శరీరం మరింత సమర్థంగా గ్రహిస్తుందని నిపుణులు చెబుతున్నారు వైద్యులు. ఒకవేళ భోజనం తర్వాత తీసుకుంటే ఇతర పదార్థాలతో అది కలిసిపోయి వాటిలోని సంపూర్ణ పోషకాలు శరీరానికి అందవని డాక్టర్లు చెబుతున్నారు.
వ్యాయమం కూడా
భోజనం చేసిన వెంటనే వ్యాయామం చేయడం వల్ల జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది. రక్త ప్రసరణ కండరాల వైపు మళ్ళుతుంది, దీనివల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. కాబట్టి తిన్న తర్వాత కనీసం గంట తర్వాత వ్యాయామం చేయడం మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications